కె.ఎస్.చిత్ర, Chitra.K.S
- చిత్రగా సుపరిచితురాలైన కె.ఎస్.చిత్ర, భారతీయ సినీరంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అనిబిరుదందుకున్న ఈమె మలయాళం,తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మరియు బెంగాలీ భాషల సినిమాలకుగాత్రదానం చేసింది.
- బాల్యములో తండ్రి ఈమె , ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలరుషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్దకర్ణాటక సంగీతములో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె మళయాల సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళసినిమారంగములో అడుగుపెట్టింది. దక్షినాది భాషలు మరియు హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయాభాషలలో పాటలను చక్కగా పాడగలదు.
- పేరు : చిత్ర .కె.యస్.
- జన్మ నామము : చిత్రా కృష్ణన్ నాయర్ ,
- పుట్టిన తేది : చిత్ర, 1963, జూలై 27న
- పుట్టిన ఊరు : కేరళలోని తిరువనంతపురములో,
- కుటుంబము : సంగీతకారుల కుటుంబములో జన్మించింది.
- తండ్రి : కృష్ణన్ నాయర్,
- భర్త : విజయ్ శంకర్(engineer) ,
- తోబుట్టువులు : ఒక అక్క(Beena ,K.S) , ఒక తమ్ముడు ,
- కుమార్తె : నందన -- పెళ్ళి అయిన 15 సంవత్సరాలకు జన్మించిన ఒకేఒక కూతురు 9 యేళ్ళ వయసు లో దుబాయ్ లో స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదవశాత్తు పడి మరణించినది .
- చిత్ర వేలకొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళానేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతరనేపథ్యగాయకురాలు అందుకోలేదు.
- 1986 - సింధుభైరవి, తమిళ సినిమా- *
- 1987 - నఖక్షతంగళ్, మలయాళ సినిమా-*
- 1989 - వైశాలీ, మలయాళసినిమా
- 1996 - మిన్సార కనువు, తమిళ సినిమా- *
- 1997- విరాసత్, హిందీ సినిమా-*
- 2004 - ఆటోగ్రాఫ్, తమిళ సినిమా
- కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు,
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 7 అవార్డులు,
- తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు,
- కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది.
- ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్రప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలిగాయనిగా రికార్డు సృష్టించింది.
- చిత్ర వేలకొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలు రికార్డు చేసారు.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog