బాపు, Bapu
పరిచయం(introduction) :
పురస్కారాలు
- బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలోభాగమయ్యాయి. బాపు చిత్రం పడని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాలముఖచిత్రాలూ లెక్ఖ పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామనువర్ణించడానికీ వాడుతారు.
- పేరు : బాపు అసలు పేరు "సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ".
- పుట్టిన తేది : డిసెంబర్ 15, 1933 ,
- పుట్టిన ఊరు : పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం(ఆంధ్రప్రదేశ్ ),
- కులము : తెలుగు బ్రాహ్మిన్ ,
- తల్లిదండ్రులు : సత్తిరాజు వేణుగోపాలరావు - సూర్యకాంతమ్మ .
- చదువు : B.com(1953),1955 వసంవత్సరం లో మద్రాస్విశ్వవిద్యాలయంనుండిలాయర్ పట్టాపుచ్చుకున్నారు.
- ఉద్యోగం : ఆంద్ర పత్రిక' అనేదిన పత్రిక లో వ్యంగ్యచిత్రకారునిగాచేరారు. బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి.స్టీవార్ట్స్ సంస్థలోనూ పని చేశారు.
- కుటుంబము : భార్య - యస్.వి.భాగ్యవతి , సంతానము -ఒక అమ్మాయి , ఇద్దరు అబ్బాయిలు .
- మరణం : 31/08/2014--ఆదివారం సాయంత్రం చెన్నైలోని మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- బాపు చిత్రకళ ఒక విషయానికి పరమితంకాలేదు. 1945 నుండీ బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాలముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కధలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖానుపుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్నశుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు.
- బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులోబాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
- నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధానలక్షణాలు కనిపిస్తాయి.
- పొదుపుగా గీతలు వాడటం.
- ప్రవహించినట్లుండే ఒరవడి,
- సందర్భానికి తగిన భావము,
- తెలుగుదనము,
- బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి రూపొందించిన 'బుడుగు' పుస్తకం తెలుగుసాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో 'బుడుగు' తో పాటు 'సిగానపెసూనంబ' తెలుగువారి హృదయంలోచిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానులమన్నలందుకొన్నాయి.
- 1967లో 'సాక్షి' చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలుఅందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976లొ వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసెవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది.
- రాధాగోళం సినిమాకు స్టోరీబోర్డు చిత్రాలు - ముందుగా గీసిన చిత్రాలతోబాటు సినిమాతసిన తరువాతి షాట్లనుకూడా చూడవచ్చును.
- సుందరకాండ (2008)--
- రాధా గోపాళం (2005)--
- రాంబంటు (1996)--
- పెళ్ళికొడుకు (1994)--
- పరమాత్మా (హిందీ)(1994)--
- కవిసార్వభౌమ (1993)--
- మిష్టర్ పెళ్ళాం (1993)
- --పెళ్ళి పుస్తకం (1991)--
- ప్రేమ్ ప్రతిగ్యా (హిందీ) (1989)--
- జలా (హిందీ) (1987)--
- ప్యార్ కా సిందూర్ (హిందీ)(1986)--
- కళ్యాణ తాంబూలం (1986)--
- మేరా ధరమ్ (హిందీ) (1986)
- --ప్యారీ బెహనా (హిందీ)(1985)--
- బుల్లెట్ (1985)--జాకీ (1985)--
- మోహబ్బత్ (1985)--
- సేత (1984)--
- మంత్రిగారి వియ్యంకుడు (1983)--
- వోహ్ సాత్ దిన్ (హిందీ) (1983)
- --ఏది ధర్మం ఏది న్యాయం (1982)--
- కృష్ణావతారం (1982)--
- నీతిదేవన్ మయగుగిరన్ (తమిళం)(1982)-
- పెళ్ళీడు పిల్లలు (1982)--
- బేజుబాన్ (1981)--
- రాధా కళ్యాణం (1981)--
- త్యాగయ్య (1981)--
- హమ్ పాంచ్ (హిందీ)(1980)--
- వంశవృక్షం (1980)--
- కలియుగ రావణాసురుడు (1980)--
- పండంటి జీవితం (1980)--
- రాజాధిరాజు (1980)--
- తూర్పు వెళ్ళే రైలు (1979)--
- మనవూరి పాండవులు (1978)--
- అనోఖా శివభక్త్ (హిందీ) (1978)--
- గోరంత దీపం (1978)--
- స్నేహం (1977)--
- భక్త కన్నప్ప (1976)--
- సీతాస్వయంవర్ (హిందీ) (1976)--
- శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ (1976)--
- సీతాకల్యాణం (1976)--
- ముత్యాల ముగ్గు (1975)--
- శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)--
- అందాల రాముడు (1973)--
- సంపూర్ణ రామాయణం (1971)--
- బాలరాజు కధ (1970)--
- ఇంటి గౌరవం (1970)--
- బుద్ధిమంతుడు (1969)--
- బంగారు పిచ్చుక (1968)--
- సాక్షి (1967).
- 1967లో సాక్షి సినిమా ద్వారా దర్శకునిగా బాపు పరిచయమయ్యారు.
- 1975లో వచ్చిన ముత్యాలముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు
- 1982లో చెన్నైలో శ్రీరాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం
- 1986లో రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం
- 1991లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ
- 1992లో అమెరికా తెలుగు అసోసియేషన్ నుంచి శిరోమణి అవార్డు
- 1993లో మిస్టర్ పెళ్లాం చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు
- 1995లో తానా గోల్డెన్ జూబ్లీ వెడుకల్లో ఘన సన్మానం
- 2001లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కర్టూనిస్ట్ జీవిత సాఫల్య పురస్కారం
- 2001లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
- తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
- 2013లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
- తొలిసారి హిందీలో దర్శకత్వం వహించిన చిత్రం ప్రేమ్ ప్రతిజ్ఞా(1989)
- బాపు దర్శకత్వం వహించిన చివరిచిత్రం శ్రీరామరాజ్యం(2011)
- బాపు గారికి స్వదేశీ,విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి.అందులో ముఖ్యమయినవి కొన్ని.
- బాపు గారి దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా(1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యా కి ఉత్తమ చాయగ్రాకుడిగా పురస్కారం.
- 1986 వ సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారకపురస్కారం స్వర్గస్తులయిన మదర్ తెరిస్సా బహుకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తోకలసి స్వీకారం.
- చెన్నై(తమిళనాడు)లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిస్టాత్మకమయిన రాజలక్ష్మి పురస్కారంవ సంవత్సరంలో ఇవ్వబడింది.
- 1982 - 1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహుకరణ.
- 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలోస్వీకరణ.
- మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 వ సంవత్సరం)
- 1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(TANA) వారిచే తెలుగు చిత్రకళా,సాహిత్య,సాంస్కృతిక,సినిమా రంగాలకి తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకి గాను ఘనసన్మానం.
- బాపు గారిమీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వసంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం.
- 9 జూన్,2001 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్ (IIC) వారిచే జీవిత సాఫల్యపురస్కారం తో సన్మానం.
- 2 జూన్,2001 వ సంవత్సరంలో డిసెంబర్ న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే విశిష్టపురస్కారంతో గౌరవం.
- అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు భాహుకరణ.
- బాలరాజు కథ(1970),అందాల రాముడు(1973),ముత్యాల ముగ్గు(1975),పెళ్లి పుస్తకం(1991),మిస్టర్పెళ్ళాం(1993) సినిమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
- source :స్వాతి వారపత్రిక
- ========================



Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog