రేలంగి వెంకట్రామయ్య,VenkataramayyaRelangi
- రేలంగి వెంకట్రామయ్య తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, హాస్యనటులలో పేరెన్నికగన్నవారు. ఇంటిపేరు రేలంగితో ప్రసిద్ది పొందారు. 50 మరియు 60 దశకాలలో రేలంగి లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని నవ్వుల్లో ముంచెత్తిన రేలంగి వెంకట్రామయ్య పెద్దగా చదువుకోలేదు. రంగస్థల నటుడిగా , తబలిస్ట్ గా కొన్నాళ్ళు గడిపారు . వేషాల కోసం తిరుగుతూ, 1935లో కలకత్తా వెడుతున్న 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రం యూనిట్లో కలిసిపోయారు. దారిలో అందరితో మంచిగా వ్యవహరిస్తూ కలకత్తా చేరాక ముఖ్యులను పట్టుకుని, యూనిట్‌కి అన్ని రకాలుగా సాయం చేస్తూ, ఆ చిత్రంలో చిన్న వేషం వేశారు. తరువాత దర్శకుడు సి.పుల్లయ్యను వెన్నంటి ఉంటూ, 'ధ్రువ విజయం'లో ఇంద్రుడి పాత్ర సంపాయించుకున్నారు. అలా ఏడేళ్లు అంటే 1942 వరకు అష్టకష్టాలు పడిన తర్వాత ఏలిననాటి శని వదిలి 'బాలనాగమ్మ' చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.ఇక అక్కణ్ణించి హాస్యనటుడుగా ఎదిగిపోతూ, కొన్ని చిత్రాల్లో హీరో లాంటి పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, పౌరాణిక చిత్రాల్లో నారదుడు, లక్ష్మణ కుమారుడు, తది తర పాత్రలు పోషించి మెప్పించారు. గాయ కుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు.
- పేరు : రేలంగి వెంకట్రామయ్య,
- ఊరు : రావులపాడు-తూర్పుగోధావవరి జిల్లా ,
- పుట్టిన తేదీ : 13/ఆగస్ట్ /1910,
- వృత్తి : Actor and Playback Singer,
- మొదటి సినిమా : శ్రీక్రిష్ణ తులాభారము (1935),
- మొదటి పాట పాడిన సినిమా : బ్రతుకు తెరువు (1953),
- మరణము : 26 నవంబర్ 1975 లో చనిపోయారు .
- భార్య : శ్రీదేవమ్మ (Sridevamma, from Tadepalligudam),
- కొడుకు : రేలంగి సత్యనారాయణ బాబు (ఒకే సంతానము 1939 లో పుట్టాడు),
- కూతురు వరస కూతురు : రాజేశ్వరి ,
- మనుమలు మనుమరాళ్ళు : అరుగురు 2 మగ 4 ఆడ ,
- కోడలు : కుషుమ కుమారి (1958 లో పెళ్ళి జరిగినది )
- నిర్మాతగా : తెలుగు సినిమా - సమాజం (1960),
నటించిన కొన్ని సినిమాలు :
- మాయాబజార్">మాయాబజార్ (లక్ష్మణకుమారుడు),
- నర్తనశాల">నర్తనశాల (ఉత్తరకుమారుడు)
- తోడికోడళ్ళు (1957 సినిమా)">తోడికోడళ్ళు,
- మిస్సమ్మ">మిస్సమ్మ చిత్రాలలో రేలంగి నటన చిరస్మరణీయం. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.
- 1. గంగా మంగ (1973)
- 2. తల్లి తండ్రులు (1970)
- 3. ఆడ పడుచు (1967)
- 4. భక్త ప్రహ్లాద (1967)
- 5. గూఢచారి 116 (1967)
- 6. రహస్యం (1967)
- 7. లేత మనసులు (1966)
- 8. నవరాత్రి (1966)
- 9. అంతస్తులు (1965)
- 10. చిట్టి చెల్లెలు (1965)
- 11. ప్రేమించి చూడు (1965)
- 12. సత్య హరిశ్చంద్ర (1965)
- 13. ఆత్మా బలం (1964)
- 14. పూజాఫలం (1964)
- 15. రాముడు భీముడు (1964)
- =======================
- డా.వండాన శేషగిరిరావు -శ్రీకాకుళం
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog