తమన్నాభాటియా ,Tamannaa Bhatia
- ------------------------------------
పరిచయం :
- తమ్మన దక్షిన భారత సిని నటి మరియు మోడల్ . ఈమె సినిమా కెరీర్ హిందీ ఫిల్మ్ "చాంద్ స రోషన్ చేహ్ర" తో 13 సంవత్సరాల వయసు లో మొదలైనది . తరువాత తమిళ ఫిల్మ్ "కేడి " & తెలుగు లో మనోజ్కుమార్ సినిమా "శ్రీ" సినిమా తో తెలుగు తెరకు పరిచయమైనది. "శ్రీ" లో నటించినా అది పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
- సింధీ సుందరి తమన్నా? ' నన్నూ అచ్చ తెలుగు అమ్మాయిగానే చూడండి' అంటోంది చక్కగా నేర్చుకున్న తెలుగులో.
ప్రొఫైల్ :
- పూర్తి పేరు :తమన్నా భాటియా ,
- ముద్దు పేరు : తమ్ము ,
- చదువు : బి.ఎ,
- తండ్రి - సంతోష్ భాటియా .
- తల్లి - రజిని భాటియా .
- పుట్టిన తేది - 21- డిసెంబర్ - 1989.
- ఎత్తు : 5' 6'' ,
- సోదరుడు - ఆనంద భాటియా .
- హాబీస్ : డాన్సింగ్ , బుక్ రీడింగ్ ,
- మాట్లాడే భాషలు - తమిళ్ ,తెలుగు , హిందీ , ఇంగ్లిష్.
- అభిమాన నటుడు : హ్రితిక్ రోషన్
- అభిమాన నటి : మాధురి డిక్షిత్ ,
- హిందీ : చాంద్ స రోషన్ చేహరా (2003),
- తెలుగు సినిమా : ' శ్రీ ' (2005),
- తమిళ్ : కేడి (2006),
- "ఫెయిర్ అండ్ లవ్లీ" ప్రకటనలో మెరిసిపోతూ కన్పించే అందాల భామ తమన్నా. ఆ ప్రకటనను ఆమెఇప్పటికీమర్చిపోలేదు. తనకు దాని ద్వారానే సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని చెబుతోంది. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లోబిజీగాఉంటున్న తమన్నా తాజాగా నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించే చిత్రంలో అవకాశాన్నిదక్కించుకుంది. ఆతర్వాత తమిళ సినిమా "జాదు"లో రవికృష్ణ సరసన నటించారు . ప్రస్తుతం "నిన్న నేడు రేపు" సినిమా చేశాru. 'హ్యాపీ డేస్' సక్సెస్ అయిన తరువాత హీరోయిన్ తమన్నా ఇప్పుడు మరి కొన్ని తెలుగు సినిమాలలో నటిస్తోంది. 'హ్యపీడేస్' చిత్రంలో చక్కని నటనను ప్రదర్శించిన టీనేజ్ బ్యూటీ తమన్నా , అక్కినేని నాగార్జున మేనల్లుడైన్ సుషాంత్ సరసన నటించిన 'కాళిదాసు' చిత్రంలో తనే స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పాలని ఉబలాట పడింది. ఇదిలావుండగా అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పరుగు" చిత్రంలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో ఈ ముద్దుగుమ్మ మంచి బిజీగా మారిపోయింది. శ్రీను వైట్ల తాజా చిత్రం "రెడీ". ఈ సినిమాలో రామ్, జెనీలియా హీరోహీరోయిన్లు. అయితేసినిమాకు అదనపు హంగులు సమకూర్చడానికి శ్రీను వైట్ల, నవదీప్,, తమన్నాలను, అతిధినటులుగా ఎంపికచేసుకున్నట్టు తెలుస్తోంది.
- తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టి తొమ్మిదేళ్లయింది. ముంబయిలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన నేను ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డాను. ఎందుకు ఇలా అన్నానంటే... హ్యాపీడేస్ నుంచి ఆగడు దాకా చాలా సినిమాల షూటింగులతో నేనిక్కడే ఉంటున్నాను కాబట్టి. నాకు ఎక్కువ విజయాలు లభించింది కూడా తెలుగులోనే. నేను పెరిగింది మెట్రో నగరాల్లో. పరికిణీ ఓణీ, చీరకట్టూ, ఉగాది పచ్చడీ, పూర్ణం బూరెలూ, రంగుల ముగ్గులూ ఇక్కడికొచ్చాకే తెలిశాయి. సంక్రాంతి పండగని మేం కూడా ముంబయిలో జరుపుకునే వాళ్లం. కానీ వేరే పేరుతో. ముగ్గుల సందడి ఉండేది కాదు. సంక్రాంతి రోజున అమ్మ నువ్వుండలు చేసేది. అమ్మానాన్నలు పూజ చేస్తుంటే నేనూ వాళ్లతో కూర్చుని, మంత్రాలు చదివేదాన్ని. కొత్త సంవత్సరం రోజున కొన్ని తీర్మానాలు పెట్టుకుంటాం కదా! కాలేజీ రోజుల్లో నేనూ అలాగే చేసేదాన్ని. కానీ వారం, పది రోజులయ్యేప్పటికి మరిచిపోయేదాన్ని. సంక్రాంతి సెలవులు అయిపోయేప్పుడు జ్ఞానోదయం అయ్యేది. లేదు, నేనలా చేయకూడదు... అనుకున్న వాటిని కచ్చితంగా పాటించాలి అని సంక్రాంతికి తీర్మానించుకునేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఎందుకిదంతా... సంక్రాంతి రోజే భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసుకుని, నిర్ణయాలు తీసుకుంటే సరిపోదా అనిపించింది. కొన్ని సంవత్సరాలుగా అలాగే చేస్తున్నా. లైఫ్ హ్యాపీగానే సాగిపోతోంది.
- నిజానికి సినీ పరిశ్రమకు వచ్చాకే అసలు పండగ అంటే ఏంటో తెలిసింది. అందుకే అమ్మానాన్నలనూ ఇక్కడికే రమ్మంటున్నా. ఇక, నాకు సంప్రదాయ దుస్తులంటే చాలా ఇష్టం. సంక్రాంతికి ప్రత్యేకంగా చీరలూ, లంగావోణీలూ డిజైన్ చేయించుకుంటా. కొత్త బియ్యంతో చేసే చక్రపొంగలి బాగా ఇష్టం. పండగ నేపథ్యంతో వచ్చే సినిమాలను బాగా చూస్తాను. నేను దేవుణ్ని బాగా నమ్ముతా. పూజలు చేస్తా. సంఖ్యా శాస్త్రమంటే నమ్మకం ఎక్కువ. 'ఆవారా' సినిమాకు ముందు నా కెరీర్ సరిగా లేదు. తెలిసిన వాళ్ల సలహాతో న్యూమరాలజిస్టుని కలిశా. నా పేరులో అదనంగా రెండు ఆంగ్ల అక్షరాలను చేర్చుకున్నా.
- ఇక, సంక్రాంతి అంటే గుర్తొచ్చే జ్ఞాపకాలున్నాయి. తెలుగులో నేను నటించిన మొదటి సినిమా 'శ్రీ' సంక్రాంతికి ముందు విడుదలైంది. నటన పరంగా నాకు మంచి మార్కులు పడ్డాయి. అప్పట్నుంచి నాకు సంక్రాంతి కలిసొస్తుందనే నమ్మకం బలపడింది. అలానే 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' పండగ తరవాత వచ్చింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ బాగా పండింది. మా నాన్నకి నా సినిమాల్లో బాగా నచ్చిన వాటిల్లో అదీ ఒకటి.
- "శ్రీ"
- హ్యపి డేస్,
- రెడీ ,
- పరుగు ,
- కాళిదాసు ,
- పెళ్ళివారిల్లు.
- చంద్రప్రతాప్ .
- "నిన్న నేడు రేపు"
- కొంచం ఇష్టం కొంచన్ కష్టం ,
- ==================
Visit my website : dr.seshagirirao.com


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog