పరిచయం :
- ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలునిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కధానాయకుడిగానిర్మింపబడిన "చెవిలో పువ్వు". ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాతరామానాయుడు 'ప్రేమఖైదీ' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు.
- రాజేంద్ర ప్రసాద్ తో 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు', 'ఆలీబాబా అరడజనుదొంగలు' వంటి చిత్రాలు మరియునరేష్ తో 'జంబలకిడి పంబ' మొడలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్బాబు), లాంటి చిత్రాలతర్వాత , ఆమె, తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశారు. .కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
ప్రొఫైల్ :
- పేరు : ఈదర వీర వెంకట సత్యనారాయణ --ఇ.వి.వి.సత్యనారాయణ ,
- ఊరు : దొమ్మేరు -- వెస్ట్ గోదావరి జిల్లా ,
- నాన్న : వెంకటరావు ,
- అమ్మ : వెంకటరత్నం ,
- పుట్టిన తేది : 10 జూన్ 1956 ,
- చదువు : ఇంటర్మీడియట్ --discontinued, .
- భార్య : సరస్వతీ కుమారి (పెళ్లిరోజు= 26-11-1976),
- తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు ,ఒక చెల్లి ,
- పిల్లలు : ఇద్దరు కొడుకులు - రాజేష్ , నరేష్ -- ఇద్దరూ నటులే.
- మరణము : 21-జరవరి 2011 అర్దరాత్రి ఆసుపత్రి లో కాన్సర్ వ్యాధితో చనిపోయారు .
పరిచయం చేసిన నటీనటులు
చిత్రాలు -
అసిస్టెంట్ దర్శకుడు గా :
- ఓ ఇంటి భాగవతం ,
- రోజులు మారాయి ,
- పుణ్య భూమి కల్లుతెరచింది ,
- నాగవల్లి ,
- నాలుగు స్తంభాల ఆట ,
- మూడు ముళ్ళు ,
- ఆనంద భైరవి ,
- మొగుడు పెళ్ళాలు ,
- రెండు రెళ్ళు ఆరు ,
కో డైరెక్టర్ గా :
- అహనా పెళ్ళంట ,
- ఇంద్రుడు చంద్రుడు ,
దర్శకుడు గా : కొన్ని సినిమాలు :
- చెవిలో పువ్వు
- ప్రేమ ఖైదీ ,
- 420
- అప్పుల అప్పారావు ,
- సీతారత్నం గారి అబ్బాయి,
- జంబలకిడిపంబ ,
- ఆ ఒక్కటి అడక్కు ,
- అబ్బాయిగారు
- ఏవండీ ఆవిడ వచ్చింది
- వారసుడు ,
- ఆలీబాబా అరడజను దొంగలు ,
- అబ్బాయి గారు ,
- హలో బ్రదర్ ,
- ముద్దబంతి పువ్వు ,
- తాళి
- ఆమె
- కన్యాధానం
- అల్లుడా మజాకా
- గొప్పింటి అల్లుడు
- ఆవిడా మా అవిడే
- ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
- నువ్వంటే నాకిష్టం ,
- కితకితలు
Producer:
- 1. అత్తిలి సతిబాబు LKG (2007) (producer)
Actor:
- 1. ఇంద్రుడు చంద్రుడు (1989) .... Police Inspector చసింగ్
(source : sunday magazine sakshi news paper)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog