సాక్షి రంగారావు ,Sakshi Rangarao

  • -------------------------------------------------------------------------------
Introduction:
  • సాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్దనున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు ఐయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపూ, కె.విశ్వనాధ్ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివా కూడా నటుడే. చక్కెర వ్యాధి ముదిరి కిడ్నీలు పాడయిపోవడంతో చెన్నై వైద్యశాలలో జూన్ 27, 2005 రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.
Profile :
  • పేరు : సాక్షి రంగారావు,
  • పూర్తి పేరు : రంగవఝుల రంగారావు.
  • ఊరు : కొండిపర్రు గ్రామం--గుడివాడ దగ్గర ,
  • పుట్టిన తేదీ : 15 September 1942,
  • నాన్న : శ్రీ లక్ష్మినారాయణ ,
  • అమ్మ : శ్రీమతి రంగనాయకమ్మ
  • మొదటి సినిమా : బాపూ-రమణల సాక్షి.,
  • చివరి సినిమా : కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకం,
  • పిల్లలు : ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివా కూడా నటుడే.
  • మరణము : జూన్ 27, 2005,,
నటించిన కొన్ని సినిమాలు :
  • లింగబాబు లవ్ స్టోరీ (1995)
  • శుభసంకల్పం (1995)
  • యమలీల (1994)
  • ఆ ఒక్కటీ అడక్కు (1993)
  • డిటెక్టివ్ నారద (1993)
  • జోకర్ (1993)
  • కుంతీ పుత్రుడు (1993)
  • స్వాతికిరణం (1992)
  • నా పెళ్ళాం నా ఇష్టం (1991)
  • పెళ్ళి పుస్తకం (1991)
  • ఏప్రిల్ 1 విడుదల (1991)
  • కర్తవ్యం (1991)
  • సూత్రధారులు (1990)
  • ఈశ్వర్ (1989)
  • స్వర్ణకమలం (1988)
  • శ్రుతిలయలు (1987)
  • చంటబ్బాయి (1986)
  • సిరివెన్నెల (1986)
  • చట్టంతో పోరాటం (1985)
  • మొగుడు పెళ్ళాలు (1985)
  • రెండు రెళ్ళ ఆరు (1985)
  • జననీ జన్మభూమి (1984)
  • రెండు జెళ్ళ సీత (1983)
  • సాగరసంగమం (1983)
  • సితార (1983)
  • మంచుపల్లకి (1982)
  • శుభలేఖ (1982)
  • రాధాకళ్యాణం (1981)
  • గోపాలరావు గారి అమ్మాయి (1980)
  • సప్తపది (1980)
  • శుభోదయం (1980)
  • శంకరాభరణం (1979)
  • సిరి సిరి మువ్వ (1978)
  • మనుషులు చేసిన దొంగలు (1977)
  • శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
  • ముత్యాల ముగ్గు (1975)
  • ఆడదాని అదృష్టం (1974)
  • అందాల రాముడు (1973)
  • కాలం మారింది (1972)
  • మట్టిలో మాణిక్యం (1971)
  • సాక్షి (1967)
  • సుడిగుండాలు (1967)
  • ========================================
Dr.Seshagirirao -- Srikakulam

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)