గరికపాటి రాజారావు , Rajarao

గరికపాటి రాజారావు (ఫిబ్రవరి 5,1915 - 196?) తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్ మరియు టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు. రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున మరియు అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్ధికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్ధికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు. ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)