-
-
-
-
-
-
-
-
-
-
-
- ============================
-
పరిచయం :
- కోటయ్య ప్రత్యగాత్మ తెలుగు సినిమా దర్శకుడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు.
ప్రొఫైల్ (జీవిత విశేషాలు):
- పేరు : కొల్లి ప్రత్యగాత్మ ,
- తండ్రి : కొల్లి కోటయ్య వర్మ ,
- తల్లి : కొల్లి అన్నపూర్ణమ్మ ,
- భార్య : అన్నపూర్ణ ,
- సోదరుడు : కె .హేమాంబరదరరావు (సినీ దర్శకుడు),
- పెద్దకుమారుడు : కె.వాసు (హాస్య చిత్రాల దర్శకుడు ),
- ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడ దగ్గర ముదునూరు లో జన్మించాడు. ఈయన సినిమా రంగములో ప్రవేశించక మునుపు 1952లో ప్రజాశక్తి లో పాత్రికేయునిగా, జ్వాలా పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ప్రత్యగాత్మ దర్శకునిగా
- తొలి సినిమా 1961లో విడుదలైన భార్యాభర్తలు. ఈయన తెలుగులో 21 సినిమాలు మరియు హిందీలో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన ఆత్మా బ్యానర్ క్రింద చిలకా గోరింక మరియు మా వదిన చిత్రాలను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడు.
- ఈయన 2001, జూన్ 8న హైదరాబాదులో కన్నుమూశాడు.
- ప్రత్యగాత్మ, తెలుగు సినీ రంగములో రెబెల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న కృష్ణంరాజును 1966లో విడుదలైన చిలకా గోరింక సినిమాతో పరిచయము చేశాడు.
పురస్కారాలు
- ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు.
చిత్ర సమాహారం--
- * భార్యాభర్తలు (1961) *
- కులగోత్రాలు (1962) *
- పునర్జన్మ (1963) *
- మంచి మనిషి (1964) *
- మనుషులు మమతలు (1965) *
- చిలకా గోరింక (1966) *
- మా వదిన (1967) *
- ఆదర్శ కుటుంబం (1969) *
- అమ్మకోసం (1970) *
- మనసు మాంగల్యం (1970) *
- శ్రీమంతుడు (1971) *
- స్త్రీ (1973) *
- పల్లెటూరి బావ (1973) *
- దీక్ష (1974) *
- ముగ్గురమ్మాయిలు (1974) *,
- అల్లుడొచ్చాడు (1976) *,
- అత్తవారిల్లు (1976) *,
- గడుసు అమ్మాయి (1977) *,
- కన్నవారి ఇల్లు (1978) *,
- మంచి మనసు (1978) *,,
- కమలమ్మ కమతం (1979) *,
- నాయకుడు – వినాయకుడు (1980).
- ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు.
- * దో లడ్కియా (1976) *
- మెహమాన్ (1973) *
- ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971) *
- బచ్‌పన్ (1970) *
- తమన్నా (1969) *
- జా ఔర్ రంక్ (1968)
- * ఛోటాభాయి (1966).
visit my website :
Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog