
తెలుగు చిత్ర సీమలో పరభాషలకు చెందిన హీరోయిన్లు ఆధిపత్యం కొనసాగుతున్న ఈ రోజుల్లో మమత అనే ఓ అచ్చతెలుగు ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చిత్ర రంగ ప్రవేశం చేసింది. 'సండే' చిత్రంతో సినీ కేరీర్‌ను ప్రారంభించింది. ఆతరువాత తమిళలో 'టచ్' అనే చిత్రంలోను, తెలుగులో 'స్వామి శంకర్' అనే చిత్రంలోను నటించి, అందరి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'సువర్ణ', 'ఇద్దరు బావల ముద్దుల మరదలు', 'క్షణం', 'చిలిపి కృష్ణుడు', 'దొరగారింట్లో దొంగలు' వంటి చిత్రాలతో పాటు.. సాయి గీతా నిర్మించి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తాజాగా 'ప్రేమించినందుకు..' అనే చిత్రం షూటింగ్ ఇటీవలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మమతతో మాటామంతి...
ప్ర: మీకు సినీ అవకాశాలు ఎలా వచ్చాయి?
జ: నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. అప్పట్లో స్టేజీలపైనే డ్యాన్సులు వేసేదాన్ని. అలాగే క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. సినిమాల్లోకి వెళితే పైకి వస్తావని పలువులు ప్రొత్సహించడంతో ఆ రంగంవైపు ఆలోచించడం మొదలు పెట్టాను. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాను. అలా సండే చిత్రంలో అవకాశం లభించింది.
ప్ర: మీకు ఎలాంటి క్యారెక్టర్లంటే ఇష్టం?
జ: కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాకుండా నటనకు అవకాశం ఉండే మంచి పాత్రలు చేయాలని ఉంది.
ప్ర: అంటే గ్లామర్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటారా?
జ: ఆఁ.. అదేం లేదు. అన్ని రకాల పాత్రలు చేస్తూ.. ఓ మంచి హీరోయిన్‌గా, నటిగా గుర్తు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం. లక్ష్యం.
ప్ర: ఎక్స్‌పోజింగ్ విషయంలో మీ మాట?
జ: మితిమీరిన ఎక్స్‌పోజింగ్ చేయడం నాకు ఇష్టముండదు. అంటే.. హద్దులు దాటని శృంగారాన్ని చేయాలన్నదే నా అభిమతం.
ప్ర: మీకు చిన్న చిత్రాల్లోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్టు ఉన్నాయే?
జ: అలాంటిదేమీ కాదు.. మంచి కథాంశం కలిగిన ప్రతి చిత్రంలోను నటిస్తున్నాను.
ప్ర: పెద్దపెద్ద సంస్థల్లో చేయాలన్న కోరిక ఉంటుంది కదా?
జ: తప్పకుండా.. నాకు ఆ అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. మన చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. నాకు మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇందుకు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందుకు నిదర్శనం నేను చేస్తున్న సినిమాలే.
ప్ర: ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు?
జ: ఐదారు సినిమాలు చేతిలో ఉన్నాయి. మరి కొన్నిచిత్రాల్లో నటించేందుకు ఆఫర్లు వస్తున్నాయి.
ప్ర: ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వల్ల మీ కెరీర్ మలుపు తిరుగుతుందని అనుకుంటున్నారా?
జ: నేను నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినప్పటికీ.. నేను చేసిన పాత్రలు మాత్రం సంతృప్తి నిచ్చాయి. సినీ పరిశ్రమకు పరిచయమైన అనతి కాలంలోనే నాకు ఇన్ని మంచి అవకాశాలు రావడం అదృష్టమనే చెప్పాలి.
ప్ర: ఇతర భాషల్లో నటించే అవకాశం ఉందా?
జ: మొదట తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత. ఇతర భాషల్లో నటించేందుకు అవకాశం వస్తే మాత్రం డేట్స్ సర్దుబాటును బట్టి నటించేందుకు ప్రయత్నిస్తా.
నటించిన చిత్రాలు:
సండే
టచ్'తమిళలో 'టచ్'
తెలుగులో 'స్వామి శంకర్
సువర్ణ',
'ఇద్దరు బావల ముద్దుల మరదలు',
'క్షణం',
'చిలిపి కృష్ణుడు',
'దొరగారింట్లో దొంగలు'
ప్రేమించినందుకు.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog