కమలాదేవి,Kamaladevi

  • -------------------------------------------------
introduction :
  • టి.జి.కమలాదేవి (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు.
profile :
  • పేరు :కమలాదేవి ,
  • ఊరు : కార్వేటినగరం ,
  • మొదటి సినిమా : చూడామణి ,
  • జన్మనామం=తోటగోవిందమ్మ
  • జననం= డిసెంబర్‌ 29, 1930-కార్వేటినగరం
  • స్వస్థలం= కార్వేటినగరం
  • వృత్తి =నటి, స్నూకర్క్రీడాకారిణి
  • పదవి= నాటకకళాప్రపూర్ణ
  • భర్త =ఆవులచంద్రబాబునాయుడు
  • తండ్రి =కృష్ణస్వామినాయుడు
  • తల్లి =లక్ష్మమ్మ
ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.
  • టీజీ కమలాదేవి ఇక లేరు Died on 15-Aug.-2012
'పాతాళభైరవి'లో 'ఇతిహాసం విన్నారా... ఆ అతిసాహసులే వున్నారా... పాటను ఆలపించిన గాయని టి.జి.కమలాదేవి. ఆ చిత్రంలో పరివ్రాజికగానూ ఆమె నటించారు. 'మల్లీశ్వరి', 'గుణసుందరి కథ', 'ముగ్గురు మరాఠీలు' లాంటి నిన్నటి తరం చిత్రాల్ని వీక్షించిన ప్రేక్షకులకు ఆ పేరు పరిచితమే. నటి, గాయని టీజీ కమలాదేవి ఇక లేరు. బుధవారం(15-Aug.-2012) అర్ధరాత్రి చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 83 సంవత్సరాలు. విదేశాల్లో ఉన్న మనవళ్లు రావాల్సి ఉండటంతో అంత్యక్రియల్ని ఆదివారం నిర్వహిస్తామని ఆమె కుమారుడు ఆవుల జయచందర్‌ తెలిపారు. టీజీ కమలాదేవి అసలు పేరు తోట గోవిందమ్మ. చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఆమె స్వస్థలం. కమలాదేవిగా పేరు మార్చుకుని నాటక రంగంలోకి ప్రవేశించి స్త్రీ, పురుష పాత్రలను రెండింటినీ సమర్థంగా పోషించారు. 1941లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తొలుత 'చూడామణి' చిత్రంలో నటించారు. ఆ తరవాత తెనాలి రామకృష్ణ, దక్షయజ్ఞం, పార్వతి కల్యాణం తదితర చిత్రాల్లో నటించారు. పాటలు కూడా ఆమే పాడుకొనేవారు. 'ముగ్గురు మరాఠీలు'లో అక్కినేని నాగేశ్వరరావు సరసన నాయికగా నటించారు. ఆయనతో కలిసి 'చల్‌ ఛలో వయ్యారీ షికారీ' పాటను ఆలపించారామె. 'మల్లీశ్వరి'లో ఇష్టసఖి జలజ పాత్రలో నటించారు. పద్మిని, బి.సరోజాదేవి, లలిత లాంటి కథానాయికలకు డబ్బింగ్‌ కూడా చెప్పారామె. తెలుగు, తమిళ భాషల్లో ఆమె సుమారు 70 చిత్రాల్లో నటించారు. 1984లో వచ్చిన 'కుటుంబ గౌరవం' తరవాత ఇక నటించలేదు. ఓ వైపు చిత్రసీమలో ఉంటూనే బిలియర్డ్స్‌ క్రీడపైనా దృష్టిపెట్టారామె. కమలాదేవి భర్త ఆవుల చంద్రబాబు ప్రోత్సహించడంతో 1947లో ఆ క్రీడలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారామె. దేశంలో ఈ ఆట ఆడిన తొలి మహిళ ఆమే. జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని విజేతగా నిలిచారామె. - న్యూస్‌టుడే, చెన్నై నటించిన సినిమాలు :

1941 దక్షయజ్ఞం తెలుగు రోహిణి

1941 చూడామణి తెలుగు

1942 బాలనాగమ్మ తెలుగు

1942 సీతారామ జననం తెలుగు అహల్య

1943 గరుడ గర్వభంగం తెలుగు

1945 మాయలోకం తెలుగు

1946 ముగ్గురు మరాఠీలు తెలుగు

1947 కంజన్ తమిళం మరగతం

1949 గుణసుందరి కథ తెలుగు పార్వతీ దేవి

1951 మల్లీశ్వరి తెలుగు ఇష్టసఖి జలజ

1951 పాతాళభైరవి తెలుగు

1951 చంద్రవంక తెలుగు

1952 పల్లెటూరు తెలుగు

1954 తోడుదొంగలు తెలుగు రాముని భార్య

1954 చక్రపాణి తెలుగు మనవరాలు

1956 తెనాలి రామకృష్ణ తెలుగు

1958 పార్వతీ కళ్యాణం తెలుగు

1967 కంచుకోట తెలుగు

1968 అసాద్యుడు తెలుగు

1968 బంగారు పంజరం తెలుగు

1968 బంగారు సంకెళ్లు తెలుగు

1969 కథానాయకుడు తెలుగు

1970 పెత్తందార్లు తెలుగు

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)