జెనీలియా,Genelia

పరిచయం :
  • జెనీలియా - తానూ నవ్వుతు , ఎదుటి వారిని నవ్వించే గొప్ప నటి. ముందు గా పార్కర్ పెన్ యాడ్ లో అమితాబ్ బచ్చన్తో కనిపించిన జెనీలియా ,"తుజే మేరి కసం" హిందీ సినిమా లో నటించినప్పటికీ ,కెరీర్ ను దక్షినది లోనే సుస్థిరంచేసుకుంది ,. తల్లి దండ్రులు గోవా నుండి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు . జెనీలియా అక్కడే పుట్టింది . తన చిన్న నాటి కోరిక నటి కావాలని ముంబై వచ్చింది మొదట మోడల్ గా తరువాత టాలీవుడ్ నటిగా ఎదిగింది .
ప్రొఫైల్ :
  • జన్మ నామం = జెనీలియా డి`సూజా
  • జననం = ఆగష్టు 05 1987 ,
  • ఎత్తు = 5' 6½" (1.69 m)
  • జన్మ స్థలము = ఇంగ్లాండ్ లో పుట్టి -భారత్, గోవా లో పెరిగింది .
  • ప్రస్తుతం ఉన్న స్థలం = ముంబాయి (ఇండియా)
  • మతము : క్రిస్టియన్ ,
  • కుటుంబ సభ్యులు : అమ్మ ,నాన్న , అన్నయ్య .
  • మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , తమిళ్ , తెలుగు , కన్నడ .
  • చదువు = Schooling- Apostolic Carmel High School in Bandra, Mumbai, India Graduation - St. AndrewsCollege, Bandra, ఇండియా
  • ఇతర పేరు(ర్లు) = జీనూ, హరిణి, జియిన్
  • ప్రముఖ పాత్రలు = బాయ్స్ సినిమాలో హరిణి పాత్ర (తమిళ్ మరియు తెలుగు భాషల్లో)-బొమ్మరిల్లు లో హాసిని
బాల్యము : (ఆమె మాటల్లో) --చిన్నప్పుడు స్కూలింగ్‌, తర్వాత కాలేజీ... నా చదువంతా ముంబయిలోనే సాగింది. చిన్నప్పటి నుంచి నేను ఆటల్లో చురుకు. చదువులో అంతంత మాత్రమేగానీ బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌... ఒకటనేమిటీ, అన్నీ ఆడేసేదాన్ని. స్కూల్లో క్లాసులు ఎగ్గొట్టడానికి కొంచెం భయం ఉండేదిగానీ కాలేజీకొచ్చాక ఆ భయాలన్నీ పోయాయి. ఆ రోజుల్లో ఫ్రెండ్సే నాకు సమస్తం. వాళ్ల కోసం ప్రాణాలు పెట్టేదాన్ని. క్లాసులకు మేం బాగానే బంక్‌ కొట్టేవాళ్లం. కాస్త ఖాళీ దొరికితే చాలు అందరం కలిసి గ్రౌండుకెళ్లిపోయి ఏదో ఒక ఆట ఆడేసేవాళ్లం. అలా ఒకరోజు గ్రౌండులో ఆడుతున్నప్పుడే... వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు అందమైన కాలేజీ అమ్మాయిలు కావాలంటూ మా కళాశాలకో యాడ్‌ కంపెనీ టీమ్‌ వచ్చింది. వాళ్లు నన్ను సెలెక్ట్‌ చేసుకోవడంతో ఇలా స్టార్‌నయిపోయాను. ఇప్పుడు తల్చుకుంటుంటే ఆరోజులు మళ్లీ రావు కదా అనిపిస్తుంటుంది. అవార్డ్స్:
  • తెలుగు ఫిల్మ్ఫేర్ ఉత్తమనటి అవార్డు-2006 బొమ్మరిల్లు.
నటించిన తెలుగు చిత్రాలు :
  • సత్యం, -2003
  • సాంభ, -2004.
  • సుభాస్ చంద్రబోస్ , -(2005)
  • సై , -2005.
  • రామ్ , -(2006).
  • బొమ్మరిల్లు , - (2006).
  • డీ , -(2006)
  • మిస్టర్ మేధావి ,
  • రెడీ ,
  • ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే -(2007)
  • హ్యాపీ - (2006)
  • నా అల్లుడు (2005)
  • బాయ్స్ (2003)
హిందీ :
  • Tujhe Meri Kasam (2003)
  • Masti (2004)
తమిళ్ :
  • Chennai Kadhal (2006)
  • Dhaam Dhoom(2007)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)