జయప్రద,Jayapradha

 


































- 

  •  
  •  
  • ========================================================
  •  
  •  
 పరిచయం:
  • తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతా (Jayaprada Nahata) గాపరిచితురాలైన "లలితారాణి " ప్రముఖ నటి మరియు పార్లమెంటు సభ్యురాలు. జయప్రద ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి లో ఒక మధ్యతరగతికుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించినది. 1962

ప్రొఫైల్ :
  • స్క్రీన్ పేరు : జయప్రద ,
  • అసలు పేరు : లలితా రాణి ,
  • పుట్టిన తేది : 03 ఏప్రిల్ 1962 ,
  • తండ్రీ : కృష్ణ ,
  • తల్లి : నీలవేణి ,
  • భర్త : 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడినది.

సినీ ప్రవేశము

  • జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటినుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి మరియు బాబాయిలు సినిమాపెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్లవయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను కనుగొన్నాడు. ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన 'భూమి కోసం ' సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వార ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమెసినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీమరియు బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించినది.
  • పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. ఈమె 1986 జూన్ 22 న సినీనిర్మాతశ్రీకాంత్ నహతాను వివాహమాడినది.

రాజకీయ ప్రవేశము

  • నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీ లో చేరి రాజకీయరంగ ప్రవేశముచేసినది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకుఅధ్యక్షురాలైనది. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీనాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ యొక్క సమాజ్‌వాదీ పార్టీ లో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13 న లోక్ సభకు ఎన్నికైనది.

జయప్రద నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

  • భూమి కోసం-
  • సీతా కల్యాణం-
  • శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్-
  • మాంగల్యానికి మరో ముడి-
  • అంతులేని కధ
  • సిరి సిరి మువ్వ-
  • సీతారామ వనవాసం-
  • కురుక్షేత్రం-చాణక్య -
  • చంద్రగుప్త-
  • అందమే ఆనందం-
  • అడవి రాముడు
  • యమగోల-
  • శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం-
  • రంగూన్ రౌడీ-
  • దొంగలకు సవాల్-
  • సూపర్ మేన్-శ్రీవారి ముచ్చట్లు
  • సర్కస్ రాముడు-
  • చండీ ప్రియ-
  • ఊరికి మొనగాడు-
  • అగ్నిపూలు-47 రోజులు-
  • స్వయంవరం-కృష్ణార్జునులు
  • ఏకలవ్య-దేవత--
  • సాగర సంగమం-
  • ముందడుగు-
  • మేఘసందేశం-
  • అమరజీవి-
  • అడవి సింహాలు-
  • పులి - బెబ్బులి-
  • తాండ్ర పాపారాయుడు-
  • సింహాసనం-వేట-
  • విశ్వనాధ నాయకుడు-సంసారం-
  • జీవిత ఖైదీ-మహారధి-
Felicitation to Jayaprada : కళామాతల్లి ముద్దుబిడ్డ, రాజమండ్రి నగర వాసి, ప్రముఖ సినీనటి, ఎంపీ జయప్రదకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ లలిత కళా నటన మయూరి* బిరుదును ప్రధానం చేసింది. పలువురు సినీ ప్రముఖులకు టిఎస్‌ఆర్‌ పురస్కారాలను అందజేశారు. టి. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ రాజమండ్రి జోన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ బిరుదు, పురస్కారాలను జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు హాస్యనటుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. స్థానిక ఆనం కళాకేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ రాజమండ్రి జోన్‌ను రాష్ట్ర మంత్రులు తోట నరసింహం, పినిపే విశ్వరూప్‌ లాంఛనంగా ప్రారంభించారు.

  • ==========================
Visit my website : dr.srshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala