జయలలిత,Jayalalitha
















-- జయలలిత . తమిళనాడు ముఖ్యమంత్రి .

  • --------------------------------------------------------------------------------------
పరిచయం :
  • జయలలిత జయరామన్ ,తమిళనాడు రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు సినీనటి. తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం యొక్క ప్రధాన కార్యదర్శి. 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి, 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభ ఎన్నికైంది. అప్పటిముఖ్యమంత్రి యంజి.రామచంద్రన్ కు సన్నిహితంగా మెలిగింది. రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. గ్లామర్ వల్లజయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించింది. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జర్గిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించిముఖ్యమంత్రి పాఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగాఅవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయముపొందినది. అయినా పార్టీవారు తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్టమైనప్రతిపక్షముగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు శాసనసభ ప్రతిపక్ష నాయకురాలు. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (క్రాంతియుత నాయకురాలు) అని పిలుస్తుంటారు.
ప్రొఫైల్ :
  • పేరు :జయలలిత,
  • అసలు పేరు: కోమలవల్లి.
  • ముద్దు పేరు : అమ్ము, పురట్చి తలైవి ,
  • పుట్టిన తేది : 24-ఫిబ్రవరి-1948 ,
  • తల్లి :ఈమె అలనాటి సినీ నటి సంధ్య,
  • తండ్రి : జయరాం ,... జయకు 2 సం. వయసు లో తండ్రి చనిపోయారు .
  • తోబుట్టువు : ఒక సోదరుడు,
  • జన్మస్థలం : Melukote in Pandavapura (Tq) of Mandya dist(మైసూర్),
  • మతము : హిందూ కన్నడ బ్రాహ్మిణ్ .,
  • చదువు : metricyulation ,
  • ఇతరములు : భారత నాట్యం, మోహిని అట్టం, కథక్,మణిపురి. వచ్చును
  • పెళ్లి : అవివాహిత యం జి. రామచంద్రన్ గర్ల్ ఫ్రెండ్ గా జీవితం త్యాగము చేసినది .
  • బెస్ట్ ఫ్రెండ్ : శశికల ,
మొదటి సినిమాలు :
  • కన్నడ ఫిలిం:' చిన్నదా గోమ్బే'
  • తెలుగు ఫిలిం:' మనుషులు మమతలు'
  • తమిళ్ ఫిలిం :'వేన్నిర ఆది '
  • With MGR:"ఆయిరర్హ్తిల్ ఒరువన్"
  • With Shivaji: 'గలాటా కల్యాణం'
కెరీర్ :
  • జయలలిత రాజకీయ రంగప్రవేశానికి మునుపు తమిళ చిత్ర రంగములో విజయవంతమైన సినీ నటి. కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి అలనాటి సినీ నటి సంధ్య బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించినది. జయలలిత తొలి సినిమా 'చిన్నడ గొంబె' కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా 'మనుషులు మమతలు' ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. మైసూర్ మహారాజుకు వ్యక్తిగత వైద్యుడుగా పనిచేసిన వ్యక్తి మనుమరాలు , జయరాం -సంధ్యల ముద్దుల కూతురు అయిన కోమలవల్లి తండ్రి హఠాత్ మరణముతో దెబ్బతిన్న కుటుంబ ఆర్దిక పరిస్థితి , ఎవరిమీదా ఆదారపడకూదన్న ఆమె తల్లి సంద్య ఆలోచనతో సినిమా రంగములోకి వచ్చింది . ఆమె తల్లి వేదవల్లి ... సినిమాతెరమీద సంధ్య . . . పలు తెలుగు కన్నడ , తమిళ సినిమాల్లో నటించారు . మాయాబజార్ లొ NTR సరసం " లాహిరి లాహిరి " అంటూ నౌకావిహారము చేసింది సంధ్యనే . తిరిగి అదే నటుడి సరసం ఆమె కూతురు జయలలిత హీరోహిన్‌ గా నటించడం విశేషము .
ఎం.జి.ఆర్ ప్రాపకం : బాగా చదువుకుని తాతలాగ వైద్యవృత్తిలోకి వెళ్ళాలనుకున్న కోమలవల్లి ఆర్ధిక స్థితిని . అమ్మ మాటను అర్ధము చేసుకుని వెండితెరపైకి వచ్చింది . తన 15 వ యేట చేసిన కన్నడ సినిమా ... ఆ వెంటనే వచ్చిన తమిళ సినిమా .. తరువాత జయలలిత వెనుతిరిగి చూడాల్సిన అవసరము రాలేదు . ఆమె అందాన్ని చూసిన MGR కే మతిపోయింది . ఆమెను వెంటనే తన సినిమాల్లో హీరోహిన్‌ గా బుక్ చేసుకున్నారు . అప్పటికి ఆయన వయసు 52 సం.లు . జయలలిత వయసు 21 సం.లు . అయినాకూడా వారి జంట హిట్ జంట అయినది . జయలలిత తప్పించి మరో హీరోయిన్‌ సరసన సినిమాలు చేయనని భీష్మించారు ఎం.జి.ఆర్. ఆమె తోనే ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టేడు . అప్పటికే ఎం.జి.ఆర్ ... డి.ఎం.కె.లో మెంబర్ గా ఉన్నారు . ఆ పార్టీ అధికారములో ఉంది . జయలలితలో ఎం.జి.ఆర్ బంధము ఇటు రాజకీయ నాయకులకు , అటు సినిమా రంగం వారికి నచ్చలేదు . ఫలితం గా ఎం.జి.ఆర్ కి జయలలిత మీద లేనిపోనివన్నీ నూరిపోసారు . జయలలితను కాదని మంజులను హీరోయిన్‌ గా బుక్ చేయడం తో జయకు కోపము వచ్చింది . తనను ఇతర హీరోలతో నటించవద్దని ఆంక్షలు పెట్టిన ఎం.జి.ఆర్ .... తానే మరో హీరోయిన్‌ తో నటించడం ఆమెకు నచ్చలేదు . అదే సమయం లో జయలలితము తెలుగు లో వరుసగా అవకాసాలు వచ్చాయి. అక్కినేని తో ' అదృస్టవంతులు ' బ్రహ్మచారి , ... ఎం.టి.ఆర్ తో " కధానాయకుడు , త్క్కశంకరయ్య " వంటి సినిమాలు తర్వాత ఆమె దృష్టి నాటి గ్లామర్ హీరో శోబన్‌ బాబు మీదకు మళ్ళింది . శోబన్‌ బాబు .. జయలలితలు తెరమీద హిట్ పెయిర్ కాకపోయినా తెరవెనుక హాట్ పెయిర్ .. శోబన్‌ బాబును ఆమె రహస్యము గా పెళ్ళి చేసుకుందని .. వారిరువురికి సంతానము కూడా ఉందని వార్తలు ఉన్నాయి .
రాజకీయ ప్రవేశము : 1976 లో ఎం.జి.ఆర్ .. కరుణానిధి ల మధ్య వచ్చిన విబేదాలు డి.ఎం.కె చీలికకు దారితీసింది . ఎం.జి.ఆర్ అన్నా డి.ఎం.కె .పార్టీ పెట్టి బ్రహ్మాండమైన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు .అయితే కరుణానిది వాక్చాతుర్యము ముందు నిలువలేక పోయారు . ఎం.జి.ఆర్ తనకు ప్రచారము చేసి పెట్టే వ్యక్తికోసం వెతికి జయలలితను రప్పించి దిక్కులేదని తనతో పూర్వ సంబందాన్ని పునరుద్దరించి 1981 లో జయలలితను పార్టీలో చేర్చుకుని 1983 లో ఆమెను ప్రచార కార్యదర్శిగా నియమించారు . అప్పటినుండి మాటలను మాటలతో ఢీ కొని గెలవగలిగింది . మళ్ళీ ఎం.జి.ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు . 1987 లో ఎం.జి.ఆర్ మరణించగా ఆయన భార్య జానకి ముఖ్య మంత్రిని చేసి ప్రబుత్వము నడపలేక పార్టీ మొత్తాన్ని జయలలితకు అప్పగించాల్సిన పరిస్థితి తలెత్తినది . కరుణానిధితో ఎన్నో అవమానాలకు లోనైన జయ శాసన సభలో తన చీరను లాగేంత అవమాన బారముతో కురుక్షేత్రములో ద్రౌపతి లా కక్ష సాధించి 1991 లో జయ ముఖ్యమంత్రి అయ్యారు . తిరిగి 2006 లో ఓడిపోయారు ... మళ్ళి 2011 లో అధిక మెజారిటీ తో ముఖ్యమంత్రి అయ్యంది . ఒక భ్రాహ్మిణ అవివాహిత (అంధికార వివాహిత ) తమిళనాట రాజకీయాలలో ఒక నియంగగా ఎదిగారు . తన మాటకు తిరుగులేదు . తను నిలబడితే అందరూ నిలబడవలసిందే . తమిళ ఇందిరా గాంధీ గా పేరుతెచ్చుకున్నారు .

పురస్కారములు :
  • 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించినది.
ముఖ్య మంత్రి గా :
  • from 24-06-1991 to 12-05-1996,
  • from 14-05-2001 to 21-09-2001 and
  • from 02-03-2002 to -12-05-2006
  • from 01-05-2001 To --
==============================
సేకరణ : డా.వందన శేషగిరిరావు -శ్రీకాకుళం

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala