తెలంగాణ శకుంతల,Telangana Sakunthala

- ----------------------------------------------
- తెలంగాణ ఆడోళ్ళంటే మంచీ , మర్యాద లేకుండా మాట్లాడుతారని, ప్రతీరోజు మొగుళ్ళతో గొడవ పడతారన్నాంత స్థాయిలో సినిమా పాత్రల్ని డిజైన్ చేశారు. మరీ నవ్వొచ్చే విషయ మేమంటే తెలంగాణ కాదు అసలు ఆంధ్ర ప్రదేశ్‌కే చెందని నటీనటుల చేత కౄరమైన పాత్ర లేయించి ఈ యాసని పలికించారు. ఫలితంగా ‘’తెలంగాణ శకుంతల'’ లాంటి క్యారెక్టర్లు పుట్టుకొచ్చాయి. నిజానికి శకుంతల తెలంగాణ వాసే కాదు. మహారాష్ట్రకు చెందిన ఈవిడను ‘’తెలంగాణ శకుంతల'’ అంటే తప్ప గుర్తుకు రాని విధంగా మార్చేశారు. స్త్రీ విలన్ పాత్రలలో ఈమె కు ఈమె సాటి. తిట్లు తిడుతూ బలే నటన ప్రదర్శిస్తారు. నాటకాలలో సుమారు 9 వేల ప్రదర్శనలు చేసారు .
- పేరు : కడియాల శకుంతల ,
- స్వస్థలం : మహారాస్ట్రలో ఒక ఊరు ,
- పుట్టిన తేదీ : 09-06-1951,
- నివాసము : హైదరాబాద్ చివార్లలోని కొంపల్లె లో ,
- తోబుట్టువులు : ఈమెతో కలిపి 4 అమ్మాయిలు ,
- పిల్లలు : ఇద్దరు . ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
- తండ్రి : ఆర్మీ ఆఫీషర్ ,
- తల్లి : గృహిణి ,
- మొదటి తెలుగు సినిమా : బానిసత్వం ఇతివృత్తంగా తీసిన 'కుక్క' చిత్రంలో పీఎల్ నారాయణకు భార్యగా .
- మరణము : 13-06-2014 శ్రుక్రవారము అర్ధరాత్రి--అంటే శనివారము 14-06-2014.,
- 1981లో మా భూమి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన శకుంతలకు గులాబీ చిత్రం నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలంగాణ యాసకు ఆమె ప్రత్యేకత తీసుకొచ్చారు. నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఆమె మొత్తం 71 చిత్రాల్లో నటించారు. పాండవులు, పాండవులు తుమ్మెదా ఆమె నటించిన చివరి చిత్రం.
అవార్డులు :
- నాలుగుసార్లు : ఊర్వశి అవార్డులు ,
- నాలుగుసార్లు : నంది అవార్డులు ,
- నాటకాలలో 100 సార్లు ఉత్తమ నటి అవార్డులు ,
తెలంగాణ శకుంతల నటించిన కొన్ని తెలుగు చిత్రాలు
Actress
- 2013 - శివంగి -Sivangi ( Telugu )
- 2013 - అమ్మ ఎల్లమ్మ -Amma Yellamma ( Telugu )
- 2013 - నా అనేవాడు -Naa Anevaadu ( Telugu )
- 2013 - ఆడ పాండవులు -Aada Paandavulu ( Telugu )
- 2013 - ఏమైంది ఈవేళ -Emaindi Eevela ( Telugu )
- 2013 - సౌండ్ పార్టీ-Sound Party ( Telugu )
- 2013 - రాయలసీమ ఎక్షప్రెస్స్ --Rayalaseema Express ( Telugu )
- 2012 - గురువారం --Guruvaram ( Telugu )
- 2012 - ఈ వేసవిలో ఓ ప్రేమకథ --Ee Vesavilo O Prema Katha ( Telugu )
- 2012 - పీపుల్స్ వార్ --Peoples War ( Telugu )
- 2011 - రాజన్న --Rajanna ( Telugu )
- 2011 - పిల్ల దొరికితే పెళ్ళి --Pilla Dorikithe Pelli ( Telugu )
- 2010 - బిందాస్ --Bindaas ( Telugu )
- 2010 - చాప్టర్ 6--Chapter 6 ( Telugu )
- 2010 - కొమరం భీం--Komaram Bheem ( Telugu )
- 2010 - హ్యాపీ హ్యాపీ గా --Happy Happy Ga ( Telugu )
- 2010 - ఆంధ్రా కిరణ్ బేడీ--Andhra Kiran Bedi ( Telugu )
- 2010 - ఒక్క క్షణం --Okka Kshanam ( Telugu )
- 2010 - పంచాక్షరి --Panchakshari ( Telugu )
- 2010 - బురిడి --Buridi ( Telugu )
- 2010 - మా నాన్న చిరంజీవి --Maa Nanna Chiranjeevi ( Telugu )
- 2010 - కల్యాణ్ రాం కత్తి --Kalyanram Kathi ( Telugu )
- 2010 - గ్లామర్ -Glamour ( Telugu )
- 2010 - నీకు నాకు --Neeku Naaku ( Telugu )
- 2010 - రంగ దే దొంగ Ranga The Donga ( Telugu )
- 2009 - బెండు అప్పరావు ఆర్.యం.పి--Bendu Apparao Rmp ( Telugu )
- 2009 - పిస్థా--Pista ( Telugu )
- 2009 - మస్కా--Maska ( Telugu )
- 2009 - ఎవరైనా ఎపుడైనా--Evaraina Epudaina ( Telugu )
- 2009 - Machak Kaalai ( Tamil )
- 2009 - అ ఆ ఇ ఈ--A Aa E Ee (Athanu Aame Intalo Eeme) ( Telugu )
- 2009 - నిర్ణయం --Nirnayam 2009 ( Telugu )
- 2009 - కవి --Kavi ( Telugu )
- 2009 - కరంట్ --Current ( Telugu )
- 2008 - జాబిలమ్మ--Jabilamma ( Telugu )
- 2008 - మల్లెపువ్వు--Mallepuvvu ( Telugu )
- 2008 - సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం -Sidhu From Srikakulam ( Telugu )
- 2008 - అంకుశం--Ankusham ( Telugu )
- 2007 - వియ్యాలవారి కయ్యాలు--Viyyalavari Kayyalu ( Telugu )
- 2007 - లక్ష్మీ కళ్యాణం - Lakshmi Kalyanam ( Telugu )
- 2006 - శ్రీ క్రిష్ణ - Srikrishna 2006 ( Telugu )
- 2006 - లక్ష్మి - Lakshmi ( Telugu )
- 2006 - ఒక విచిత్రం - Oka Vichitram ( Telugu )
- 2006 - అన్నవరం - Annavaram ( Telugu )
- 2005 - ఒరేయ్ పండు - Orey Pandu ( Telugu )
- 2005 - సదా మీ సేవలో- Sada Mee Sevalo ( Telugu )
- 2005 - ఎవడి గోల వాడిది - Evadi Gola Vadidhi ( Telugu )
- 2005 - ఒక్కడే - Okkade ( Telugu )
- 2004 - పల్లకిలో పెళ్ళికూతురు - Pallakilo Pelli Kuturu ( Telugu )
- 2004 - ప్రేమించుకున్నాం పెళ్ళికి రంది - Preminchukunnam Pelliki Randi ( Telugu )
- 2004 - దొంగ దొంగది - Donga Dongadhi ( Telugu )
- 2004 - అడవి రాముడు - Adavi Ramudu ( Telugu )
- 2003 - సాంబు - Sambu ( Telugu )
- 2003 - విష్ణు - Vishnu ( Telugu )
- 2003 - వీడె - Veede ( Telugu )
- 2003 - అభిమణ్యు - Abhimanyu ( Telugu )
- 2003 - ఒక్కడు - Okkadu ( Telugu )
- 2003 - సింహాచలం - Simahachalam ( Telugu )
- 2003 - పెళ్ళం తో పనేంటి - Pellamto Panenti ( Telugu )
- 2003 - చార్మినార్ - Charminar ( Telugu )
- 2003 - గంగోత్రి - Gangotri ( Telugu )
- 2002 - కొండవీటి సింహం - Kondaveeti Simhasanam ( Telugu )
- 2002 - సందడే సందడి - Sandade Sandadi ( Telugu )
- 2002 - నీతో చెప్పాలని - Netho Cheppalani ( Telugu )
- 2001 - బద్రాచలం - Badrachalam ( Telugu )
- 2001 - నువ్వే నేను - Nuvve Nenu ( Telugu )
- 1995 - గులాబి - Gulabi ( Telugu )
- Singer
- 2003 - వీడే - Veede ( Telugu )
కొన్ని విశేషాలు :
- * నాకు దైవభక్తి ఉంది. మహాలక్ష్మి, నటరాజ స్వామికి ఎక్కువగా పూజలు చేస్తా.
- * నవలలు చదవాలని ఉంటుంది కానీ సమయం దొరకదు. కుదిరితే మాత్రం రకరకాల పుస్తకాలను బాగా చదువుతా.
- * వంటలు బాగా చేస్తాను. మా పిల్లలకు నేనేది చేసినా అద్భుతమే.
- * సావిత్రి, ఎస్వీ రంగారావు అంటే చెప్పలేనంత ఇష్టం.
- * ఒసేయ్ రాములమ్మ విడుదలయ్యాక ఎక్కడికైనా వెళ్తే 'పెద్ద రాములమ్మ అక్క' వచ్చిందంటారు. ఇప్పటికీ అలాగే పిలుస్తారు.
- * నాటకాల్లో నా మొదటి సంపాదన వంద రూపాయలు. తరవాత మూడువేల రూపాయల దాకా అందుకొన్నా.
- * వివిధ మాండలికాల్లో డైలాగులు చెప్పడం ఎప్పుడూ కష్టం అనిపించలేదు. కారణం డైరెక్టరు చెప్పినట్లుగా పలకడమే.

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog