చక్రపాణి , Chakrapani
పరిచయం :
- ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికాసంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించినవారిలోఒకరు.
- జననము : చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో
- తండ్రీ : గురవయ్య,
- తల్లి : వెంకమ్మ,
- చదువు : జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలివెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందనవర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు. 'చక్రపాణి' అనే కలం పేరును వీరికి అతనే ప్రసాదించారు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932లోమదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, ఒక సాటి రోగి- అయిన ఒకపండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగులోకిఅనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా శరత్బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు.
- 1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం వీరు మాటలు రాసారు. బి.ఎన్.రెడ్డి గారు రూపొందిస్తున్నస్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు.
- 1949-1950లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్ ను స్థాపించి, సినిమాలు తీయాలనినిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసిపిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు.
- 1934-1935లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగుపాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని హైదరాబాదుకు తరలించారు.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog