ముదిగొండ లింగమూర్తి,Lingamurty

===================================
పరిచయం :
  • ముదిగొండ లింగమూర్తి తెనాలి ప్రాంత్రం నుండి వచ్చిన పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకంలాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు. ప్రతి విషయాన్నీ తర్కం, స్వభావం, శాస్త్రాలతోరంగరించి, విపులీకరించే లింగమూర్తిగారు చివరి దశలో సన్యాసాశ్రమం తీసుకున్నారు.
ప్రొఫైల్ :
  • పేరు : లింగమూర్తి ,ముదిగొండ .
  • పుట్టిన ఊరు : తెనాలి ,
  • పుట్టియా సం. : 1906 ,
  • మరణము : 24-జనవరి 1980 ,

సినిమా రంగం

  • నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి. తుకారామ్‌ (1937) లో నటించినా వందేమాతరం (1939) తో అందరికీ తెలిసారాయన. రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రాక, సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే, తెరమీద కూడా నటించారు. బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం - వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది. ఆయనా, యూనిట్లో ఒకరైనారు. వేషం వున్నా లేకపోయినా, నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. కొంతకాలం అధికారికంగా ప్రొడక్షన్మేనేజరుగా వ్యవహరించారు.
  • క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన ఆడజన్మలో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర మరియు పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు

నటించిన సినిమాలు

  • వందేమాతరం (1939) (లింగమూర్తి)-
  • సుమంగళి (1940)-
  • భక్తిమాల (1941)-
  • దేవత (1941)-
  • భక్త పోతన (1942) -అజామీళుడు)-
  • స్వర్గసీమ (1945) (భానుమతి తండ్రి)-
  • త్యాగయ్య (1946) (జపేశం)-
  • పల్నాటి యుద్ధం (1947) (నరసింగరాజు)-
  • యోగి వేమన (1947) (అభిరామ)-
  • సువర్ణమాల (1948)-
  • మంత్ర దండం (1951) (మాంత్రికుడు)-
  • ధర్మ దేవత (1952) (వీరసేన రాజు)-
  • నా ఇల్లు (1953) (ధనరాజ్)-
  • పెద్దమనుషులు (1954) (పత్రిక సంపాదకుడు రామదాసు)-
  • కాళహస్తీశ్వర మాహాత్మ్యం (1954) (కైలాసనాథ శాస్త్రి)-
  • మహామంత్రి తిమ్మరుసు (1962)-
  • రామదాసు (1964)-
  • పాండవ వనవాసం (1965) (శకుని)-

ప్రొడక్షన్ మేనేజర్ గా

  • స్వర్గసీమ (1945)-
  • భక్త పోతన (1942)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)