ఛార్మి,charmi Kaur
- ===============================================================
- ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజూ ఆమె స్వస్థలం ముంబాయి లో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి "నీ తోడు కావాలి" తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది.
- తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే "కాదల్ కిసు కిసు" అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు - తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె ప్రముఖ తెలుగు దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన "శ్రీ ఆంజనేయం" చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన "నీకే మనసిచ్చాను" కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండీ ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది.
- 2007 డిసెంబరు లో విడుదలయిన "మంత్ర " ఊహించని విజయం సాధించి తెలుగు కధానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
- * జన్మ నామం = ఛార్మి కౌర్
- * పుట్టిన, తేది = మే 17, 1986.
- * పుట్టిన స్థలం = పంజాబ్, ఇండియా.
- * ఎత్తు : 5' 6'' .
- * తండ్రి : దీన్ సింగ్ ఉప్పల్ (వాస్తు శాస్త్ర కన్సల్టెంట్ గా పనిచేశారు)
- * తల్లి : సుర్జిత్ కౌర్ ఉప్పల్ (గృహిణి),
- * తోబుట్టువులు : ఒక అన్నయ్య ,
- * మాతృభాష : పంజాబీ ,
- * వివాహము = అవివాహిత.
- * మొదటి మూవీ :నీ తోడూ కావాలి - 2002 .
- * తెలుగు:
- * సుందరకాండ (2008) (ఫైల్మింగ్)
- * మంత్ర (2007) ... మంత్ర
- * రాఖి (2006)
- * చిన్నోడు (2006) ...
- * పౌర్ణమి (2006) ... చంద్రకళ
- * స్టైల్ (2006) ...
- * లక్ష్మి (2006) ... శైలజ.
- * చుక్కల్లో చంద్రుడు (2006) ... సంధ్యా
- * అల్లరి పిడుగు (2005) ...
- * పొలిటికల్ రోవ్డి (2005) ... కావేరి
- * అనుకోకుండా ఒక రోజు(2005) ... సహస్ర
- * చక్రం (2005) ... లక్ష్మి
- * మాస్ (2004) ... ప్రియ
- * చంటి (2004) ...
- * గౌరీ (2004) ... శ్వేత
- * శ్రీ ఆంజనేయం (2004)
- * నీకే మనసిచ్చాను (2003)
- * నీ తోడు కావలి (2002) ... మానస
- * లాడం (2008)
- * ఆహా ఇతని అజ్హగు (2003)
- * కధల కిసు కిసు (2003)
- * కధల అజ్హివతిల్లై (2002)
- * కాటు చంపగం (2004)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog