భానుప్రియ,Bhanupriya


































  • ---------------------------------------------------------------
  •  

పరిచయం :
  • భానుప్రియ ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలోకథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, మరియు భరతనాట్యం నందు శిక్షణ ఇస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, వాలు జడతో బాపూ బొమ్మలా ఉండే భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటుంటారు. 
  • ఎన్నో చెప్పుకోదగ్గ, గుర్తించుకోదగ్గ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది . అభినయం, అందం కలగలిసిన భానుప్రియ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. తమిళ, హిందీ, మళయాళ సినిమాల్లోనూ నటించింది.
  • భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ ను భానుప్రియ వివాహం చేసుకుంది. వీరికి అభినయ అనే అమ్మాయి ఉంది. వ్యక్తిగత కారణాలతో ఆదర్శ్ కౌషల్ తో విడాకులు తీసుకున్న భానుప్రియ టీవీ, సినిమాల్లో తన కెరీర్ ను కొనసాగించింది. హీరోయిన్ గా రాణించిన భానుప్రియ ఇప్పుడు హీరో తల్లి పాత్రల్లోనూ రాణిస్తోంది. 
ప్రొఫైల్ : 
  • పేరు : భానుప్రియ,
  • అసలు పేరు : మంగ భామ , 
  • జననము : 1966, జనవరి 15న,
  • పుట్టిన ఊరు : రంగం పేత - రాజమండ్రి సమీపం లో, 
  • మతము : హిందూ -బ్రాహ్మిణ్ ,
  • భర్త : ఆదర్శ కౌశల్ , -ఫోటోగ్రాఫర్ (యు.యస్.ఎ.),
  • మామగారు : సుమతి కౌశల్ -భరతనాట్యం ఆర్టిస్ట్ .
  • పిల్లలు : ఒక కుమార్తె ,
  • నివాసము : చెన్నై ,
  • సోదరి : శాంతిప్రియ (నిశాంతి ),
  • తొలి తెలుగు సినిమా : సితార ,
సినీ జీవితం
  • భానుప్రియ వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్నిసాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. సుమారుగా ఈమె తెలుగు లో 25 , తమిళం లో 30 , హిందీ లో 14 సినిమాలలో నటించారు .
భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు
  • సితార *
  • రౌడీ *
  • రామాయణంలో భాగవతం *
  • ప్రేమించు-పెళ్లాడు *
  • మొగుడూపెళ్లాలు *
  • ఇల్లాలికో పరీక్ష
  • అన్వేషణ *
  • చిరంజీవి *
  • జ్వాల *
  • పల్నాటి పులి *
  • విజేత *
  • అపూర్వ సహోదరులు *
  • ఆలాపన
  • దొంగమొగుడు *
  • చక్రవర్తి *
  • జేబుదొంగ *
  • స్వర్ణకమలం *
  • ఖైదీ నంబర్ 786 *
  • త్రినేత్రుడు *
  • బ్లాక్ టైగర్ *
  • స్టేట్ రౌడీ *
  • ఏడుకొండలస్వామి *
  • పెదరాయుడు *
  • మామా బాగున్నావా? *
  • అన్నమయ్య *
  • ఛత్రపతి,
  • గౌతమ్ ఎస్.ఎస్.సి.
  • ================================
Visit my Website : Dr.Seshagirirao.com / 

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)