సత్యనారాయణ కైకాల-Satyanarayana Kaikala

















  • ----------------------------------------------------
పరిచయం :
  • కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయనఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయననవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు.
  • తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాల్లో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్నిమొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959 లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకుఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభనుగుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు యన్.టి.ఆర్ ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడ ఈయన్ని గమనించారు. 1960 లోయన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లో ఈయనకి ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వంవహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
ప్రొఫైల్ :
  • పేరు : సత్యనారాయణ కైకాల,
  • జన్మ తేది =జూలై 25 -1935 -
  • జన్మ స్థలం : కౌతవరం, ఆంధ్రప్రదేశ,
  • ఇతర పేర్లు =నవరస నటసార్వభౌమ,
  • ప్రాముఖ్యత =సినిమాలు, రాజకీయం,
  • రాజకీయ =పార్టీ తెలుగుదేశం పార్టీ,
  • మతం =హిందూమతము,
  • భార్య =నాగేశ్వరమ్మ,
గుర్తింపులు మరియు బహుమతులు
  • నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చినది.
  • నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
  • కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
  • నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చినది.
  • కైకాలకు అల్లు జాతీయ పురస్కారం ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ కైకాల సత్యనారాయణను పద్మశ్రీ డాక్టర్‌ అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అల్లు రామలింగయ్య కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు తెలిపారు. శనివారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ అక్టోబరు ఒకటిన అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుందన్నారు.

గణాంకాలు

  • 777 సినిమాలు ఇప్పటిదాకా
  • 28 పౌరాణిక చిత్రాలు
  • 51 జానపద చిత్రాలు
  • 9 చారిత్రక చిత్రాలు
  • 200 మంది దర్శకులతో పనిచేసాడు
  • 223 సినిమాలు 100 రోజులు ఆడాయి
  • 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
  • 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
  • 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి.

  • =========================================
Visit my website ->dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)