అల్లు రామలింగయ్య , Allu Ramalingayya

  • *************************************************************************************
పరిచయం :
  • అల్లు రామలింగయ్య పేరులోనే హాస్యం ఉంది. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రకకాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య .
బాల్యము
  • ఊరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో
  • పుట్టిన తేది : 1922 అక్టోబర్ 1 అల్లు రామలింగయ్య జన్మించాడు.
  • చదువు : పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు.
  • నటజీవితం ప్రారంభం : ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకెవరు నాటకాల వాళ్ళువచ్చినా వారివెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడంనిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్తప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీమూడురూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటినటనావగాహనతో తన వేషం మెప్పించాడు. తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటకకాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలామొదలైనంది ఆల్లు నటజీవితం.
  • అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియాఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపుఅంటరానితనంపై పోరు సలిపాడు.
చలనచిత్ర జీవితం
  • అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రితరహ పాత్రను అల్లుచే వేయించాడు. తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది.
  • పుట్టిలు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తనకుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరికదొరికినా ఉచితవైద్య సేవలందించేవాడు.
  • ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నడు. అల్లు హాస్యపు జల్లునేకాదుకామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగాచెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడుఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గ్న్న గొప్ప నటుడు అల్లు. సుమారుసినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలోముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.
  • అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకంచిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైకహాస్యనటుడు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు అతను సృష్టించినవే.
మరణము :
  • అల్లు రామలింగయ్య 2004 జూలై 31 తేదీన తన 82 ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగుచిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యంచిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది.
ఫిల్మోగ్రఫీ
  • ఇంద్ర (2002)
  • దేవుళ్ళు (2001)
  • మావిచిగురు (1996)
  • అల్లుడా మజాకా...! (1995) .... టాటా రావు
  • ముతమేస్త్రి (1993)
  • ఆ ఒక్కటి అడక్కు (1993) .... సహదేవుడు
  • మెకానిక్ అల్లుడు (1993)
  • పరుగో పరుగు (1993)
  • ఆపత్బందవుడు (1992) .... శ్రీపతి's ఫతే
  • అశ్వమేధం (1992)
  • పెద్దరికం (1992)
  • రౌడీ అల్లుడు (1991)
  • నా పెళ్ళాం నా ఇష్టం (1991)
  • గ్యాంగ్ లీడర్ (1991)
  • Raja విక్రమార్క (1990)
  • కొద సింహం (1990)
  • జగదేక వీరుడు అత్తిలోకసుందరి (1990)
  • కొండవీటి దొంగ (1990)
  • స్టేట్ రౌడీ (1989)
  • ఆటకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
  • చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం (1989)
  • ఖైది No. ౭౮౬ (1988)
  • యముడికి మొగుడు (1988) .... చిత్రగుప్త
  • మంచి దొంగ (1988)
  • ఆఖరి పోరాటం (1988)
  • దొంగ రాముడు (1988)
  • దొంగ మొగుడు (1987)
  • చంటబ్బాయి (1986)
  • మగధీరుడు (1986)
  • కిరాతకుడు (1986) .... రఘుపతి
  • రావణ బ్రహ్మ (1986)
  • విజేత (1985) .... అన్జయనేయులు
  • అడవి దొంగ (1985)
  • ఒక రాధా ఇద్దరు కృష్ణులు (1985)
  • జ్వాల (1985)
  • దొంగ (1985)
  • చట్టంతో పోరత్తం (1985) .... బ్రహ్మయ్య
  • ముచతగా ముగ్గురు (1985)
  • రుస్తుం (1984)
  • ఇంటి గుట్టు (1984)
  • మహానగరంలో మాయగాడు (1984)
  • హీరో (1984)
  • గూండా (1984)
  • బొబ్బిలి బ్రహ్మన్న (1984)
  • సంగర్షణ (1983)
  • మంత్రిగారి వియ్యంకుడు (1983) .... కొబ్బరికాయల సుబ్బారావు
  • ప్రేమ పిచోళ్ళు (1983)
  • అడవి సింహాలు (1983)
  • ముందడుగు (1983)
  • రెండు జెల్ల సీత (1983)
  • మొండిఘటం (1982)
  • బిళ్ళ రంగ (1982)
  • ఇది పెళ్లంటారా (1982)
  • సుభలేఖ (1982) .... లాయర్ చిల్లర భవాని సంకరం (గెస్ట్)
  • బొబ్బిలి పులి (1982)
  • జస్టీస్ చౌదరి (1982)
  • నిరీక్షణ (1982)
  • కిరాయి రౌడీలు (1981)
  • న్యాయం కావాలి (1981) .... టైపు ఇన్స్టిట్యూట్ ఓనరు
  • తోడూ దొంగలు (1981)
  • అగ్ని పూలు (1981)
  • కొండవీటి సింహం (1981)
  • మోసగాడు (1980)
  • సప్తపది (1980)
  • సర్దార్ పాపా రాయుడు (1980)
  • కోతల రాయుడు (1979)
  • శంకరాభరణం (1979)
  • వేటగాడు (1979)
  • మనవూరి పాండవులు (1978) .... కన్నప్ప
  • గోరంత దీపం (1978)
  • శివరంజని (1978)
  • ప్రేమలేఖలు (1977)
  • రామరాజ్యంలో రక్తపాసం (1976)
  • భక్త కన్నప్ప (1976)
  • మనుషులంతా ఒక్కటే (1976) .... దివాన్
  • సెక్రటరీ (1976)
  • శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
  • ముత్యాల ముగ్గు (1975) .... జోగినాధం
  • యమగోల (1975) .... చిత్రగుప్తుడు
  • బంత్రోటు భార్య (1974)
  • అందాల రాముడు (1973) .... రామలింగయ్య అ.కే.అ. తీటా
  • శారద (1973)
  • ఇద్దరు అమ్మాయిలు (1972)
  • టాటా మనవడు (1972)
  • బొమ్మ బొరుసా (1971)
  • Balaraju కథ (1970)
  • పూల రంగడు (1970) .... ధర్మ రావు
  • సంబరాల రాంబాబు (1970)
  • తల్లి తండ్రులు (1970)
  • బుద్ధిమంతుడు (1969)
  • రణభేరి (1968)
  • పరమానందయ్య శిష్యుల కథ (1966)
  • ఆత్మా గౌరవం (1965)
  • ప్రేమించి చూడు (1965)
  • దాగుడుమూతలు (1964)
  • నర్తనశాల (1963)
  • శ్రీ కృష్ణార్జున యుధం (1963) .... బ్రహ్మచారి
  • చదువుకున్న అమ్మాయిలు (1963)
  • మూగ మనసులు (1963)
  • గుండమ్మ కథ (1962)
  • ఇద్దరు మిత్రులు (1961)
  • Krishna లీలలు (1959)
  • పెళ్లి నాటి ప్రమాణాలు (1958)
  • అప్పు చేసి పప్పు కూడు (1958) .... చిదంబరం సెట్టి
  • మాయ బజార్ (1957/ఐ) .... శర్మ
  • భాగ్య రేఖ (1957)
  • తోడి కోడళ్ళు (1957) .... అయోమయం
  • దొంగ రాముడు (1955)
  • సంతానం (1955) .... కిరనకొట్టు ఓనరు
  • మిస్సమ్మ (1955) .... ముసలి పంతులు
  • పరివర్తన (1954)
  • వద్దంటే డబ్బు (1954)
  • పుట్టిల్లు (1953)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)