కాంతారావు-Kantharao T L

  • ----------------------------------------------------------------

పరిచయం :

  • తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (కాంతారావు) -ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించాడు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. నారద పాత్ర వేయడం ఈయనకే ప్రత్యేకము . సాంఘిక, జానపద, పౌరాణికాలలో ఆయన తనదైన శైలిలో గుర్తింపు పొందారు. కథానాయకునిగా, ప్రతినాయకునిగా, రెండో హీరోగా కూడా ఎన్నో పాత్రలను ఆయన పోషించారు. పౌరాణిక చిత్రాలలో నారదునిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణా నుండి వచ్చిన నటులలో ఎన్టీఆర్ స్థాయిలో ప్రజా గుర్తింపు పొందిన ఏకైక నటుడు కాంతారావు. వారిరువురి మధ్య ఎంతో స్నేహం ఉండేది. కంచుకోట , ఏకవీర , లవకుశ , పాండవ వనవాసం ఇలా 50 చిత్రాలలో వారు కలసి నటించారు. లవకుశ చిత్రంలో లక్ష్మణుని పాత్రకు వేరొకరిని ఎంపిక చేయగా ఎన్టీఆర్ పట్టుపట్టి కాంతారావుకు ఆ పాత్రను ఇప్పించారని చెబుతారు. తాను శ్రీకృష్ణుని పాత్ర వేయలేని సినిమాలలో కాంతారావునే ఎన్టీఆర్ ఆ పాత్రకు ఎంపిక చేసేవారు.
ప్రొఫైల్ :
  • పేరు : తాడేపల్లి లక్ష్మీకాంతారావు ,
  • పుట్టిన తేది : నవంబర్ 16, 1923,
  • మరణము : 22 మార్చి 2009 -ఉపిరి తిత్తుల కాన్సర్ వ్యాధి,
  • పుట్టిన ఊరు : నల్గొండ జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామము,
  • భార్య : హైమవతి,
  • పిల్లలు : నలుగురు కుమారులు , ఒక కూతురు .
  • మొదటి సినిమా : నిర్దోషి -1951,( హెచ్ .యం .రెడ్డి నిర్మించిన ),
  • మొత్తం చిత్రాలు నటించినవి : సుమారు 300 పైగా .
  • రాసిన పుస్తకం : "అనగనగా ఓ రాజకుమారుడు ". స్వేయకద .
  • తల్లి : సీతారామమ్మ ,
  • నివాసము : టి.నగర్ - చెన్నై ,

అవార్ద్స్ :

  • 2000 సం . రఘుపతి వెంకయ్య అవార్డు . యన్ .టి.ఆర్ .ట్రస్ట్ అర్ధిక సత్కారము

కొన్ని సినిమాలు :

  • సుమారు 400 సినిమాలు , 170 టి వి సేరియల్స్ లో తెలుగు ,కన్నడ , తమిళ భాషల లో నటిచారు .
సినిమాలు :
  • ముగ్గురు మొనగాళ్ళు
  • నిజం
  • కబీర్దాస్
  • ము త్యమంతా ముద్దు
  • విజేత
  • ఊరికిఇచ్చిన మాట
  • శ్రీ కృష్ణ తులాభారం
  • దేవుడు చేసిన మనుసులు ,
  • రహస్యం ,
  • శభాస్ రాముడు ,
  • ఎదురీత ,
source : సితార ,
  • ===============================
Visit my website ->Dr.Seshagirirao.com /

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)