అంజలి దేవి-AnjaliDevi
-------------------------------------------------------------
- ***********************************************
- అంజలీదేవి 1950-75 తరానికి చెందిన సినిమా నటీమణి మరియు నిర్మాత. అంజలీదేవి నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. సుమారు 350 సినిమా ల లో నటించారు .
- అంజనీకుమారే .. అంజలీదేవిగా 'గొల్లభామ' (1947)లో దేవకన్య వేషం వేసింది. 'గొల్లభామ'కీ, ఆ కొత్తనటి అంజలీదేవికీ పేరు వచ్చింది. 'కీలుగుర్రం' (1949)లో మరీ భయంకరమైన పాత్ర; రాక్షసి. రాజుగారి కోటలో ఉన్న ఏనుగుల్నీ, గుర్రాల్నీ తినే పాత్ర! ఇలాంటి పాత్రలతో సినిమా రంగంలో ప్రవేశించిన అంజలీదేవి- నాయికగా, వదినగా, తల్లిగా, అమ్మమ్మగా, బామ్మగా దశలవారిగా పాత్రలు ధరిస్తూ- గొప్ప నటిగానూ, మంచినటిగానూ, మహానటిగానూ ప్రసిద్ధి పొందింది.
- 'శ్రీ లక్ష్మమ్మ కథ'లో పతివ్రతలాంటి పాత్రని అంజలిదేవికి ఇచ్చినప్పుడు అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఆమె భయపడలేదు. దర్శక నిర్మాత బలరామయ్య గారూ భయపడలేదు. అంజలీదేవి- ఆ పాత్రధారణని ఒక సవాలుగా తీసుకుని నటించి, ఒప్పించారు. ఆమె కృషి ఫలించి, ఆమె నాయికగానే ముద్ర వేసుకున్నారు. అంతకుముందు వచ్చిన 'పల్లెటూరి పిల్ల'లోనూ ఆమె నాయికే. అది బాగా నడిచింది. నాటకరంగం మీద, విభిన్నమైన పాత్రలు ధరించి- పునాది వేసుకున్న ఆ నటి ఏ పాత్ర ధరించినా ఎందుకు రాణించదు?- సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలెన్నో అంజలీదేవి నటనకు గీటురాళ్లుగా నిలబడ్డాయి.
- --Ravi kondalarao@paathabangaram
- పేరు : అంజలి దేవి .
- పుట్టిన తేది : ఆగష్టు 24 -1927 .
- పుట్టిన ఊరు : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామము .
- అసలు పేరు : అంజనీ కుమారి.
- భర్త : పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. (1948)
- నివాసము : చెన్నై .
- తోబుట్టువులు : ఒక తమ్ముడు , ఇద్దరు చెల్లెల్లు , .
- మొదటి సినిమా : గొల్లభామ సినిమాలో డాన్సర్ గా , హీరోయిన్ గా కష్ట జీవి .
- మనుమరాలు : శైలరావు - నటి .
- మరణము : 13-01-2014,
సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి
- 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము,
- 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది.
చిత్ర సమాహారం
నటిగా
- పోలీసు అల్లుడు (1994)
- అన్న వదిన (1993)
- బృందావనం (1992)
- అశోక చక్రవర్తి (1989)
- చిన్నారి స్నేహం (1989)
- కృష్ణ గారి అబ్బాయి (1989)
- శృతిలయలు (1987)
- శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)
- ఆత్మబలం (1985) •
- కుటుంబ బంధం (1985) •
- మాంగల్య బలం (1985)
- • సూర్య చంద్ర (1985) •
- దొంగలు బాబోయ్ దొంగలు (1984) •
- పోజ్హుదు విదిన్జాచ్చు (1984) •
- అమాయకుడు కాదు అసాధ్యుడు (1983) •
- లంకె బిందెలు (1983) •
- పోరాటం (1983) •
- స్వయంవరం (1982) •
- భోగిమంటలు (1981) •
- గురు శిష్యులు (1981) ఇంకా ఎన్నో చిత్రాలలో నటించారు .
- అన్ని ఒరు ఆలయం
- మనలనే మంగయిన్ బాగ్యం
- ఆడుత వీటు పెన్న
- 1. పరదేశి
- 2. సువర్ణ సుందరి
- 3. స్వర్ణమంజరి
- 4. చండి ప్రియ
- 5. సతి సక్కుబాయి
- 6. షిర్డీ సాయి సత్య సాయి దివ్య కథ, అ తెలేసేరిఅల్.
- ==========================


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog