అనురాధ (నటి)-Anuradha
- అనురాధ 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార. ఆ దశకంలో జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కో శాంతి లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీరంగానికి దూరమయింది. ఈమె కుమార్తె అభినయశ్రీ తల్లి బాటలోనే నడిచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. 2007లో ఆట చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
- పేరు : అనూరాధ ,
- అసలు పేరు : సులోచన ,
- జననం : 21-జూలై-1966,
- పుట్టిన ఊరు : మద్రాస్ (తమిళనాడు ),
- ప్రముఖ పాత్రలు : గంధర్వకన్య, మాయాబజార్ ,
- భర్త : రతీష్ కుమార్ (నృత్యదర్శకుడు),
- తల్లి : సరోజ (సినీ తారలకు కేశాలంకరణ చేసేవారు),
- పిల్లలు : ఇద్దరు -- అభినయశ్రీ , కాళీచరణ్ ,
కెరీర్ :
- ఈమెకు పదమూడు సంవత్సరాల వయస్సులో ప్రముఖ తమిళ దర్శకుడు కె.జి.జార్జి ఈవిడను సినిమా రంగానికి పరిచయం చేశాడు. ఈమె పేరును సులోచన నుండి అనూరాధ గా మార్చాడు. కథానాయిక గా పరిచయమైన ఈమె తర్వాత కాలంలో శృంగార నృత్యాలకు పేరు పొందింది. అన్ని భాషలలో కలిపి సుమారు 35 చిత్రాలలో నటించింది. తెలుగు టీవీ ధారావాహిక అంతరంగాలు కూడా నటించింది.
అనురాధ నటించిన తెలుగు చిత్రాలు
- రేపటి పౌరులు.
- ఆట .
- ======================

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog