కస్తూరి శివరావు-Sivarao Kasturi

  • -------------------------------------------------------
పరిచయం :
  • ప్రేక్షకుల దగ్గర్నుంచి అమితమైన అభిమానం సంపాదించిన తొలి హస్యనటుడు కస్తూరిశివరావు. శివరావుకి సినిమాల్లో వేషాలు వెయ్యకముందే నలుగురులో మంచి పేరు వుండేది. అతను మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. వ్యాఖ్యానం సరసోక్తులతో, చమత్కారాలతో, ఉత్సాహభరితంగా వుండేది. ‘వ్యాఖ్యాత శివరావుఅని ప్రచారం ఇస్తే జనం పెరిగేవారు. సినిమాపూర్తయిన తర్వాతనో, మధ్య విరామంలోనో - వ్యాఖ్యానం చెబుతున్న శివరావు ఎలావుంటాడోచూడాలని జనం ఎగబడేవారు. ఐతే, అప్పటింకా ఆటోగ్రాఫులు అడగడాలు కరచాలనాలూరాలేదు.

సినీ జీవితం(profile)

  • శివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, స్వర్గసీమ (1945) తో ఇంకా బాగా తెలిసాడు. బాలరాజు (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి, జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
  • ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. గుణసుందరి కథ లో శివరావే కథానాయకుడు నిజానికి. ఆ చిత్రంలోని ఊతఓదం ‘గిడి గిడి’ తో జనసందోహం చేసిన సందడీ, గోలా ఆకాశం అంటేవి. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, పరమానందయ్య శిష్యుల కథ హాస్య నటులతో తీసాడు. నాగేశ్వరరావు హీరో కాగా, హీరోయిన్‌గా, గిరిజను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.

మరణం

  • శివరావు చరమదశ మాత్రం దయనీయంగా గడిచింది. అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయిన నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషన్ లో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. ఒకనాడు కారు సీటులో దర్జాగా కూచున్న శివరావు - కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డంలో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’ లకు రాలేదు. ఒకనాడు వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు - నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప చేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది. దానికి సాక్ష్యం "అంతటిస్థితినుంచి, ఎంతటి స్థితికి జారిపోయాడో పాపం!" అని జాలిపడుతూ, వెంట వెళ్ళిన ఆ ఏడుగురే!

ఫిల్మోగ్రఫీ :

  • యాక్టర్ , మ్యూజిక్ డిపార్టుమెంటు , డైరెక్టర్ , ప్రొడ్యూసర్

యాక్టర్ :

  • 1. శ్రీ సీత రామ కళ్యాణం (1961)
  • 2. అప్పు చేసి పప్పు కూడు (౧౯౫౮) .... తక్కు
  • 3. పాండురంగ మహత్యం (1957)
  • 4. ప్రేమ (౧౯౫౨)
  • 5. పరమానందయ్య శిష్యుల కథ (౧౯౫౦)
  • 6. శ్రీ లక్ష్మమ్మ కథ (౧౯౫౦)
  • 7. స్వప్న సుందరి (౧౯౫౦)
  • 8. లైలా మజ్ను (౧౯౪౯/ఐ)
  • 9. రక్షరేఖ (౧౯౪౯)
  • 10. గుణసుందరి కథ (౧౯౪౯)
  • 11. బాలరాజు (౧౯౪౮)
  • 12. ద్రోహి (౧౯౪౮)
  • 13. గ్రిహప్రవేశం (౧౯౪౬)
  • 14. స్వర్గసీమ (౧౯౪౫) .... డ్రామా డైరెక్టర్
  • 15. చూడమని (౧౯౪౧) .... మంగలి శాస్త్రి
  • ౧౬. వర విక్రయం (౧౯౩౯) .... బ్రిదేగ్రూం
మ్యూజిక్ డిపార్టుమెంటు:
  • 1. శ్రీ లక్ష్మమ్మ కథ (౧౯౫౦) (ప్లయ్బక్ సింగెర్)
  • 2. గుణసుందరి కథ (౧౯౪౯) (ప్లయ్బక్ సింగెర్)
  • 3. బాలరాజు (౧౯౪౮) (ప్లయ్బక్ సింగెర్)
  • డైరెక్టర్:
  • 1. పరమానందయ్య శిష్యుల కథ (౧౯౫౦) (అస్ కే. శివ రావు)
ప్రొడ్యూసర్:
  • 1. పరమానందయ్య శిష్యుల కథ (౧౯౫౦) (ప్రొడ్యూసర్)

source =వికీపీడియా .

  • ====================================
Visit my website -> Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)