లక్ష్మణరావు కొండవలస,Lakshmanarao






పరిచయం :
  • శ్రీ కొండవలస లక్ష్మణరావు గారు సుప్రసిద్ద తెలుగు నాటక మరియు చరలన చిత్ర హాస్య నటులు. వీరు మొదట నాటక రంగం లో లబ్ద ప్రతిష్టులు. పిమ్మట ప్రసిద్ద దర్శకులువంశీ, తన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తో వీరిని తెలుగు చలనచిత్ర రంగానికిపరిచయం చేసారు. కొండవలస: 1700లకు పైగా నాటికలు, నాటకాలు వేశాను. 'నవరంగం, కౌళావిలాసం' నాటకాలకు నంది అవార్డులు వచ్చాయి. 'రేపటి శత్రువు, ఇండియన్‌ గ్యాస్‌, టామీ, టామీ' నాటకాలు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రొఫైల్ :
  • జన్మ నామం = కొండవలస లక్ష్మణరావు
  • జననం = నవంబర్ 12 1946 (వయసు 61)
  • పుట్టిన ఊరు : ఖరగ్ పూర్ - వెస్ట్ బెంగాల్ , నాన్న రైల్వే ఉద్యోగి అయినందున ట్రాన్పర్ పై అక్కడ ఉన్నారు .
  • సొంత ఊరు : కొండవలస గ్రామము - ఆమదాలవలస సమీపములో.
  • చదువు : 1957 ప్రాంతములో గార లో ఏడో తరగతి వరకు , 1958 నుండి 8 వ తరగతి నుండి N.T.R మున్సిపల్ హైస్కూల్ లోను , వైజాగ్ లో బి.కాం చదివారు . పోర్ట్ లో ఎకౌంటెంట్ గా ఉద్యోగం , ప్రైవేటు గా యం.కాం చేసారు. డిప్లమో ఇన్ యాక్టింగ్ , డైరక్షన్ కోర్సులు చేసారు .
  • వివాహము ; 1977 లో జరిగింది .
  • మతము : హిందూ - పట్నాయిక్ ,
  • కుటుంబము : కుమారుడు = మణిధీర్ -కోడలు =శ్వేత , కుమార్తె = మాధవీలత(కుమార్తె ,అల్లుడు ..అమెరికాలో ఉంటున్నారు) ,  అమ్మ =మణిపాతృని రాజేశ్వరి , అమ్మతండ్రి =కాంతారావు పట్నాయక్ (వీరి ఊరు కోటబొమ్మాళి)
  • Death : 02/11/2015 (Monday) at Hyderabad  due to heart attack
కెరీర్ :
  • స్కూల్ లో నాటకాలు వేసేవారు , అల నాటకాల , నటన మీద ఆసక్తి పెరిగింది , కాశీ విశ్వనాద్ ఇతని కొలీగ్ - రచించిన " నవరాగం " , ఆకెళ్ళ గారు రచించిన "కేలీవిలాసం " మున్నగు నాటకాల లో వేషాలు వేసారు . తమ్ముళ్ళు చదువులుచ్ల్లెల్లు పెళ్ళిళ్ళు పూర్తైన తరువాత వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని సినిమాలకు రావడం జరిగింది .
  • కొండవలస: శ్రీకాకుళం మాండలికం అంటే నాకెంతో ఇష్టం. నేను ఈ ప్రాంతంలో పుట్టిన వాడిని కనుక జిల్లా యాస, భాషలు అతి సులువుగా మాట్లాడగలుగుతున్నా. 'అయితే... ఒకే..' వంటి సంభాషణలను ప్రవాసాంధ్రులు సైతం ఎంతగానో ఇష్టపడుతున్నారు. సినీ పరిశ్రమలో మనభాష రోజురోజుకీ ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కాసింత చిన్నచూపు, చులకన భావన ఉండటం నన్ను బాధిస్తుంది.
  • నే నొప్పుకోను.. నే నొప్పుకోను.......... అయితే ఓకే'' అంటూ వెండితెరపై హాస్యం పండిస్తున్న కొండవలస లక్ష్మణరావు తన సొంత జిల్లా 'సిక్కోలు'లో సోమవారం సందడి చేశారు. శ్రీకాకుళంలో సిక్కోలు సంబరాలు లో కాసేపు హాస్యంగా మాట్లాడారు. ''నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం...'' అంటూ నవరసాల్లో హాస్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. నేటి గజిబిజి జీవన యానం.. చిన్న చిన్న కుటుంబాలు.. ఒంటరి జీవితాల్లో.. కాసింత ఆనందంగా నవ్వుకోవడానికి తీరికే దొరకడం లేదని, సినిమాల ద్వారా హాస్యాన్ని కొంతవరకూనైనా పొందగలుగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
(1946-11-12 ప్రముఖ పాత్రలు :
  • ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డార చిత్రం లో - పొట్టిరాజు,
  • ఎవడి గోల వాడిది లో- బక్కరెడ్ది

నటించిన చిత్రాలు :

  • 2008 :
  • సవాల్ ,
  • కొంటె కుర్రాళ్ళు ,
  • కృషి ,
  • నవ్వులే నవ్వులు ,
  • నిండు పౌర్ణమి ,
  • నీ సుఖమే నే కోరుతున్నా ,
  • వీడు మామూలోడు కాదు ,
2007 :
  • భజంత్రీలు ,
  • ఆట ,
  • ఆదివారం ఆడవాళ్లకు సెలవు ,
  • భూకైలాస్ ,
  • మధుమాసం .,
  • అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి -హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం,
  • రాఖీ ,
  • రైల్వే కూలీ -చిత్రం,
2006:
  • ఒక విచిత్రం ,
  • శ్రీకృష్ణ 2006 .
  • అందాలరాముడు , విజయవంతమైన చిత్రం,
  • హ్యాపి-అతిధి పాత్ర ,
  • వీరభద్ర ,
  • ఒక ఊరిలో ;
  • చుక్కల్లో చంద్రుడు ,
  • జై చిరంజీవ ,
2005:
  • ఎవడి గోల వాడిది ,-బక్కరెడ్డి హాస్య చిత్రము, విజయవంతమైన చిత్రం
  • కాంచనమాల కేబుల్ టివి ,
  • పందెం , రాజాబాబు ,
  • దొంగరాముడు అండ్ పార్టీ ,
  • శ్రీరామచంద్రులు- విజయవంతమైన చిత్రం,
  • కబడ్డి కబడ్డి-విజయవంతమైన చిత్రం,
2004:
  • సూర్యం ,
  • ఆప్తుడు .
  • శత్రువు ,
  • దొంగ ..దొంగది-ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తొలి చిత్రము,
  • పళ్ళకిలో పెళ్ళీకూతురు , ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ తొలి చిత్రము,
  • Xట్రా ,
  • సారీ.. నాకు పెళ్ళైంది ,
  • మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏంతెస్తారు ,
  • ఆనందమానందమాయె ,
2003 :
  • ఎవరే అతగాడు ,
  • ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పొట్టి రాజు తొలి చిత్రము,

  • శ్రీకాకుళం జిల్లాలో సన్మానము : 20/ఫిబ్రవరి /2012 
 ఐతే ఓకే' డైలాగ్‌ ఊహించని విధంగా తన జీవితంలో గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సినీ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి స్థానిక నరసన్నపేట పంచాయతీ కార్యాలయంలో గాంధీ కళామండపంపై శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో కొండవలస సన్మాన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 'తాను ఊహించని విధంగా సినీ రంగానికి పరిచయమయ్యానని పేర్కొన్నారు. అవును వారిష్టపడ్డారు నాటిక చూసిన దర్శకుడు వంశీ తనను సినీరంగానికి పరిచయం చేశారని చెప్పారు. తాను రెండు పర్యాయాలు అమెరికా వెళ్లినపుడు అక్కడ తన సినీ డైలాగులతో మెప్పు పొందానని చెప్పారు. ఇప్పటికీ తనను కొండవలస లక్ష్మణరావుగా గుర్తించరని, ఐతే ఓకే అంటూ సంభోదిస్తారని లక్ష్మణరావు తెలిపారు. మొత్తం 231సినిమాల్లో నటించానని తెలిపారు. 1600 నాటికల్లో ప్రదర్శన ఇచ్చానన్నారు. జిల్లాను మరిచిపోలేను.. తల్లి వంటి జిల్లాను మరిచిపోలేనని కొండవలస లక్ష్మణరావు అన్నారు. తాను జిల్లాలో పుట్టి పెరిగానని, శిష్టకరణ సంఘం తనను సన్మానించడం ఆనందదాయకమని అన్నారు. సారవకోట, కోటబొమ్మాళి, కొండవలస గ్రామాలతో తనకున్న సంబంధాన్ని వివరించారు. శిష్టకరణ సంఘం అధ్యక్షులు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, శిష్టకరణ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.వి.జగన్నాధరావు పట్నాయక్‌, రాష్ట్ర సంఘ అధ్యక్షులు పి. ఉమామహేశ్వరరావు, పాలకొండ ఆర్డీవో ఎస్‌.వెంకటేశ్వరరావు, డి.కె.దాసుబాబు, జిల్లా శాఖ అధ్యక్షులు ఇప్పిలి జగన్నాధరావు, మాజీ జెడ్పీటీసి చింతు రామారావు, కె.సి.హెచ్‌.బి.గుప్త, ఎస్‌.రాంబాబు, ఎ.పి.వి.రమణమూర్తి, యు.మనోహరరావు, యు.రాధాకృష్ణ, అంపలాం వసంతకుమార్‌, డి.వి.రఘు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ఆర్‌.ఎస్‌.పట్నాయక్‌, కాశీవిశ్వనాథ్‌లకు కూడా సంఘం సన్మానించింది.


  • ============================

Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)