ఋష్యేంద్రమణి-Rusyendramani
- ========================
- ఋష్యేంద్రమణి ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటి. ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని, నాట్యాన్నిఅభ్యసించారు. కొమ్మూరి పట్టాభిరామయ్య గారి లక్ష్మీవిలాస నాటక సభలో చేరి కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వులరామతిలకం వంటి ప్రసిద్ధ నటుల వద్ద శిక్షణ పొందారు.
- పేరు : రుస్యేంద్ర మణి ,
- పుట్టిన తేదీ : 01-జనవరి -1917 ,
- పుట్టిన స్థలము : విజయవాడ ,
- భర్త : జవ్వాది రామకృష్ణారావు ,
- మరణము : 17- ఆగస్టు -2002 .
- ఆనాడు రాజారావు నాయుడు నిర్మించిన ' శ్రీకృష్ణ తులాభారం' చిత్రంలో సత్యభామ పాత్ర ధరించారు. ఆ చిత్రంఅపజయం కావడంతో తిరిగి నాటకరంగంలో ప్రవేశించి ప్రహ్లాద, రాధాకృష్ణ, చింతామణి, తులాభారం మొదలగునాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించారు. ఆనాడు కడారు నాగభూషణం, పసుపులేటి కన్నాంబ నడిపిన రాజరాజేశ్వరీ నాట్యమండలితో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించారు. భర్త జవ్వాది రామకృష్ణారావు 'మాతృభూమి' అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడానికి చెన్నై రావడంతో తానుకూడాచెన్నై చేరి 'పాండురంగ విఠల్' అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించారు. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మంగారి తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన 'శిలప్పదికారం' ఆధారంగా నిర్మించిన పత్ని చిత్రంలో కణ్ణకి పాత్ర ధరించారు. కోవలన్ పాత్రను నేటి సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవెలమూడి ప్రకాశరావు ధరించారు. కణ్ణకి పాత్రను ఆమె అత్యద్భుతంగా అభినయించారు. తరువాత చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మి పాత్ర , సీతారామ జననంలో కౌసల్యగాను , సేతుబంధన్ లో ఇంద్రాణి గా, భక్త సిరియాళ లో కథాయకి పాత్రను ధరించి మెప్పించారు. ఈమె వీర, రౌద్ర రసాలనుఎంత ఉత్తేజంగా అభినయిస్తారో, దుఃఖ రసానికి సంబంధించిన కరుణ రస ప్రధానమైన సాత్విక పాత్రలు కూడా అంతప్రతిభావంతంగానూ పోషించేవారు. మల్లీశ్వరిలో తల్లిపాత్రనూ, విప్రనారాయణలో వేశ్వపాత్రనూ, మాయాబజార్, జగదేక వీరుడు, అగ్గిరాముడు, కృష్ణసత్య, పాండురంగ మహత్మ్యం మొదలగు ఘనమైన చిత్రాలలో వివిధ ప్రధాన పాత్రలుపోషించారు.
- ఈమె చలనచిత్రాలలోకి వచ్చేప్పటికి, నటీనటులకు వేరేవారు గాత్రంతో పాటలుపాడటఅనికి సాంకేతిక అభివృద్ధి జరుగలేదు. దాదాపుగా అందరు నటీనటులు తమ పాటలు తామే పాడుకొనేవారు. అదే వరవడిలో, ఋష్యేంద్రమణి తన పాటలను తానే పాడుకొనేది. గాయనిగా మంచి పేరు వచ్చింది. మాయాబజారు సినిమాలో అభిమన్యునితోపాటుగా వెళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కచుడు వీరి మీద దాడిజరిపినప్పుడు , ఈమె పాడిన పద్యం/పాట ఇప్పటికికూడ ఎంతగానో ప్రాజదరణపొందుతున్న పాత పాటలలో ఒకటి.
- ==================================
Visit my website : dr.seshagirirao.com



జగదేక వీరుడు,మల్లీశ్వరి మొదలైన చలన చిత్రాలలో ఋష్యేంద్ర మణి పాత్రలు మరువ లేనివి.ఆమె గురించి అమూల్యమైన విశేషాలను అందించారు. ఆమె భర్త,కుటుంబ వివరాలను కూడా తెలిపినచో,వ్యాసము సమగ్రంగా ఉండేది.
ReplyDeleteజగదేక వీరుడు,మల్లీశ్వరి మొదలైన చలన చిత్రాలలో ఋష్యేంద్ర మణి పాత్రలు మరువ లేనివి.ఆమె గురించి అమూల్యమైన విశేషాలను అందించారు. ఆమె భర్త,కుటుంబ వివరాలను కూడా తెలిపినచో,వ్యాసము సమగ్రంగా ఉండేది.
ReplyDelete