అక్కినేని నాగార్జున,Nagarjuna Akkineni
పరిచయం: వ్యక్తిగతం
- నాగార్జున సుప్రసిధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్ లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత మిచిగన్ విశ్వ విద్యాలయంలో ఆటోమొబైల్ ఉన్నత విద్యను అభ్యసించారు . ఇతని ప్రధమ వివాహం ఫిబ్రవరి 18, 1984 నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిధ నటుడు వెంకటేష్ కు సోదరి . వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడాడు. ఈమె మాజీ దక్షిణ భారత నటి.
- పేరు : నాగార్జున అక్కినేని ,
- పుట్టిన తేది : ఆగష్టు 29, 1959 ,
- పుట్టిన ఊరు : చెన్నై లో జన్మించిరి ,
- చదువు : యం .యస్ .(ఇండస్ట్రియల్ ఇంజినీర్ -యు.యస్.ఎ)
- ఎత్తు : 6' 0'' ,
- భర్య : అమల (రెండో భార్య ),
- పిల్లలు : నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి వాడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994), రెండవ భార్య కొడుకు.
- తోబుట్టువులు : నలుగురు - ఒక అన్నయ్య(వెంకట్ -యం.బి.ఎ.) , ముగ్గురు సోదరీమణులు =సత్యవతి , నాగసుశీల, సరోజ .
- మొదటి సినిమా : విక్రం (1986 ),
సినిమా జీవితము
- ఇతని మొదటి చిత్రం విక్రం, మే 23, 1986 లో విదుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రములలొ నటించిన పిమ్మట, ఈయన మజ్ఞు సినిమాలొ విషాద కధానాయకుడి పాత్ర పోషించాడు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్దుడు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలొ నటించాడు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకధా చిత్రం గీతాంజలి మరియు రాంగోపాల వర్మ దర్సకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కధానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉన్నది. శివ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించి బాలీవుడులో కూడా అడుగుపెట్టాడు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశి దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించాడు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచినది.
- 2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసు లో ముఖ్య పాత్రైన రామదాసు ను పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నాడు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించాడు.
- ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నాడు.
- విక్రం .
- కెప్టెన్ నాగార్జున ,
- అరణ్యకాండ ,
- మజ్ను ,
- సంకీర్తన ,
- కలెక్టర్ గారి అబ్బాయి ,
- అగ్ని పుత్రుడు ,
- కిరాయి దాదా ,
- విజయ్ ,
- వికి దాదా ,
- గీతాంజలి .
- అగ్ని ,
- శివ ,
- ప్రేమ యుద్ధం ,
- నేటి సిద్ధార్థ ,
- ఇద్దరు ఇద్దరే ,
- శివ (హిందీ),
- నిర్ణయం ,
- చైతన్య ,
- శాంతి క్రాంతి ,
- జైత్రయాత్ర ,
- కిల్లర్ ,
- ఖుదా గావ్ (హిందీ ),
- అంతం ,
- ద్రోహి (హిందీ).
- ప్రేసిద్రంట్ గారి పిల్లం ,
- రక్షణ ,
- వారసుడు ,
- అల్లరి అల్లుడు ,
- గోవింద గోవింద ,
- హలో బ్రోతేర్ ,
- క్రిమినల్ ,
- ఘరానా బుల్లోడు ,
- క్రిమినల్ (హిందీ ) ,
- వజ్రం ,
- రాముడొచ్చాడు ,
- మిస్టర్ బేచారా ,
- నిన్నే పెళ్ళాడుతా ,
- అన్నమయ్య ,
- రాత్చగాన్ ,
- అన్గారేయ్ (హిందీ ) ,
- ఆవిడ మా ఆవిడే ,
- ఆటో డ్రైవర్ ,
- చంద్రలేఖ ,
- జాఖం (హిందీ) ,
- సీతారామరాజు ,
- రావోయి చందమామ ,
- నువ్వు వస్తావని ,
- నినే ప్రేమిస్తా ,
- ఆజాద్ ,
- ఎదురులేని మనిషి ,
- బావ నచ్చాడు ,
- ఆకాశ వీధిలో ,
- స్నేహమంటే ఇదేరా ,
- సంతోషం ,
- అగ్ని వర్ష (హిందీ ) ,
- మన్మధుడు ,
- శివమణి ౯౮౪౮౨౨౩౩౮ .
- యల్.ఓ.సి. కార్గిల్ (హిందీ),
- నేనున్నాను ,
- మాస్ ,
- సూపర్ ,
- శ్రీ రామదాసు ,
- బాస్ ఐ లవ్ యు ,
- డన్ ,
- కింగ్ ,
- ============================
- Visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog