Savitri (actress),సావిత్రి







  • -----------------------------


పరిచయం :
  • తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి . దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి,అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటిఅనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది.


ప్రొఫైల్ :

  • పేరు : కొమ్మారెడ్డి సావిత్రి .
  • జన్మ నామము : సావిత్రి నిశంకర , 
  • పుట్టిన ఊరు : చిర్రావూరు గ్రామము, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం. 
  • పుట్టిన తేది : 1937 డిసెంబర్ 6 న,
  • మరణించిన తేది : 1981 డిసెంబర్ 26 న చెన్నై లో మరణించింది.
  • తండ్రీ : కొమ్మారెడ్డి గురవయ్య,
  • తల్లి : సుభద్రమ్మ.
  • చదువు : తన ఆరవ యేటనే తండ్రిని కోల్పోవడము వలన మామ? యొక్క సహాయముతో విజయవాడ లోనికస్తూరీబాయి మెమోరియల్ పాఠశాలలో మూడవ ఫారం (8వ తరగతి) వరకు చదువుకున్నది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రిదగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా నవభారతనాట్యమండలిని నడిపింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.
  • వివాహం : ఆమె తమిళచిత్రాలలోనూ నటించి, పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే అది అంత విజయం సాధించలేదు. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. 
  • పిల్లలు :  ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. 
  • భర్త : జెమినీ గనేశన్‌-అయితే ఆ పెళ్ళి చెడిపోయింది.
  • మరణము : ఆస్తిపాస్తులూ కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
చలనచిత్ర జీవితం
  • ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలతో తెలుగు సినిమాలలో అరంగేట్రం చేసింది. ఆ తరువాత కె.వి.రెడ్డిదర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒకమలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభనునిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వంవహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ మిస్సమ్మ సినిమాలో ప్రధానపాత్ర పోషించింది. ఆచిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.
ఇతర విశేషాలు
  • మల్లెపూలు, వర్షం సావిత్రి ఇష్టాలు. ఆమెది ఎడమచేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలోక్రికెటు మ్యాచు ఉంటే దానిని ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజులలోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగుదంతంతో చేసిన చదరంగం బల్లకూడాఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా ఆమె దిట్ట. ఆమె తన భర్త జెమినీగణేశన్ను, రేలంగిని, సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేవారు. దానధర్మాలవిషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.













 సినిమాలు
  • నటిగా
  • 1. సంసారం (1950)
  • 2. అగ్నిపరీక్ష (1951)
  • 3. పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
  • 4. పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
  • 5. పల్లెటూరు (1952)లో సుగుణ
  • 6. ప్రతిజ్ఞ (1953)
  • 7. దేవదాసు (1953)లో పార్వతి
  • 8. బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
  • 9. మేనరికం (1954)
  • 10. చంద్రహారం (1954)లో చంచల
  • 11. బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
  • 12. పరివర్తన (1954)లో సుందరమ్మ
  • 13. వదిన (1955)
  • 14. మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
  • 15. మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
  • 16. అర్ధాంగి (1955)
  • 17. సంతానం (1955)లో శారద
  • 18. కన్యాశుల్కం (1955)లో మధురవాణి
  • 19. దొంగరాముడు (1955)లో సీత
  • 20. చరణదాసి (1956)లో లక్ష్మి
  • 21. భలేరాముడు (1956)
  • 22. అమరదీపం (1956)లో అరుణ
  • 23. వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
  • 24. తోడికోడలు (1957)లో సుశీల
  • 25. ఎమ్మెల్యే(M.L.A.) (1957)లో నిర్మల
  • 26. మాయాబజార్ (1957)లో శశిరేఖ
  • 27. మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
  • 28. కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
  • 29. మాంగల్యబలం (1958)
  • 30. అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
  • 31. నమ్మినబంటు (1959)
  • 32. విమల (1960)
  • 33. శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
  • 34. శాంతినివాసం (1960)
  • 35. దీపావళి (1960)
  • 36. చివరకు మిగిలేది (1960)లో పద్మ
  • 37. పాపపరిహారం (1961)
  • 38. పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
  • 39. పాండవవనవాసం (1961)లో ద్రౌపది
  • 40. కలసివుంటే కలదుసుఖం (1961)
  • 41. సిరిసంపదలు (1962)
  • 42. పవిత్రప్రేమ (1962)
  • 43. మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
  • 44. మంచిమనసులు (1962)
  • 45. ఆరాధన (1962)లో అనూరాధ
  • 46. గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
  • 47. రక్తసంబంధం (1962)
  • 48. ఆత్మబంధువు (1962)
  • 49. రక్తతిలకం (1963)లో కమల
  • 50. మూగ మనసులు (1963)లో రాధ
  • 51. కర్ణలో (1963) భానుమతి
  • 52. కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
  • 53. ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
  • 54. చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
  • 55. నర్తనశాల (1963)లో ద్రౌపది
  • 56. వెలుగునీడలు (1964)లో సుగుణ
  • 57. పూజాఫలం (1964)లో సీత
  • 58. నవరాత్రి (1964)
  • 59. కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
  • 60. గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
  • 61. డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
  • 62. దేవత (1964)
  • 63. సుమంగళి (1965)
  • 64. తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
  • 65. నాదీ ఆడజన్మే (1965)
  • 66. మనుషులు మమతలు (1965)
  • 67. నవరాత్రి (1966)
  • 68. భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
  • 69. ప్రాణమిత్రులు (1967)
  • 70. వరకట్నం (1968)
  • 71. తల్లితండ్రులు (1970)లో కౌసల్య
  • 72. మరోప్రపంచం (1970)
  • 73. అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
  • 74. జగన్మోహిని (1978)
  • 75. అందరికంటే మొనగాడు (1985)
  • 76. దేవదాసు మళ్లీ పుట్టాడు
  • 77. గోరింటాకు (చివరి సినిమా)
నిర్మాతగా
  • 1. ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
  • 1. మాతృదేవత (1970)

ఇతరములు
  • 1. నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయన

  • =============================
visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కళ్యాణి(న్యూస్ రీడర్) ,Kalyani(News Reader)