సౌందర్య (రజినీకాంత్ కూతురు) , Soundarya (Daughter of Rajinikanth)
- ----------------------------------------
పరిచయం :
- సౌందర్య , తమిళ సిని నటుడు - రజిని కాంత్ కూతురు , " కథానాయకుడు " సినిమా లో 'సినిమా సినిమా ' అనే పాట లో ఆఫీసు లో పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒచేర్ స్టూడియోస్ అధినేత.
- అసలు పేరు
- షకూ భాయ్ రావ్ గైక్వాడ్.
- చదువు
- చిన్నప్పుడంతా చెన్నైలో అమ్మ నడిపిస్తోన్న ఆశ్రమ పాఠశాలలోనే చదివా. తరవాత ఆస్ట్రేలియాలో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశా.
- దర్శకత్వం కాకుండా
- నరసింహ, చంద్రముఖి, శివాజీ తదితర సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశా. 'గోవా' సినిమాకు నిర్మాతగా మారా. 'కథానాయకుడు'లో అతిథిగా కనిపించా. గ్రాఫిక్స్, యానిమేషన్, ఎడిటింగ్ లాంటి పనులను నిర్వహించే 'ఆక్రే పిక్చర్ ప్రొడక్షన్స్' అనే సంస్థను స్థాపించా.
- సినిమాలు
- యానిమేషన్ కోర్సు పూర్తి చేసొచ్చాక చాలామంది తమిళ దర్శకులు నటించమని అడిగారు. కానీ కెమెరా వెనకాలే సౌకర్యవంతంగా ఉండగలనని అనిపించింది. అందుకే 'నరసింహా' సినిమా దగ్గర్నుంచీ నాన్న నటించే ప్రతి సినిమాకూ గ్రాఫిక్స్ విభాగంలో పనిచేయడం మొదలుపెట్టా.
- తెరవెనుక సంగతి
- ఈ సినిమా బడ్జెట్ సుమారు నూట పాతిక కోట్లు, దానికి తోడు నాన్నను డైరెక్ట్ చేయాలి... చాలా కంగారుపడ్డా. ఒక్కోసారి సన్నివేశం సరిగా కుదరట్లేదనిపిస్తే ఆయనకు 'కట్' అని చెప్పడం కష్టంగా అనిపించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేప్పుడు ఆయనా చాలా ఇబ్బంది పడ్డారు.
- ఇంట్లో బాస్
- కచ్చితంగా అమ్మే. నేను తన మీద వందశాతం ఆధారపడితే, నాన్న రెండొందల శాతం ఆధారపడతారు. నాకు స్ఫూర్తి కూడా తనే. నాలుగువేల మంది పిల్లలున్న ఆశ్రమాన్ని నడిపిస్తూ, మమ్మల్ని జాగ్రత్తగా పెంచింది. ఏనాడూ మాకు సూపర్‌స్టార్ పిల్లలమనే గర్వాన్ని రానీయలేదు.
- నాన్న గురించి
- ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో ఎలా మాట్లాడతారో, అతని డ్రైవర్‌తో కూడా అలానే మాట్లాడతారు. స్థాయితో సంబంధం లేకుండా మనుషుల్ని గౌరవించడం ఆయన్నుంచే నేర్చుకున్నా. బస్‌కండక్టర్‌గా ఉన్నప్పుడు ఎంత సింపుల్‌గా ఉండేవారో, ఇప్పుడూ అలానే ఉంటారు. అది అందరికీ సాధ్యం కాదు.
- పెళ్లి సంగతి
- అశ్విన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. విషయమేంటంటే... తను నాకు ప్రపోజ్ చేయడానికి ముందే మా నాన్నను కలిసి నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. నాన్న అనుమతి తీసుకున్నాకే నాకు విషయం చెప్పాడు.
- బాధపెట్టిన విషయాలు
- ఏడాది క్రితం నాన్నా, అమ్మా ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు. నాకూ, అక్కకూ ఏం చేయాలో అర్థం కాలేదు. అదృష్టం కొద్దీ ఇద్దరూ త్వరగానే కోలుకున్నారు. ఆ రోజులు మళ్లీ రాకూడదు. నాన్నతో తీయాలనుకున్న 'రానా' నా డ్రీమ్ ప్రాజెక్టు. కానీ అది మధ్యలోనే ఆగిపోయినప్పుడు చాలా బాధపడ్డా.
- అంచనాల గురించి
- సెలెబ్రిటీల పిల్లలు ఏ పని మొదలుపెట్టినా అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మా నాన్న ఇప్పుడు సూపర్‌స్టార్. ఆయన ఈ స్థాయికి రావడానికి ముప్ఫై ఏళ్లు పట్టింది. నాకు కనీసం పదిహేనేళ్లు సమయమిచ్చాక నాన్న అభిమానులు నాపైన అంచనాలు ఏర్పరచుకోవడం సమంజసం.
- రజనీజోక్స్...
- ప్రపంచంలో అసాధ్యమైన విషయాలను నాన్న మాత్రమే చేయగలరు అంటూ ఇంటర్నెట్‌లో 'రజనీకాంత్ జోక్స్' పేరుతో చాలా వచ్చాయి. వాటిలో హాస్యం ఉంటుంది తప్ప ఎక్కడా నాన్నను తక్కువ చేసి చూపించరు. అందుకే నాన్నతో సహా, అందరం వాటిని తేలిగ్గా తీసుకుంటాం.
- భవిష్యత్తులో
- మరిన్ని సినిమాలకు దర్శకత్వం చేస్తా. బావ ధనుష్‌తో ఓ సినిమా చేయాలనుంది. కానీ అతని డేట్స్ దొరకడం కాస్త కష్టమే!
- ==============================
Visit website : dr.seshagirirao.com
