బాపిరాజు అడివి , Bapiraju Adavi










  • ------------------------------------------


పరిచయం : 
  • అడివి బాపిరాజు (Adavi Bapiraju) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచే వారు.
ప్రొఫైల్ : 
  • జననం -- అక్టోబరు 8, 1895--భీమవరం.
  • మరణం-- సెప్టెంబరు 22, 1952
  • ఇతర పేర్లు-- బాపిబావ
  • వృత్తి -- కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు
  • తండ్రి -- కృష్ణయ్య
  • తల్లి -- సుబ్బమ్మ
  • .
  • కులము : నియోగి బ్రాహ్మిన్‌,
  • చదువు : బి.ఎ.,బి.ఎల్ ,
  • మరణం : సెప్టెంబరు 22, 1952 -.
కెరీర్  :
  • బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుని ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు. బాపిరాజుకు చిన్ననాటినుండీ కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాధ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది. 1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
రచనలు : నవలలు
  • * నారాయణరావు
  • * తుఫాన్
  • * గోనగన్నారెడ్డి
  • * కోనంగి
  • * హిమబిందు
  • * కోణంగి
  • * అడవి శాంతిశ్రీ
  • * అంశుమతి
రేడియో నాటికలు
  • * దుక్కిటెద్దులు
  • * ఉషాసుందరి
  • * భోగిరలోయ ?
ప్రసిద్ధి చెందిన కధలు
  • * తూలికా నృత్యం
  • * హంపీ శిధిలాలు
  • * శిల్పబాల
  • * వీణ
దర్శకత్వం వహించిన సినిమాలు
  • * మీరాబాయి
  • * అనసూయ
  • * ధ్రువ విజయం
మరెన్నో కధలు, గేయాలు రచించాడు.


  • ===========================

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కళ్యాణి(న్యూస్ రీడర్) ,Kalyani(News Reader)