ఆత్రేయ , Atreya
పరిచయన్ :
- ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...ఆచార్య ఆత్రేయ (Acharya Atreya)..
- ఆచార్య ఆత్రేయ (Acharya Atreya) గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు ,తెలుగులోసుప్రసిద్ధ నాటక, సినీ రచయిత, నిర్మాత మరియు దర్శకులు. నాటక కర్తగా, ప్రయోక్తగా పేరుపొందిన ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. ‘దీక్ష’(1951)తో సినీరంగంలో ప్రవేశించారు. అర్ధాంగి, తోడికోడళ్లు వంటి చిత్రాలకు మాటలు, పాటలు రాసి స్థిరపడ్డారు. ‘మనసులు’తో అంతమయ్యే పేర్లుగల చిత్రాలకు, కొన్ని ఇతర చిత్రాలకు మనసు పాటలు రాసి ‘మనసు కవి’గా గుర్తింపు పొందారు.తేలికైన పదాలలో బరువైన భావాన్ని పలికించగల ఆత్రేయను, ‘సినీవేమన’ అనవచ్చు. మాటల పొదుపుకు పెట్టింది పేరు. వాన పాటలు, వలపు పాటలు, అమ్మ పాటలకు మార్గనిర్దేశకులు. ఆత్రేయ రాసినన్ని బొమ్మ-బొరుసు పాటలు మరెవరూ రాయలేదు (రు)! మంచి మనసులు, మూగ మనసులు, డా.చక్రవర్తి, దసరా బుల్లోడు, ప్రేమనగర్ ఇత్యాది చిత్రాలకు 1,400 పాటలు రాసిన ఆత్రేయ, తులనాత్మకంగా అధిక శాతం ‘హిట్స్’ ఉన్న సినీగేయ కవి.
- గౌరవ పేరు : ఆచార్య ఆత్రేయ .
- అసలు పేరు : కిలంబి వెంకట నరసింహాచార్యులు .
- ఇతర పేర్లు : ఆత్రేయ్ .
- మాటలు : హిందూ బ్రహ్మిన్ ,
- పుట్టిన తేది : 1921 మే 7 న
- పుట్టిన ఊరు : నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడుగ్రామంలో జన్మించాడు.
- తండ్రి : కృష్ణమాచార్యులు.
- తల్లి : సీతమ్మ.మరణము : 13 సెప్టెంబర్ 1989.
- చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలనుతీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగాప్రాఅచారం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలోచెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించేవిశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లబించింది. 'సామ్రాట్అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
- ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబందించినప్రస్తావన ఉండటం వలన ఆయన మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదేసంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కధా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు.
- చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరిమనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 9 న స్వర్గస్తులయ్యారు.
- తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు
- సినీ రచయిత
- ముద్దుల మొగుడు (1983) (writer)
- ఎస్.పి.భయంకర్ (1983) (dialogue)
- గుప్పెడు మనసు (1979) (dialogue)
- జీవన తరంగాలు (1973) (screenplay and dialogue)
- కన్నెమనసులు (1966) (screen adaptation)
- డాక్టర్ చక్రవర్తి (1964) (dialogue and screen adaptation)
- మురళీకృష్ణ (1964) (dialogue)
- వెలుగు నీడలు (1964) (writer)
- మూగ మనసులు (1963) (writer)
- వాగ్దానం (1961) (screenplay and dialogue)
- పెళ్ళి కానుక (1960) (dialogue)
- శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) adaptation) (dialogue)
- జయభేరి (1959) (story and dialogue)
- మాంగల్య బలం (1958) dialogue)
- తోడి కోడళ్ళు (1957) (adaptation) (dialogue)
- అర్ధాంగిగుమస్తా (1953/II) (dialogue) (story)
- కన్నతల్లి (1953) (writer)
- వాగ్దానం (1961)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog