మల్లిక , Mallika

పరిచయం (Introduction) :
  • తన మాటల్లో ->నా పేరు మల్లిక. ముద్దుగా ఆర్కెస్ట్రా మల్లిక అంటారు. మాది గుంటూరు జిల్లా తెనాలి. నేనున్న చోట పాట ఉంటుంది. చదువుకొనే రోజులనుంచే పాటలతో దోస్తీ కట్టాను. ఇంటిపనిలో.. వంట పనిలో.. మార్కెట్‌కెళ్లినా, ప్రయాణం చేస్తున్నా.. సందర్భానుసారంగా పాటలు పాడుతూనే ఉంటాను. మా అమ్మ స్వరాభిమాని. పాటల్లో కాస్త తడబడితే మాత్రం.. 'ఏంటే అది.. తప్పుగా పాడుతున్నావ్‌. ఇలా కదా పాడాలి' అంటూ తప్పులు సరిచేస్తుంటుంది. పోటీల్లో పాల్గొని బహుమతులూ గెల్చుకున్నా. అనుకోకుండా మా నాన్న చనిపోయారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖనం నేర్పే ఉపాధ్యాయుడు. తర్వాత ఆ ఉద్యోగం నాకిచ్చారు. అమ్మ, తమ్ముడు.. ఇద్దరి బాధ్యత నాదైంది. అమ్మకి అనారోగ్యం. అలా ఉద్యోగం చేస్తూనే ఆర్కెస్ట్రాలో చేరాను. ఇప్పటికి వివిధ బృందాలతో రెండువేలకి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అలా పాట నా జీవితానికి అండగా నిలిచింది. 'పాడుతా తీయగా'కు వచ్చేలా చేసింది. కానీ ఆర్కెస్ట్రా వేరు, పోటీ వేరు. పైగా సంగీతంలో అనుభవం లేదు. అలా కొన్ని తప్పులు కూడా చేశాను. బాలుగారు నా తప్పొప్పులు సమీక్షించేవారు. అలా నా లోపాల్ని సరిచేసుకుంటూ గంటల తరబడి సాధన చేశా. ఫైనల్‌దాకా వచ్చా. విజేతనవుతానని ఆశపడుతున్నా.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : మల్లిక ,
  • ముద్దు పేరు : ఆర్కెస్టా మల్లిక ,
  • ఊరు : తెనాలి ... గుంటూరు జిల్లా ,
  • నాన్న : చనిపోయారు ... డ్రాయిం గ్ టీచర్ ,
  • చదువు : నాన్న ఉద్యోగము చేస్తున్నారు .
  • తోబుట్టువు : ఒక తమ్ముడు .
నటించిన సినిమాలు (filmography ):
  • సినిమా పాటలు లేవు
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)