====================== పరిచయం : పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకు రచయితగా, సినిమా నటుడిగా, టీవీ సీరియళ్ళలో నటుడిగా పనిచేసాడు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసాడు. టీవీ సీరియళ్ళ రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు. ప్రొఫైల్ : పేరు : ఓంకార్ పరిటాల , పుట్టిన ఊరు : పెనమలూరు - విజయవాడ దగ్గర . ఓంకార్ Sunday , Jan 07, 2007 న ' కార్డియాక్ అరెస్ట్ ' తో చనిపోయారు . నటించిన కొన్ని సినిమాలు : పోలీసుభార్య , పవిత్ర భందం టెలి సీరియల్ , పందిరిమంచం స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటారు .