శ్రీశ్రీ , SriSri

పరిచయం :
  • ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...శ్రీరంగం శ్రీనివాసరావు.
  • ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీవిస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు: "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితనుఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీశిఖరాగ్రాన నిలిపింది". మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.
  • అభ్యుదయ కవితాప్రవక్తగా లబ్ద ప్రతిష్టులైన శ్రీశ్రీ ‘ఆహుతి’ అనువాద చిత్రంతో చిత్రసీమకు పరిచయమై ‘నిర్దోషి (1951)’తో నిలదొక్కుకున్నారు. అభ్యుదయ విప్లవ గీతాలతో పాటు తెలుగు సినిమాల్లో ఎక్కువ దేశభక్తి గేయాలను రాసిన ఘనతను కూడా దక్కించుకున్నారు. ప్రబోధ గీతాలను, ప్రణయ గీతాలను, వీణ పాటల్ని కూడా రాశారు. ‘అల్లూరి సీతారామరాజు (1973)’ చిత్రంలోని ‘తెలుగువీర లేవరా’ పాటకు జాతీయ పురస్కారం అందుకుని, ఆ గౌరవం పొందిన మొదటి తెలుగు సినీకవి అయ్యారు. ‘మహాప్రస్థానం’లోని ఖండికలెన్నో సినిమా పాటలుగా అవతరించాయి. శబ్ద శక్తి, పదలయ శ్రీశ్రీ ప్రధానాస్ర్తాలు. ఆయన ఎర్ర పాటల వెలుగు ఇతర కవుల మీదా ప్రసరించింది. మాంగల్య బలం, జయభేరి, ఆరాధన, డా.చక్రవర్తి, మనుషులు మారాలి మొదలైన చిత్రాల్లో 400 పాటల్ని (అనువాద గీతాలు మినహాయింపుగా) రాశారు.
జీవిత గమనం
  • పేరు : శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు
  • పుట్టిన తేది :- 30 April 1910 ,
  • మరణము : 1983 జూన్ 15
  • పుట్టిన ఊరు : విశాఖపట్నం
  • తండ్రి : పూడిపెద్ది వెంకటరమణయ్య,
  • తల్లి : అప్పలకొండ.
  • ఇంటి పేరు మార్పు : శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది.
  • చదువు : ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. 1931 లో మద్రాసు విశ్వవిద్యాలయం లో బియ్యే (జువాలజీ)పూర్తి చేసాడు.
  • భార్య : వెంకట రమణమ్మతో పెళ్ళి 1925 లో జరిగింది.
ఉద్యోగం:
  • 1935 లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోనువివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించురష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.
పిల్లలు :
  • 1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలుచేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తతతీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒకకుమారుడు కలిగారు.
ఉద్యమాలు :
  • 1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒకప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేకతెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్నివినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శననుకొనసాగించాడు.
సినిమా పాటల రచనలు :
  • ఆహుతి (౧౯౫౦)డబ్బింగ్ సినిమా కి డైలాగ్ లు వ్రాసారు .,
  • రణభేరి (౧౯౬౮) "మరో ప్రపంచం " అనే పాట వ్రాసారు ,
  • అల్లూరి సీతారామరాజు (౧౯౭౪) తెలుగు వీర లేవరా ... అనే పాట ,
అవార్డ్స్ :
  • వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటిరాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవరచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
మరణము :
  • కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
  • విశాఖపట్నం లోని బీచి రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani