రాజశ్రీ (సినీ రచయిత) , Rajashri

పరిచయం :
  • రాజశ్రీ (ఇందుకూరి రామకృష్ణంరాజు) ప్రముఖ సినీ రచయిత.
  • ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాసాడు. బి.యస్సీఫిజిక్సు చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏగా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్ ని కలిసిఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది నచ్చడంతో తేడివందమాప్పిళ్ళ పేరుతో సినిమా తీసారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాతదాదాపు 60 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేసారు. అంతేకాకుండా ఎంకన్న బాబు, మామా కోడలు, పెళ్ళిచేసి చూపిస్తాం మరియు పుదియ సంగమం అనే తమిళ చిత్రానికిసంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారం, నిజం నిద్రపోదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నంతెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాసారు. మట్టిలో మాణిక్యం, బంగారుగాజులు చిత్రాలకు బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు. రాజశ్రీ రచన చేసిన చివరి చిత్రం ప్రేమికుడు. 1994లోనిదురలోనే మరణించాడు. అతని కొడుకు రాజశ్రీ సుధాకర్ కొన్ని ఆంగ్ల అనువాద చిత్రాలకు మాటలు రాసాడు.
‌ ప్రొఫైల్ :
  • పేరు : ఇందుకూరి రామకృష్ణంరాజు.
  • స్క్రీన్ నేమ్ : రాజశ్రీ , కవి
  • పుట్టిన తేది : 1934 ఆగష్టు 31.
  • పుట్టిన ఊరు : విజయనగరం .
  • తండ్రి : గవర అప్పల రాజు ,
  • తల్లి : నారాయణమ్మ
  • పిల్లలు : నలుగురు కొడుకులు : రెన్దెవ వారు - రాజశ్రీ సుదాకర్ , ఒక కూతురు .
  • చదువు : బి.యస్.సి - ఫిజిక్స్ ,
  • మరణము : 1994 లో నిద్ర లోనే మరణించారు .
చిత్రాలు పాటల రచయిత గా :
  • ప్రేమ పావురాలు (అనువాదం - హిందీ)
  • ప్రేమికుడు (అనువాదం - తమిళం)
  • జంటిల్ మేన్ (అనువాదం - తమిళం)
  • మైఖేల్ మదనకామరాజు (అనువాదం - తమిళం)
  • విచిత్ర సోదరులు (అనువాదం - తమిళం)
  • ఘర్షణ (పాతది) (అనువాదం - తమిళం) * ఖైదీ-
  • దేవుడమ్మ * స్వయంవరం
  • మట్టిలో మాణిక్యం * సత్తెకాలపు సత్తయ్య
  • సంబరాల రాంబాబు
  • పరువు ప్రతిష్ట
అసిస్టెంట్ director గా
  • ఆడ పెత్తనం ,
  • అన్నా తమ్ముడు ,
  • వీరభాస్కరుడు ,
  • శ్రీ క్రిషన్ మాయ ,
కొన్ని ఆణిముత్యాలు
  • కురిసింది వాన నా గుండెలోన... - మట్టిలోమాణిక్యం
  • యమునాతీరాన రాధ మదిలోన...
  • మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... - మట్టిలోమాణిక్యం-
  • నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి... సత్తెకాలపు సత్తయ్య
  • మామా చందమామ విన రావా... సంబరాల రాంబాబు
  • ఎక్కడో దూరాన కూర్చున్నావు... దేవుడమ్మ
  • నిన్ను తలచి మైమరచా... - విచిత్ర సూదరులు
(మూలము : వికీపీడియా .. కొత్త ఫోటో తన కుమారుడు రాజశ్రీ సుధాకర్ పంపించారు )

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)