Ramakrushna .V-రామకృష్ణ .వి - (tollywood singer)







పరిచయం (Introduction) :

  • వి.రామకృష్ణ(విస్సంరాజు రామకృష్ణ)  1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు.ముఖ్యంగా భక్తి ప్రధానంగా పాటలు చెప్పుకోదగ్గవి. 1972లో 'విచిత్రబంధం సినిమాతో గాయకుడిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 


ఆయన ఆలపించిన భక్తిగీతాల ఆల్బమ్‌ ఎంతో ఆదరణ పొందాయి. ప్రముఖ గాయని పి.సుశీలకు రామకృష్ణ దగ్గర బంధువు(మేనత్త ). ఆయన కుమారుడు సాయికిరణ్‌ 'నువ్వేకావాలి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.


  • ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్‌ విశ్వనాథన్‌ మరణించిన రెండు రోజులకే రామకృష్ణ మృతి చెందడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : వి.రామకృష్ణ
  • జననం --ఆగష్టు 20, 1947
  • జన్మ స్థలము : విజయనగరం
  • మరణం -- కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన 2015, జూలై 16 న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

  • ప్రసిద్ధి : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు.
  • పిల్లలు : ఒక కుమారుడు సాయికిరణ్ (నువ్వేకావాలి సినిమా ద్వారా  వెండి తెరకు పరిచయమయ్యారు)- ఒక కుమార్తె.


సినిమాలు


  •     విచిత్రబంధం (1972) : వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట
  •     అందాల రాముడు (1973)
  •     తాత మనవడు (1973) : అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
  •     పల్లెటూరి బావ (1973)
  •     శారద (1973) : శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ
  •     అల్లూరి సీతారామరాజు (1974) : తెలుగువీర లేవరా (ఘంటసాలతో)
  •     గుణవంతుడు (1975)
  •     ముత్యాల ముగ్గు (1975) : ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు
  •     భక్త కన్నప్ప (1976)
  •     మహాకవి క్షేత్రయ్య (1976)
  •     సీతా కళ్యాణం (1976)
  •     చక్రధారి (1977)
  •     అమరదీపం (1977) : నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది
  •     దాన వీర శూర కర్ణ (1977)
  •     శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
  •     శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
  •     బావా మరదళ్ల సవాల్ (1988)



Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala