చౌదరి యం వి(నిర్మాత) , Chowdary M V(producer)
పరిచయం : నగరం చిత్ర నిర్మాత శ్రిమిత్ర హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఈ చౌదరి యం.వి. సినిమా అన్నది ఒక తీరని దాహం , ఎంత తాగినా ఇంకా తాగాలనీ ఉంటుంది .ఈ రంగం లోకి ప్రవేశించేక అది నటన కావచ్చు , దర్సకత్వం కావచ్చు , చిత్రనిర్మాణం కావచ్చు , శాఖ ఏదైనా ఈ రంగం పట్ల ఉండే క్రేజు , మోజు మాత్రం నిత్య నూతనం గా అనిపిస్తాయి .అయితే ఈ రంగం లో అతి తక్కువ కాలం ల విరక్తి చెంది , విసుగొచ్చి , విరమించుకోవాలి అనే బలాత్కార స్థితికి చేరుకొనే తొలివక్తి మాత్రం " నిర్మాత " ఒక్కడే .అందుకే నటీ నటులు , సాంకేతిక నిపుణులు దశాబ్దాల పాటు వెలిగిపోతుంటారు కానీనిర్మాతలు మాత్ర మం వందల సంఖ్యలో ఇలా వచ్చి అలా వెళ్లి పోతుంటారు . ప్రొఫైల్ : పేరు : మేడికొండురి వెంకట చౌదరి , ఊరు : అచ్చయ్య పాలెం - రుబెనగుంట్ల (మండలం) నరసరావు పేట తాలూకా . పుట్టిన తేది : 10 జూన్ 1965 , నాన్న : కృష్ణ మూర్తి , అమ్మ : గోవిందమ్మ , అన్నయ్య : కోటేశ్వరరావు , తమ్ముడు : అంజిబాబు , బాబాయ్: రామనాధ కోటేశ్వరావు , చదువు :బి.ఎ. భార్య : వెంకతిరమని (21,మే 1986 లో పెల్లైనది), పిల్లలు : పెద్దకొడుకు - తెజనివాస్ (31,డిసెంబ...