గిరిజ (పాత) , Girija(Old)
పరిచయం : పాత తరం తెలుగు సినిమా హాస్య నటి. రేలంగి తో జత గా ఎన్నో పాత్రలు వేసింది. సినిమాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. మొదట్లో ఎవరు ఎలాంటి పాత్రలు ధరించినా, ఒక దశకు వచ్చేసరికి, ఎక్కడో స్థిరపడతారు. హీరోగా పరిచయమైన సత్యనారాయణ, విలన్‌గా స్థిరపడినట్టు, హాస్యపాత్రల్లో వచ్చిన వాణిశ్రీ నాయికగా స్థిరపడినట్టు, హీరోగా ప్రవేశించిన కృష్ణంరాజు విలన్‌గానూ తర్వాత మళ్లీ హీరోగానూ వచ్చినట్టు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. గిరిజ నాయికగా వచ్చినా హాస్యనటిగా మారింది. 'రేలంగి-గిరిజ జంట'కి ఎంతో పేరు. 'పరమానందయ్య శిష్యులు' కొంతకాలం నడిచినా, గిరిజకు గుర్తింపు రాలేదు. ప్రొఫైల్ : పేరు : గిరిజ , పుట్టిన తేదీ : జూన్-1937, తల్లి పేరు : దాసరి తిలకం (నాటకాలలో నటించేవారు ), చదువు : 5 వ తరగతి ...?, మొదటి సినిమా : పరమానందయ్య శిస్యులకద -1950, ఆకరి జీవితము : తొలిరోజుల్లో ఎలా ఉన్నా, రాను రాను గిరిజ సంపన్నురాలైంది. తేనాంపేటలో ఆమెకు రెండతస్తుల భవనం, కారూ ఉండేవి. దర్జాగా, తిరుగుతూ అందర్నీ పలకరించేది. పైగదిలో రెండు ఎ.సి. రూములు కనిపిస్త...