సింగీతం శ్రీనివాసరావు ,Singeetam Srinivasa rao
---------------------------------------------------- పరిచయం : సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కధాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు కధ వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా. జీవిత విశేషాలు పుట్టిన తేది : సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21. జన్మస్థలం .: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి : ఒక హెడ్మాస్టరు. తల్లి : వయొలిన్ వాయిద్య నిపుణురాలు. చదువు : చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాద ఛటోపాధ్యాయ పర్వేక్షణలోనాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. కెరీర్ : స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు...