ఇ.వి.వి.సత్యనారాయణ,SatyanarayanaEVV
పరిచయం : ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు . తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలునిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కధానాయకుడిగానిర్మింపబడిన "చెవిలో పువ్వు" . ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాతరామానాయుడు 'ప్రేమఖైదీ' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు', 'ఆలీబాబా అరడజనుదొంగలు' వంటి చిత్రాలు మరియునరేష్ తో 'జంబలకిడి పంబ' మొడలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్బాబు), లాంటి చిత్రాలతర్వాత , ఆమె, తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశారు. .కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు. ప్రొఫైల్ : పేరు : ఈదర వీర వెంకట సత్యనారాయ...