తాపీ ధర్మారావు , DharmaraoTapi
===================================================== పరిచయం : తాపీ ధర్మారావు తెలుగు రచయిత , తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. 1910 ప్రాంతంలోకొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. వీరి తొలి రచన 1911లో 'ఆంధ్రులకొకమనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో వీరి నేర్పు అనన్య సామాన్యమైనది. 'కొండెగాడు', 'సమదర్శిని', 'జనవాణి', 'కాగడా' మొదలైన పత్రికలు వీరి ప్రతిభకు . ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. నిదర్శనాలు. ప్రొఫైల్ : పేరు : తాపి ధర్మారావు పుట్టినతేది : 1887 సంవత్సరంలో సెప్టెంబరు 19న , పుట్టిన ఊరు : ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూర్ లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. చదువు : ఈయన ప్రాధమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకుచదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్తఅయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం. ఉద్యోగం : కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా...