రామోజీరావు , Ramojirao
పరిచయం : పట్టిందల్లా బంగారమే ఆన్న నానుడిని అక్షరరాలా నిజం చేసే అత్యంత అరుదైన వ్యక్తుల లో అగ్రగణ్యులు " రామోజీరావు . చెరుకూరి రామోజీరావు -- భారతీయ వ్యాపారవేత్త, సినీ నిర్మాత . ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు ప్రధాన సంపాదకుడు. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి , డాల్ఫిన్ గ్రూఫ్ హోటల్స్ అధినేత .. మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నది. ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగరానికి 25 కిలోమీటర్ల దూరములో హైదరాబాదు - విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద ఉన్నది. ప్రొఫైల్ : పేరు : చెరుకూరి రామోజీరావు పుట్టిన తేది : నవంబర్ 16, 1936 పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా, గుడివాడలో(పెదపరుపూడి .. విలేజ్) ఒక రైతు కుటుంబములో జన్మించాడు. నివాస,ము : హైదరాబాద్ . భార్య : ఉషా(రమాదేవి) . పిల్లలు : కిరణ్(భార్య: శైలజ ) , సుమన్(భార్య : విజయేశ్వరి) , మతము : హిందూ - కమ్మ , రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్తలు : మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార...