డి.యల్.నారాయణ , D.L.Narayana(producer)
courtesy : Pathabangaram by Raavi Kondalrao. పరిచయం (Introduction) : నిర్మాత డి.ఎల్.నారాయణగారు - సాహసం చేసి మూడు 'క్లాసిక్స్'ని ధైర్యంగా నిర్మించారు. ఫలితాలు ఆశించారా లేదా తెలీదు. నిరుత్సాహాలు ఎదురైనా సాహసించారు. ఆ మూడూ 'దేవదాసు', గురజాడవారి 'కన్యాశుల్కం', విశ్వనాథవారి 'ఏకవీర'. అవే పేర్లతో ఆ చిత్రాలు 'దేవదాసు' (1953), 'కన్యాశుల్కం' (1955), 'ఏకవీర' (1969)లను నిర్మించారు డి.ఎల్. వీటిలో 'దేవదాసు' అనూహ్యమైన విజయం సాధించింది. క్లాసూ, మాసూ తేడా లేకుండా ప్రేక్షకాదరణ పొందింది. ఇన్నేళ్లయినా ఇంకా ఆ చిత్రానికి అదే ఆదరణ లభ్యమవుతోంది. శరత్‌బాబు నవలలోని మూల కథను కాస్త మార్చినా, అది విమర్శలకు నిలబడలేదు గాని, 'కన్యాశుల్కం'లో చేసిన మార్పులు సాహితీవేత్తల చేత ఆక్షేపణలకు గురయ్యాయి. జనరంజకం కోసం, 'విలన్' లాంటి గిరీశాన్ని 'హీరో'ని చెయ్యడం, సుఖాంతం చెయ్యడం లాంటి పెనుమార్పులు చేసినా ఆ సినిమా ఆర్థికంగా లాభం సంపాదించలేదు. 'ఏకవీర'కు కీర్తి దక్కిందిగాని, కాసు దక్కలేదు. మంచి సాహిత్యం, సంగీతాలతో ఉన్న మంచి సినిమాగ...