నూతన్ ప్రసాద్,NuthanPrasad
పరిచయం : నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్ . 1970 వ మరియు 80 వ దశకములో తెలుగు సినిమా రంగములో అలరారిన హాస్య నటుడు . సుమారు 350 - 400 సినిమాలు చేసారు. సినీ రంగ ప్రవేశం : 1973 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో ఈయన చిత్రరంగ ప్రవేశము చేశాడు . ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన సిమాలలో నటించినా , ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది . ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక సినిమాలలో విలన్ పాత్రలు వచ్చాయి . అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు . ఈయన యొక్క విభిన్న డైలాగు డెలివరీ విలనిజానికి ఒక హాస్యవన్నె తెచ్చింది . ఈయన అనేక సినిమాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , ఘట్టమనేని కృష్ణ , చిరంజీవి సరసన కమెడియన్ , విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు . ఒక సినిమాలో కథానాయకునిగా కూడా నటించాడు . నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన రాజాధిరాజు ...