Saturday, January 21, 2012

విజయేంద్రప్రసాద్ -Vijayendraprasad

పరిచయం (Introduction) :
  • సింహాద్రి', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'మగధీర', ఇప్పుడు 'రాజన్న'... ఇలాంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు కథను సమకూర్చింది ఆయనే. కొడుకు రాజమౌళితో కలసి ఎన్నో అద్భుతాలను సృష్టించారు .విజయేంద్రప్రసాద్‌.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : విహయేంద్ర ప్రసాద్ ,
  • ఊరు : కొవ్వూరు-- పశ్చిమ గోదావరి జిల్లా,
  • నాన్న : క్లాస్ వన్‌ కాంట్రాక్టర్ ,
  • తోబుట్టువులు : మొత్తం అరుగురు అన్నదమ్ములు , ఒక చెల్లి ,
  • చదువు : కాలేజీ చదువు లు ,
  • వృత్తి : సినిమా కధలు రాయడము ,
  • కొడుకు : రాజమౌళి ,
నటించిన సినిమాలు (filmography ):
  • జానకి రాముడు -- కధ తన అన్నయ్య ' శివదత్త ' తో కల్సి రాసారు ,
  • బంగారు కుటుంబము ,
  • బంగారు కుటుంబము ,
  • బొబ్బిలి సింహము ,
  • ఘరానా బుల్లోడు ,
  • అర్ధాంగి ,
  • సమరసింహారెడ్డి ,
====================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Saturday, January 14, 2012

Usha Uthup(singer)-ఉషా ఉతుప్‌

  • image : courtesy with Eenadu cinema news paper.
పరిచయం (Introduction) :
  • రెండే రెండు పాటలు పాడి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ పాప్ సింగరు ఈమె.
  • సంగీతప్రియులకు ఉషా ఉతుప్‌ పాటలు పరిచయమే. 'డిస్కోడ్యాన్సర్‌', 'షాలిమార్‌', 'షాన్‌' లాంటి హిందీ చిత్రాల్లో ఆమె ఆలపించిన గీతాలు నాటి యువతను ఆకట్టుకొన్నాయి. 'కీచురాళ్లు..' అంటూ ఆమె తెలుగులో ఓ గీతాన్ని ఆలపించారు. ఇరవయ్యేళ్ల తరవాత ఉష ఓ పాటను తెలుగు చిత్రం కోసం గానం చేశారు. 'కులుమనాలి' చిత్రం కోసం 'మంచుకొండల జాబిలి... మనువు నడిచిన ఈ వ్యాలీ' అనే పాటను ఆలపించారు. శ్రీవసంత స్వరాలు సమకూర్చారు. నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ''ఉషా ఉతుప్‌ పాడిన పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో పాటల్ని, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ఉషా ఉతుప్‌,
  • పుట్టిన తేదీ : 08-నవంబర్ -1947,
  • ఊు : ముంబై ,
  • మతము : ముంబై లో పుట్టిన తమిళ బ్రాహ్మిన్‌ .
  • తండ్రి : పోలీసు ఆఫీషరు ,
  • తోబుట్టువులు : ముగ్గురు సోదరీలు --Uma Pocha, Indira Srinivasan and Maya Sami, all of whom are singers and two brothers(ఇద్దరు సోదరులు),
  • భర్త : జానీ ఉతుఫ్ (కొట్టయాం , కేరళ )
నటించిన సినిమాలు (filmography ): కొన్ని హిందీ సినిమాలు --
  • Kaafiron Ki Namaaz 2012
  • Don 2 2011
  • 7 Khoon Maaf 2011
  • Hattrick 2007
  • Bow barracks Forever 2007
  • Jogger's Park 2003
  • Bhoot 2003
  • Kabhi Khushi Kabhie Gham... 2001
  • Shalimar 1978
  • ==================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Chalam.B(cinima art driector)-చలం.బి(కళా దర్శకుడు)

  • image : courtesy with Eenadu cinema paper.
పరిచయం (Introduction) :
  • ఏ పనిలో విజయం సాధించాలన్నా - తపన, కృషి అవసరం అని పెద్దల మాట. ఈ మాటను ప్రపంచంలో ఎందరో రుజువు చేశారు. సినిమా ప్రపంచంలోనూ చేశారు. సినిమా దర్శకత్వ శాఖలో కేవలం అప్రెంటిస్‌గా చేరి- గొప్ప దర్శకులయి పేరు తెచ్చుకున్నవాళ్లు కొందరైతే, మొదట్లో ఎడిటింగ్‌ ఫిల్ము డబ్బాలను మోసి తిరిగినవాళ్లు- ప్రసిద్ధ ఎడిటర్లయిన వాళ్లు కొందరు. అలాగే ఛాయాగ్రాహకులు, ఇతర టెక్నీషియన్లూ..! కళా దర్శకుల విభాగాన్ని పరిశీలిస్తే - స్టూడియోలో బ్యాగ్రౌండ్‌ పెయింటింగ్‌ శాఖలో సహాయకుడిగా చేరి తరవాత తరవాత ఎదిగిన వారు... బి.చలం. కళా దర్శకుడిగా తన శైలిని వెండి తెరపై చూపించారాయన.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : బి.చలం -- కళా దర్శకుడు ,
  • పుట్తిన తేదీ : 1933 లో,
  • జన్మస్థలము : పర్లాకిమిడి (ప్రస్తుతము ఒరిస్సా రాస్ట్రము ),
  • చదువు : 10 వ తరగతి ,
కెరీర్ :
  • బొమ్మలు గీయడం అంటే మహా ఉత్సాహం. అనేక మంది చిత్రకారులు వేసిన చిత్రాలను పరిశీలిస్తూ తానూ చిత్రాలు వేశారు. స్కూలు చదువు తరవాత ఏం చెయ్యాలి? సినిమాలు చూసి, సినిమాలు మీద ఉత్సాహం పెంచుకుని- శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. అప్పుడు వాహిని స్టూడియో నిర్మాణంలో ఉంది. అది 1948వ సంవత్సరం. చలంగారు తను గీసిన చిత్రాలు చూపించి, పెయింటింగ్‌ శాఖ అధిపతుల్ని, తక్కినవాళ్లనీ కలిసి స్టూడియోలో ఉద్యోగం సంపాదించుకున్నారు. అవసరం వచ్చినప్పుడు రాత్రింబవళ్లు పనిచేసి, పెయింటింగ్‌ శాఖలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ప్రసిద్ధ కళాదర్శకుడు ఎమ్‌.కె.శేఖర్‌గారి మెప్పుపొంది, ఆయన దగ్గర సహాయకూడిగా చేరారు. ఆ సినిమా వాహినివారి 'పెద్దమనుషులు'. చలంగారి పనితనం, చురుకుదనం, ఆలోచన చూసి శేఖర్‌గారు తనదగ్గరే పెట్టుకుని పని నేర్పుతూ ప్రోత్సహించారు. 'బంగారు పాప' చిత్రానికి ముఖ్య సహాయకుడైనారు. మూడేళ్లకు పైగా పెయింటింగ్‌ శాఖ, మరికొన్నేళ్లు కళాదర్శకత్వ శాఖల్లో పనిచేసి, శేఖర్‌గారి ప్రోత్సాహంతో కళాదర్శకుడి స్థానం పొందారాయన. ఆ చిత్రం ప్రతిభా వారి 'ఏది నిజం?'. యస్‌.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రానికి రాష్ట్రపతి బహుమతి లభించింది. నిదానంగా చలంగారికి అవకాశాలు రాశాగాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాలకూ ఆయన కళాదర్శకుడిగా పనిచేశారు. దాదాపు 800 చిత్రాలో ఆయన తన కళా నైపుణ్యాన్ని చూపించారు.
నటించిన సినిమాలు (filmography ): తెలుగు --- లో కొన్ని ..
  • బంగారు పాప ,
  • ఏది నిజం ,
  • జగదేకవీరుడు అతిలోకసుందరి ,
  • ఆపద్బాంధవుడు ,
  • బృందావనం ,
  • భైరవ ద్వీపం ,
  • శ్రీకృష్ణార్జున విజయం ,
Hindi : కొన్ని
  • Jung (1996)Art DirectorBuy,
  • Gair Kaanooni (1989)Art DirectorBuy,
  • Wafadaar (1985)Art DirectorBuy,
  • Gangvaa (1984)Art DirectorBuy,
  • 1999 Devi ,
  • 1993 Prateeksha (as B. Challam) ,
  • 1986/II Mr. Bharath,
  • 1983 Jeet Hamaari,
  • 1983 Paayum Puli
అవార్డులు :
  • ఏవియమ్‌ స్టూడియో తీసిన 25 చిత్రాలకు ఆయన కళాదర్శకత్వం వహించారు. 1963లో కాంగ్రెస్‌ మహాసభలు జరిగాయి. ఆ సభలకు వేదికల్ని తీర్చిదిద్దారు. ఆ ఆకర్షణీయమైన ఆ సభా ప్రాంగణానికి మురిసిపోయిన పెద్దలు 'ఇందిరాగాంధి అవార్డ్‌'తో చలం గారిని సత్కరించారు. దక్షిణ భారత చలనచిత్ర కళా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా మూడుసార్లు ఎన్నికయ్యారు ఆయన.
మూలము : రావి కొండలరావు గారి పాతబంగారం ... సౌజన్యము తో
  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Monday, December 19, 2011

Shekhar chandra-శేఖర్‌ చంద్ర

పరిచయం (Introduction) :
  • Shekhar chandra-శేఖర్‌ చంద్ర సంగీత దర్శకుడు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : శేఖర్‌ చంద్ర,
  • ముద్దుగా : చందూ,
  • పుట్టినరోజు : ఏప్రిల్‌ 4,
  • చదువు : బీసీఏ,
  • సరిగమలు నేర్చుకున్నది : చెన్నైలో గోపాలకృష్ణ మాస్టారి దగ్గర కర్నాటక సంగీతం, అబ్దుల్‌ సత్తార్‌ గారి దగ్గర పియానో నేర్చుకున్నారు,
  • సినీరంగ ప్రవేశం : 'జ్ఞాపకం' అనే సినిమాతో,
  • తొలి గుర్తింపు : సంగీత దర్శకునిగా 'అనసూయ',
  • తొలి పారితోషికం : రూ.5 లక్షలు. 'అనసూయ' సినిమాకే అందుకున్నా. ఆ డబ్బుతో నాకు కావలసిన సంగీత పరికరాలన్నీ కొనుక్కున్నారట,
  • పేరు తెచ్చినవి : నచ్చావులే, నువ్విలా,
  • పాటంటే : మాటల హద్దులు దాటి మరింత మధురంగా వినిపించేది,
  • అభిమాన సంగీత దర్శకులు : ఎ.ఆర్‌.రహమాన్‌, ఇళయరాజా,
  • నచ్చే పాటలు : రోజా, బొంబాయి, సఖి గీతాలు ఎప్పటికీ ఇష్టమే,
  • ఇష్టమైన గాయకులు : శ్రేయా ఘోషాల్‌, లక్కీఅలీ, కె.కె.,
  • ఖాళీ సమయాల్లో : సినిమాలు చూస్తుంటా. లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తుంటా,
  • నచ్చే సినిమాలు : కోల్డ్‌ మౌంటెయిన్‌, ఆగస్ట్‌ రష్‌,
  • మర్చిపోలేని వ్యక్తి : దర్శకుడు రవిబాబు. ఆయన వల్లే నాకు తొలి గుర్తింపు వచ్చింది,
  • బలం-బలహీనత : స్నేహితులే నా బలం. మొహమాటం కాస్త ఎక్కువ. అదే బలహీనత,
  • లక్ష్యం : వచ్చిన పేరు నిలబెట్టుకోవడం,
నటించిన సినిమాలు (filmography ):
  • జ్ఞాపకం'
  • నచ్చావులే,
  • నువ్విలా
  • source : Eenadu sunday magazine 18/12/2011 ... composed/Anavar.
  • ============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Sunday, December 18, 2011

చరణ్ రాజ్ - Charan Raj

  • image : courtesy with Eenadu sunday magazine
పరిచయం (Introduction) :
  • చరణ్ రాజ్ దక్షిణ భారతీయ సినిమా నటుడు. ఇతడు ఇంతవరకు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో సుమారు 400 సినిమాలలో నటించాడు. ప్రతిఘటన ద్వారా విలన్‌గా గుర్తింపుపొందిన చరణ్‌రాజ్‌ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి తమిళనాడులో నిర్మాతగా, దర్శకుడిగా మారారు. తాజాగా ఆయన తెలుగులోనూ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ... ' గత మూడురోజులుగా ఓ టీవీ ఛానల్‌లో ప్రసారవుతున్న నాగరాజుఅనే వ్యక్తి పాట నచ్చి ఆయన చెప్పిన కథ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ప్రేమ అనేది వర్ణించలేనిది. ప్రేమించలేదని యువతులను బలిచేయడం అసలైన ప్రేమకాదు. అసలు ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రంద్వారా చెబుతున్నాం. . . అంటున్నారు .
  • అతడు విలనీ చేస్తే... హీరోకే కాదు ప్రేక్షకులకు కూడా కొట్టాలి అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఓ క్రూరమైన విలన్‌గా పరిచయమైన చరణ్‌రాజ్‌ చాలా సున్నిత మనస్కుడనీ అభిరుచిగల నిర్మాత అనీ ఆసక్తిగల దర్శకుడనీ మంచి గాయకుడనీ చాలా కొద్దిమందికి తెలుసు. 'ఇన్ని చేస్తున్నా నటన అంటేనే నాకు చాలా ఇష్టం' అంటున్నారు చరణ్‌రాజ్‌. పరాజిత'... చిత్రం ద్వారానే హీరోగా పరిచయమయ్యారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : చరణ్ రాజ్ ,
  • జన్మనామము : బ్రహ్మానంద ,
  • ఇతర పేర్లు : బ్రమ్మూ,
  • భార్య : కల్పన ,
  • పిల్లలు : 1 అమ్మాయి, 2-అబ్బయిలు ,
  • స్నేహితుడు : గురురాజ్ భట్ -- సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలని బుర్రలో పెట్ట్టి న వాడు ,
  • సొంత ఊరు : బెల్గాం ,
(filmography ):నటించిన సినిమాలు కొన్ని :
  • 1. పరాజిత (కన్నడ)
  • 2. ప్రతిఘటన (1986) - కాళీ
  • 3. ప్రతిఘాట్ (హిందీ, 1987) - కాళీ ప్రసాద్
  • 4. అమెరికా అబ్బాయి (1987)
  • 5. అరణ్యకాండ (1987)
  • 6. దొంగమొగుడు (1987)
  • 7. స్వయంకృషి (1987) - గోవింద్
  • 8. ఇంద్రుడు చంద్రుడు (1989) - మేయర్ సెక్రటరీ
  • 9. పనక్కరన్ (తమిళం, 1990)
  • 10. కర్తవ్యం (1991) - కాశీపతి
  • 11. సూర్య ఐ.పి.ఎస్ (1991)
  • 12. ఆశయం (1993)
  • 13. గాయం (1993) - దుర్గాప్రసాద్ బ్రదర్
  • 14. జెంటిల్ మాన్ (1993) - పోలీస్ ఆఫీసర్
  • 15. పోలీస్ బ్రదర్స్ (1994)
  • 16. హలో బ్రదర్ (1994)
  • 17. యువరత్న రాణా (1998)
  • 18. యదార్థ ప్రేమ కథ - దర్శకుడు
  • 19. అడవి చుక్క (2000) - అర్జున్
  • 20. అమ్మా నాగమ్మ (2001) - డాక్టర్ అమర్
  • 21. అతడు (2005) - పోలీస్ ఆఫీసర్
  • 22. నా అల్లుడు (2005)
  • 23. అసాధ్యుడు (2006)
  • 24. పిచ్చోడి చేతిలో రాయి (2009) - చక్రధరరావు
  • 25. అమ్మదొంగా (2008)
  • 26. అడవిచుక్క (2008)
  • 27. కుద్రత్ కా కానూన్ (హిందీ, 1987) - ఎమ్.పి. చరణ్ దాస్
  • 28. ఏం పిల్లో ఏం పిల్లడో (2010)
  • 29. కొమరం పులి (2010)
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Saturday, December 17, 2011

Viswa - విశ్వ (గీతరచయిత)

  • image : courtesy with Eenadu sunday 11/Dec /2011
పరిచయం (Introduction) :
  • అత్యంత ప్రజాదరణ పొందిన గీతాల్లో ఒకటి 'పోకిరి'లోని 'డోలె డోలె' గీతం. రచయిత-విశ్వ. ఒక హిట్‌ సాంగ్‌ ఎలా పుడుతుంది అంటే... కచ్చితంగా ఇలా అని చెప్పలేం! అంటారు విశ్వ .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : విశ్వ (గీత రచయిత),
  • చదువు : డిగ్రీ ,
కెరీర్ (career)
  • తనమాటల్లో ఎలా అంటారు ....చిన్నప్పుడు నాటకాల్లో నటించేవాణ్ని. మా గురువుగారు నెమలికంటి రాధాకృష్ణ. ఆయనతో కలసి రాళ్లపల్లిగారు రాసిన 'ముగింపులేని కథ' నాటకంలో నటించాను. ఎన్నో ప్రదర్శనలకు వెళ్లాను. సంగీతమూ సాహిత్యంపట్ల ఆసక్తి పెరగడానికి తొలిబీజాలు అక్కడే పడ్డాయి. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఉద్యోగంవైపు మనసు మళ్లలేదు. సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేశాను. 'సంతోషం'లో 'మెహబూబా'... నేను రాసిన తొలి పాట. దీన్ని పాడింది కూడా నేనే! ఆ తరువాత 'సత్యం'లో 'కుచ్‌కుచ్‌ పానాహై' పాట రాసి, ఆలపించాను. అక్కణ్నుంచీ గీత రచయితగా ప్రస్థానం వెుదలైంది. అలా అలా... నిన్నవెున్నటి 'అతడు'... 'పోకిరి'... 'దూకుడు'... ఇలా రాస్తూ వీలైనప్పుడు పాడుతూ ఉన్నాను. అయితే, నేను గాయకుణ్ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా పాట రాసి సంగీత దర్శకునికో, దర్శకునికో వినిపిస్తున్నప్పుడు వాళ్లే... 'మీరు బాగానే పాడుతున్నారు. సినిమాలోనూ పాడొచ్చుగా' అనేవారు. అలా పాడుతున్నాను. అంతేకాదు, అనుకోకుండా సంగీత దర్శకునిగా కూడా మారాను. 'హైదరాబాద్‌ నవాబ్స్‌', 'పోలీస్‌ పోలీస్‌', 'మంగళ' చిత్రాలకి బాణీలు
పాటలు రాసిన కొన్ని సినిమాలు (filmography ):
  • పోకిరి -- లో ''డోలె డోలె'' గీతం ,
  • సంతోషం --లో ''మెహబూబా...'',
  • సత్యం - లో " కుచ్ కుచ్ పానాహై... '',
  • అతడు ,
  • దూకుడు ,
  • హైదరాబాద్ నవాబ్స్ ,
  • పోలీష్ పోలీష్ .,
  • మంగళ ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Thursday, December 15, 2011

M.S.Reddy(producer)-ఎం.ఎస్.రెడ్డి

పరిచయం (Introduction) :
  • యం.యస్.రెడ్డి గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు రచియిత . చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు..1963 లో నెల్లూరు లో సుందర్ మహల్ థియేటర్ ను నిర్మించారు . హైదరాబాద్ లో ' శబ్ధాలా స్టుడియోను స్థాపించారు . నిర్మాతగా, గేయకవిగా, పద్య కవిగా, పలు సంఘాలకు నాయకుడిగా...తెలుగువారికి దగ్గరైన యం.ఎస్‌.రెడ్డి ఇకలేరు. ఆయన మరణించారన్న (11-డిసెంబర్ 2011) వార్త సినీ అభిమానుల్ని కలవరపర్చింది. మంచి సినిమాలేకాదు, మంచి మనసు కలవారని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆయనకు నివాళి అర్పించారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ఎం.ఎస్.రెడ్డి (పూర్తిపేరు -మల్లెమాల సుందర రామిరెడ్డి ),
  • కలం పేరు : మల్లెమాల ,
  • పుట్టిన తేదీ : 15- ఆగస్ట్ -1925 ,
  • నివాసము : ఫిలిం నగర్ -హైదరాబాద్ ,
  • పుట్టిన ఊరు : అలివిరి గ్రామము -నెల్లూరు జిల్లా , వెంకటగిరి తాలూక ,
  • పిల్లలు : కొడుకు - శ్యాంప్రసాద్ రెడ్డి ,
  • తొలి సినిమా : భార్య (తెలుగు),
  • మరణము : 11.డిసెంబర్ 2011,
కెరీర్ (Career):
  • నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924, ఆగస్టు 15న యం.ఎస్‌.రెడ్డి జన్మించారు. వీరిది కాస్త పేరున్న వ్యవసాయ కుటుంబం. అయినా కూడా కుటుంబ పరిస్థితులు అనుకూలించక చదువుకు దూరమయ్యారు. ఆర్థిక విషయాల్లో తండ్రి జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల యం.ఎస్‌.రెడ్డి బాల్యం కష్టాలబాట పట్టింది. చదువుకోవాలనే ప్రయత్నం సాగలేదు. వ్యవసాయం చేద్దామనుకున్నాడు. అదీ ఫలించలేదు. చివరికి వడ్డెరవాళ్లతో కూలికి సైతం వెళ్లారు. 36 రూపాయాలు సంపాదించారు. ఇందులో నుంచి 20 రూపాయల పెట్టుబడితో తాటి పీచు కొట్టించి అమ్మడం చేశారు.
తర్వాత తంగేడు పూలు, చింతకాయలు, మామిడికాయలు, మిరపకాయలు, పెసలు, మినుములు, కందులు మొదలైనవన్నీ ఆయన వ్యాపార వస్తువులుగా మారాయి. శ్రమకు మించిన ఫలితం లభించింది. కాలాగుణంగా వ్యాపారాన్ని ఎలా నడపాలో నేర్చుకున్నారు. ఈ ప్రయాణంలో కొన్నాళ్లు గడిచాయి. నిద్రాహారాలు మాని చాలా వ్యాపారాలు చేశాడు. తద్వారా ఆయన వద్ద సుమారు 40 వేల రూపాయలు పోగయ్యాయి. అప్పులు చెల్లించి తండ్రి, తాతల భూములు విడిపించారు. జీవితంలో ఆయనకు లభించిన తొలి విజయమిది. రాజకీయ, సాహితీ మిత్రులతో అనుబంధం పెంచుకున్నారు. మరోవైపు మైకా వ్యాపారం ప్రారంభించారు. సుందర్‌ మహల్‌ అనే సినిమా థియేటర్‌ను గూడురులో నిర్మించారు.
  • వ్యాపార నిమిత్తం మద్రాస్‌ పయనం ఆయన్ని సినిమావైపు మరల్చింది. ఓ తమిళ డబ్బింగ్‌ సినిమా హక్కులు కొని, తెలుగులో విడుదల చేశారు. ఆ చిత్రం పేరు 'కన్నెపిల్ల'. 1966 డిసెంబర్‌ 26న విడుదలైంది. అదే రోజు ఎన్టీఆర్‌ కంచుకోట అనే చిత్రం విడుదలైంది. అయినా 'కన్నెపిల్ల' చిత్రం విజయం సాధించింది. తర్వాత కొంటెపిల్ల, కాలచక్రం అనే రెండు డబ్బింగ్‌ సినిమాలు విడుదల చేశారు. ఇవి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. కె.యస్‌.ప్రకాష్‌రావుతో 'భార్య' అనే సినిమాను మొదలెట్టే సమయంలో శ్రీశ్రీ సాంగత్యం లభించింది. శ్రీశ్రీని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి, కొడుకుతో కప్పు కాఫీ అందించి, శ్రీశ్రీ కాళ్లకు నమస్కరించమన్నారట.
1969లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'కలిసిన మనసులు' తీశారు. సినిమా మాత్రం విజయా పిక్చర్స్‌వారు విడుదల చేశారు. సినిమా అపజయం పాలైంది. యం.ఎస్‌.రెడ్డి అప్పటివరకూ సంపాదించిన డబ్బంతా తుడుచు పెట్టుకపోయింది. తర్వాత భారీ తారాగణంతో 'శ్రీకృష్ణవిజయం' తెరకెక్కించారు. ఈ సమయంలో ఇండిస్టీలోని పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎలా వ్యవహరిస్తారన్న సంగతి స్వయంగా తెలుసుకున్నారట !
  • అందరికీ అంతో ఇంతో కొంతో ఇగో అనే ఫీలింగ్‌ ఉంటుందని పలు సందర్భాల్లో ఆయన చెప్పేవారు. 1971లో విడుదలైన 'శ్రీకృష్ణార్జున విజయం' కొద్ది లాభాలతో బయటపడ్డారు. కానీ 'ఎ.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు తీసిన 'పాండవ వనవాసం' విపరీతమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. శోభన్‌బాబుతో తీసిన 'కోడెనాగు' కూడా మంచి విజయాన్నే అందుకుంది. చిత్రం ఎంత గొప్పగా తీసినా నిర్మాతకు కన్నీళ్లే మిగులుతాయని తను తీసిన 'దొరలు-దొంగలు' చిత్రాన్ని ఉదహరిస్తారు. ఇలా చలన చిత్ర జీవితం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనెక్కి నడిచిందని తన ఆత్మకథలో చెప్పుకొన్నారు. ఆయన కష్టాలో ఉన్నప్పుడల్లా పాత పిక్చర్లలో వచ్చిన లాభాలే గట్టున పడేసాయి.--source : prajasakti news paper
నిర్మించిన /నటించిన కొన్ని సినిమాలు (filmography ):
  • భార్య ,
  • శ్రీకృష్ణ విజయం ,
  • వూరికి ఉపకారి ,
  • కోడెనాగు ,
  • ముత్యాలపల్లకి ,
  • ఏకలవ్య ,
  • పల్నాటి సింహం ,
  • బాల రామాయణం ,
  • అంకుశం ,
  • కన్నెపిల్ల ,
  • కలిసిన మనసులు ,
అవార్డులు :
  • 2005 లో రఘుపతి వెంకయ్య అవార్డు పొందినారు .
  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.