P. J. Sharma - పీజే శర్మ








పరిచయం (Introduction) : 


  • పూడిపెద్ది జోగీశ్వర శర్మ (పి.జె.శర్మ)ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. వీరి కుమారుడే ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు మరియు కథానాయకుడు సాయికుమార్. వీరు చిన్నతనం నుండే నాటకరంగం పై మక్కువ పెంచుకొని పేదరైతు, అనార్కలి, పల్లెపడుచు, ఆశాలత, కులంలేని పిల్ల, ఋష్యశృంగ, నవప్రపంచం మొదలైన నాటకాలలో ప్రధాన పాత్రలను పోషించారు.

    • వీరు 1954లో మొదటిసారిగా అన్నదాత సినిమాలో చిన్న వేషంలో కనిపించారు. 1957లో విజయనగరం రాఘవ నాటక కళాపరిషత్ పోటీలలో పాల్గొని సినీ ప్రముఖుల ఆహ్వానం మీద మద్రాసు చేరుకున్నారు. ఆరుద్ర మరియు శ్రీశ్రీ ల ప్రోత్సాహంతో తొలిసారిగా ఉత్తమ ఇల్లాలు (1957) చిత్రంలో డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ కుమార్ ప్రేమనజీర్ ధరించిన ఎన్నో పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఒక వైపు డబ్బింగ్ కళాకారుడిగా పనిచేస్తూనే కొన్ని వందల చిత్రాలలో నటించారు.
     జీవిత విశేషాలు (profile) : 

    • పేరు : పూడిపెద్ది జోగీశ్వర శర్మ (పి.జె.శర్మ),
    • పుట్టిన ఊరు : విజయనగరం జిల్లా కళ్ళేపల్లి గ్రామం,
    • పుట్టిన తేదీ : 24 మే 1933,
    • భార్య్ : నటి కృష్ణజ్యోతి (2960 లో వివాహము),
    • పిల్లలు : ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. పెద్దకొడుకు సాయికుమార్ ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు మరియు నటుడు, రెండవ కొడుకు రవిశంకర్ కూడా డబ్బింగ్ కళాకారుడే. మూడవ అబ్బాయి అయ్యప్ప పి. శర్మ సినీ దర్శకుడు. వీరి ఇద్దరు కుమార్తెలు కమల మరియు ప్రియ. వీరి మనవడు ఆది ప్రేమ కావాలి సినిమాతో హీరోగా తెలుగువారికి పరిచయమయ్యాడు.
    • మరణము : 2014, డిసెంబర్ 14 ఆదివారం నాడు గుండెపోటుతో మరణించాడు.

    నటించిన కొన్ని సినిమాలు (filmography ): 


    •     రంగులరాట్నం (1967).
    •     భాగ్యచక్రం (1968).
    •     కళ్యాణ మండపం (1971).
    •     కలెక్టర్ జానకి (1972).
    •     భక్త తుకారాం (1973) - మంత్రి.
    •     శ్రీరామాంజనేయ యుద్ధం (1975) - శివుడు.
    •     మహాకవి క్షేత్రయ్య (1976) - సిద్ధేంద్రయోగి.
    •     వేములవాడ భీమకవి (1976).
    •     కురుక్షేత్రం (1977).
    •     జీవన తీరాలు (1977).
    •     దాన వీర శూర కర్ణ (1977).
    •     ఇంద్రధనుస్సు (1978).
    •     సతీ సావిత్రి (1978).
    •     రామ్ రాబర్ట్ రహీమ్ (1980).
    •     స్వప్న (1980).
    •     న్యాయం కావాలి (1981) - న్యాయమూర్తి.
    •     ఖైదీ (1983).
    •     ముగ్గురు మొనగాళ్ళు (1983) - కమీషనర్.
    •     విజేత (1985).
    •     కర్తవ్యం (1990).
    •     ఈశ్వర్ అల్లా (1998).
    •     తొలిప్రేమ (1998).
    •     అతడు (2001).
    •     నాగ (2003).



    •  *==============================* 

     visiti my website > Dr.Seshagirirao-MBBS. 

    Comments

    Popular posts from this blog

    లీలారాణి , Leelarani

    Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

    పరిటాల ఓంకార్,Omkar Paritala