JogiNaidu-జోగినాయుడు








పరిచయం (Introduction) : 



  • ''దర్శకుడిని కావాలని పరిశ్రమలోకి అడుగుపెట్టాను. కానీ నటుడిగా గుర్తింపు సంపాదించా. 'స్వామి రా రా' తర్వాత ప్రాధాన్యమున్న పాత్రలు దక్కుతున్నాయి'' అంటున్నారు జోగినాయుడు. తొలుత బుల్లితెర ద్వారా గుర్తింపు సంపాదించిన ఆయన 'మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. వందకిపైగా సినిమాల్లో నటించారు. పరిశ్రమకి వచ్చి 20యేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జోగినాయుడు మాట్లాడుతూ ''ఈవీవీగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొని పరిశ్రమకి వచ్చా. 'అల్లుడా మజాకా'కి మూడు రోజులు పనిచేశాక ఎక్కువమంది అయ్యారని తీసేశారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ దగ్గర పనిచేశా. బుల్లితెరతో గుర్తింపు సాధించాక సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. జోగిబ్రదర్స్‌గా కృష్ణంరాజుతో కలిసి ఎక్కువగా నవ్వించే పాత్రలే పోషించా. నటుడిగా కొనసాగుతూనే ఎల్‌.జె.స్టూడియోని స్థాపించి అందులో మూడొందల చిత్రాలకి నిర్మాణానంతర కార్యక్రమాలను చేశా. నష్టాలు రావడంతో ఆ స్టూడియోని అమ్మేశా. దర్శకత్వం చేయాలన్న నా కల మాత్రం అలాగే ఉండిపోయింది. త్వరలోనే అది నెరవేరుతుందని నమ్ముతున్నా. ఈ యేడాది చివర్లో నా మిత్రులతో కలిసి ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాన''ని తెలిపారు.


 జీవిత విశేషాలు (profile) : 


  • పేరు : జోగినాయుడు , 


నటించిన కొన్ని సినిమాలు (filmography ): 


  • స్వామి రా రా , 
  • మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది,


 *==============================* 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala