Shilpa(Mytreyi)-శిల్ప(మైత్రేయి)Actress cum Dabbing








పరిచయం (Introduction) :

  • శిల్ప అలియాస్ మైత్రేయి ... నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ .  నటిగా 'లక్కీ ఛాన్స్‌'  చివరి సినిమా


 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు : Shilpa(Mytreyi)-శిల్ప(మైత్రేయి)Actress cum Dabbing
  • ఊరు : నర్సారావుపేట ,
  • నాన్న : ప్రభుత్వోద్యోగి. ఉద్యోగరీత్యా నర్సరావుపేట నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు,
  • అమ్మ : అమ్మ కథలు రాస్తారు .
  • చదువు : డిగ్రీ ,
  • భర్త : 
  • పిల్లలు : ఇద్దరు ఆడ పిల్లలు ,
కెరీర్ : తన మాటల్లో :--
  • డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నాకు సంతృప్తినీ, ఫీల్‌ గుడ్‌నీ ఇచ్చింది 'దృశ్యం'. ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కుటుంబానికి కష్టం వస్తే ఎలా స్పందిస్తానో అలానే అనుకొని ఆ సినిమాలో డబ్బింగ్‌ చెప్పా. మీనా ఏడ్చే సన్నివేశాల్లో చాలా సందర్భాల్లో నేనూ నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నా. ఫీల్‌ అయితే తప్ప ఏ సన్నివేశానికైనా గొంతులో సహజత్వం రాదనేది నా అభిప్రాయం. ఇంతకీ నేను ఈ రంగంలోకి ఎలా వచ్చానో తెలుసా.... మా నాన్న ప్రభుత్వోద్యోగి. ఉద్యోగరీత్యా నర్సరావుపేట నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. మా అమ్మ కథలు రాసేది. తను రాసిన వాటిని నేను చదివి ఇంట్లో వాళ్లకి వినిపించేదాన్ని. టీవీ చూసినప్పుడు ఆ పాత్రని నేనైతే ఎలా చేసేదాన్నో వూహించుకొనేదాన్ని ఎలాగైతేనేం... పదో తరగతికి వచ్చేసరికి నటిని కావాలనే కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది. నాన్నకి చెబితే 'చక్కగా చదువుకోక నీకెందుకమ్మా ఆ రంగం' అన్నారు. అలిగి అన్నం తినడం మానేశా. నాన్న బాధపడ్డారు. చివరికి ఆడిషన్‌కి వెళతా. ఎంపిక కాకపోతే మీరు చెప్పినట్టే చదువుకుంటానని చెప్పి ఒప్పించా. అమ్మ మాత్రం నావైపే. నన్ను ఆడిషన్లకు తీసుకెళ్లేది. మైత్రేయి అనే నా పేరును శిల్పగా మార్చింది. తెలుగులో స్పష్టత, డైలాగులు చెప్పడం వంటివి నాకు ప్లస్‌ పాయింట్లు అయ్యాయి. అవే ఆడిషన్‌లో ఎంపికవ్వడానికి కారణం. దూరదర్శన్‌లోనా మొదటి సీరియల్‌ 'అనగనగా ఓ శోభ'. ఆ తరవాత 'పెళ్లిచూపులు', 'బుచ్చిబాబు', కన్యాశుల్కం', 'ఆనందో బ్రహ్మ'... ఇలా చాలానే! ఒక్క ధారావాహికలేంటి, వ్యాఖ్యాతగానూ చేశా. సందేశాన్నిచ్చే ప్రభుత్వ ప్రకటనలూ చేసేదాన్ని. మరో వైపు నాన్న సూచన మేరకు దూరవిద్యలో డిగ్రీ చదివా. 


నటించిన కొన్ని సినిమాలు (filmography ):

  • ఆపద్భాందవుడు ,
  • జంబలకిడి పంబ , 
  • యుగకర్తలు , 
  • మిస్టర్‌పెళ్లాం', 
  • 'తొలిప్రేమ', 
  • 'నరసింహ', 
  • 'పాండురంగడు', 
  • 'పంచాక్షరి', 
  • 'స్వరాభిషేకం',
  •  'రాజన్న', 
  • 'ఉలవచారు బిర్యానీ', 
  • 'దృశ్యం',
  •  'గాలిపటం'


డబ్బింగ్ : కొన్ని సినిమాలు - సీరియల్స్ ,---
  • 'ఉషాకిరణ్‌ మూవీస్‌' వాళ్లు 'అమ్మ'లో కావ్య అనే అమ్మాయికి డబ్బింగ్‌ చెప్పమని పిలిచారు. తరవాత 'పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌', 'అశ్విని'.. ఇలా ఆ బ్యానర్‌లోనే అవకాశాలు వరసగా వచ్చాయి. దాదాపు తొంభైల్లో వచ్చిన సినిమాల్లో సగానికిపైన నేనే డబ్బింగ్‌ చెప్పా. టబు, మనీషాకొయిరాలా, రవీనాటాండన్‌, ప్రీతిజింతా, అంజలాఝవేరి... వంటి వారికీ డబ్బింగ్‌ చెప్పారు . 
  • అంతరంగాలు ,
  • మేఘమాల , 
  • అరుందతి , 
  • మిస్టర్ పెళ్ళాం , 
  • రభస , 

  •  *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala