Rashi Khanna-రాశి ఖన్నా








పరిచయం (Introduction) : 

  • రాశి ఖన్నా ముంబై - బోలీవుడ్ కి చెందిన నటి . "ఊసలు గుస గుసలాడె " సినిమాలో నటించదం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హిందీ , తెలుగు లో కొన్ని సినిమాలు చేసారు. ఈమె మోడల్ గా వచ్చి నటిగా తెరపైకి వచ్చారు. ఎన్నో వ్యాపార ప్రకటలలో కనిపించారు .ఉదా: pizza , jewellery Tata sky, Alto800 and Domino's.  బోలీవుడ్ లో మదట సినిమా ''మద్రాస్ కేఫ్'' .


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : రాశి ఖన్నా, 
  • పుట్టిన ఊరు : ఢిల్లీ , 
  • పుట్టిన తేదీ : */*/1992,
  • రెసిడెన్స్ : ఢిల్లీ , 
  • నేషనాలిటీ : ఇండియన్‌, 
  • చదువు : మాస్టర్ ఇన్‌ సైకాలజీ , 
  • ఎత్తు : 5 ' 6'' (5 అడుగుల 6 ఇంచీలు),


టించిన సినిమాలు (filmography ): 

  • మద్రాస్ కేఫ్ (హిందీ)-2013,
  • ఊసులు గుస గుసలాడె(తెలుగు)-2014 ,
  • మనం (తెలుగు)-2014,
  • 2014-- జోరు (సందీప్ కుమార్ సరసన),
  • సినిమా?గోపిచంద్ తో(తెలుగు) -2014,
Personal touch@eenadu sunday 16-11-2014

  • పూర్తిపేరు : రాశీ ఖన్నా
  • పుట్టి పెరిగింది : దిల్లీలో
  • చదువు : దిల్లీ లేడీ శ్రీరామ్‌ కాలేజీ నుంచి ఇంగ్లిష్‌ ఆనర్స్‌లో డిగ్రీ చేశా. ప్రస్తుతం సైకాలజీలో పీజీ చేస్తున్నా.
  • తొలిచిత్రం : హిందీలో జాన్‌ అబ్రహంతో 'మద్రాస్‌ కెఫే'. తెలుగులో 'వూహలు గుసగుసలాడే'.
  • తొలి అవకాశం : నటి వాణీకపూర్‌, నేనూ స్నేహితులం. ఇద్దరం మోడలింగ్‌ అవకాశాల కోసం ప్రయత్నిస్తోన్న సమయంలో, మద్రాస్‌ కెఫే ఆడిషన్లలో ఎంపికయ్యా. ఆ సినిమా చూసి నిర్మాత సాయి పిలిచి అవకాశమిచ్చారు.
  • సినిమాల్లోకి రాకముందు : ముంబైలో మోడలింగ్‌ చేసేదాన్ని. టాటాస్కై, ఆల్టో, డొమినోస్‌ లాంటి ప్రకటనల్లో నటించా.
  • మరచిపోలేని అనుభవం : ఏఎన్‌ఆర్‌ చివరి చిత్రం 'మనం'లో అతిథి పాత్రలో కనిపించడం.
  • సినిమాల్లోకి రాకపోతే : కాపీరైటర్‌ కావాలని కోరికగా ఉండేది. ఆ కోర్సు చేయడానికే ముంబై వచ్చి అనుకోకుండా మోడలింగ్‌లో అడుగుపెట్టా.
  • ప్రస్తుతం చేస్తున్నవి : సందీప్‌ కిషన్‌తో 'జోరు', గోపీచంద్‌తో 'జిల్‌'.
  • ఇష్టమైన వ్యాపకం : పాటలు పాడటం చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక రాగం తీస్తుంటా. అందరూ నన్ను 'ఫ్రీ రేడియో' అని పిలుస్తారు.
  • తెలుగు సినిమా గురించి : ఇక్కడ హీరోయిన్లకు పాటలూ, రొమాన్స్‌ సన్నివేశాలకు తప్ప పెద్ద ప్రాధాన్యం ఉండదని అందరూ చెప్పారు. తొలిసినిమాలో నాకొచ్చిన పాత్రని చూశాక అది అబద్ధమని తెలిసింది
  • ఆశ్చర్యపరచిన విషయం : తొలిసినిమా షూటింగ్‌ మధ్యలో 'ఈగ', 'లెజెండ్‌' సినిమాలకు కూడా సాయి నిర్మాత అని తెలిసి నమ్మలేకపోయా. అంత పెద్ద నిర్మాతయినా మాలో ఒకరిగా కలిసిపోయారు.
  • తెలుగు సంగతి : తెలుగు నేర్చుకోవడం ఓ సవాలుగా తీసుకున్నా. ప్రస్తుతం నా స్నేహితుడు డైలాగులను తర్జుమా చేయడంలో సహాయం చేస్తున్నాడు. భవిష్యత్తులో నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటానన్న నమ్మకం ఉంది.
  • ప్రేమ గురించి : తొలిచూపు ప్రేమలను అస్సలు నమ్మను. నాకు బాగా తెలిసిన అబ్బాయినే ప్రేమించి పెళ్లిచేసుకుంటా.




  •  *==============================*


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala