Veena Ghantasala (singer cum Dubbing)-వీణా ఘంటసాల









పరిచయం (Introduction) :

  • వీణా ఘంటసాల గాయనిగాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఘంటసాల కుటుంబములో ఈమె ఒక్కరే సినీ గాయనిగా పైకొచ్చినారు.  ఈమె గంటసాల వెంకటేశ్వరరావు - సావిత్రి ల చిన్న కొడుకు -రత్నకుమార్ కుమార్తె. 


 జీవిత విశేషాలు (profile) :

  • పేరు : వీణ ఘంటసాల , 
  • పుట్తిన ఊరు : చెన్నై .,  
  • నాన్న : రత్నకుమార్, 
  • తాతయ్య : ఘంటసాల వెంకటేశ్వరరావు ,
  • నాన్నమ్మ : సావిత్రి , 
  • చదువు : బి.కాం. ఎం.బి.ఎ. ,

కెరీర్ : 

  • ఆకట్టుకునే మాట తీరు  ఉన్నతంగా ఎదగాలని. ఆసక్తులకూ, అభిరుచులకూ పదును పెట్టుకున్నారు! మాటలూ, పాటల రంగం వైపు నడిచారు.  ప్రతిభతో పోటీకి నిలిచారు... తెర వెనుక మాటల మంత్రం వేసిన ఆనాటి గాయకుడు ఘంటసాల మనవరాలు వీణ. తన మాటల్లో ..........

సినిమా విడుదలైన రోజే 'మీ గొంతు అద్భుతం' అని వేల ఎస్సెమ్మెస్‌లు.. మెయిల్‌లో ఇన్‌బాక్సు నిండిపోయింది. జీవితంలో ఇంత కంటే పెద్ద ప్రశంస ఇంకేమీ ఉండదు. అలానే చాలా వెబ్‌సైట్లు నా గొంతును పొగుడుతూ వ్యాసాలు రాశాయి. ఈ సంతోషంలో మునిగి తేలుతున్న నేను నా గురించి చెప్పాలి అంటే... నేను ఘంటసాల వారి అమ్మాయిని. ఇలా అనగానే మా తాతగారు ఘంటసాల వెంకటేశ్వరరావు అందరికీ గుర్తొస్తారు, మా నాన్న రత్నకుమార్‌ గొంతు చెవుల్లో మోగుతుంది. అసలు నేను ఈ రంగంలోకి రావడానికి స్ఫూర్తి వాళ్లిద్దరే.

పదేళ్లకే డబ్బింగ్‌ చెప్పా:
తాతగారు కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినా.. ఆయన కెరీర్‌ ప్రారంభించి తుది శ్వాస విడిచే వరకూ చెన్నైలోనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే... నేను తాతగారిని చూళ్లేదు. నానమ్మ మాత్రం తాతయ్య ఎన్ని కష్టాలు పడి సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారో చెప్పేది. నాన్న కూడా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, వ్యాఖ్యాతగా, న్యూస్‌రీడర్‌గా.. తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. నా జీవితంలో రియల్‌ హీరోస్‌ అంటే తాతయ్యా, నాన్నే. చిన్నతనం నుంచీ నేనూ వాళ్లిద్దరిలా పేరు తెచ్చుకోవాలనుకున్నా. గాయనిగా తాతయ్య వారసత్వాన్నీ, డబ్బింగ్‌ కళాకారిణిగా నాన్న వారసత్వాన్నీ అందిపుచ్చుకోవాలనుకున్నా. నాలుగేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నా. తాత పాటలు వింటూ తన్మయత్వం చెందా. ప్రతి పాటా ఓ పాఠం అనే చెప్పాలి. వీలున్నప్పుడల్లా నాన్నతో కలిసి డబ్బింగ్‌ థియేటర్‌కి వెళ్లేదాన్ని. నా చిన్నతనంలో 'సతీ లీలావతి', 'అభినందన', 'రోజా', 'మౌనరాగం', 'డీడీఎల్‌జీ', 'ప్రేమించు పెళ్లాడు'.. వంటి సినిమాలకు నాన్న డబ్బింగ్‌ చెప్పడం బాగా గుర్తుంది. పదేళ్ల వయసులో 'నేనూ నీలా డబ్బింగ్‌ చెబుతా' అని నాన్నని అడిగా. మొదటిసారి 'మోగ్లీ' కార్టూన్‌ షోకి నా గొంతు అరువిచ్చా. మంచి స్పందన వచ్చింది. ఆ తరవాత జెమినీ టీవీ ధారావాహిక 'సూర్యవంశం'లో ప్రధాన పాత్రధారికి చెప్పా. పదో తరగతికి వచ్చాక కళల్ని ప్రవృత్తిగా మార్చుకొని... వృత్తిపరంగా వ్యాపారం చేయాలనుకున్నా. మన కాళ్ల మీద మనం నిలబడి... ఓ పదిమందికి ఉపాధినిచ్చినప్పుడు కలిగే సంతృప్తీ, ఆత్మవిశ్వాసం ఎంతో మాటల్లో చెప్పలేను. నాతోటి వాళ్లంతా ఇంజినీరింగ్‌ వైపు అడుగులు వేస్తున్నా నేను డిగ్రీ చదివి ఎంబీఏ చేశా. త్వరలోనే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నా.

తప్పులు దొర్లితే వూర్కోరు:
నేను మొదటిసారి 'గోవా' సినిమాలో పియా బాజ్‌పాయ్‌కి... తరవాత 'సెగ'లో బిందు మాధవికీ, 'ఉరిమి'లో జెనీలియాకి, 'ఏ మాయ చేశావే'లో హీరో చెల్లెలి పాత్రకూ, 'బిరియానీ'లో హన్సికకూ డబ్బింగ్‌ చెప్పా. ఇవన్నీ నన్ను గుర్తించి వచ్చిన అవకాశాలే! మా కుటుంబం నాకు ఇచ్చిన బహుమతి ఏంటంటే... తెలుగు స్పష్టంగా మాట్లాడటం. మా నానమ్మ సమయం దొరికినప్పుడల్లా భాష నేర్పించేది. తాతయ్య పాటలు వింటే చెప్పేదేముంది... చక్కటి తెలుగు ఒంటబడుతుంది. మా ఇంట్లో తెలుగు తప్ప మరే భాషా మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడేప్పుడు తప్పు దొర్లితే నాన్న అసలు వూర్కోరు. నా కోరిక తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవ్వడం. అందుకే పప్పు అనే సౌండ్‌ ఇన్‌ఛార్జికి ఫోన్‌ చేసి డబ్బింగ్‌ మీదున్న ఆసక్తిని వివరించా. ఈ మధ్య అనుకోకుండా అతని నుంచి ఫోన్‌. 'పూరీగారి సినిమాలో నటి ఆదాశర్మకు డబ్బింగ్‌ చెప్పాలి' అన్నారు. చాలామంది ఆడిషన్‌కి వచ్చారు. రెండు రోజుల తరవాత ఎంపికైనట్టు చెప్పారు. డైరెక్ట్‌ తెలుగు సినిమాకు డబ్బింగ్‌ చెప్పడం ఇదే మొదటిసారి. 'హార్ట్‌ఎటాక్‌' పాటల రికార్డింగ్‌ పూర్తయ్యాక పూరీ గారికి నేను గాయనిని అని తెలిసింది. 'ముందే తెలిస్తే ఓ పాట నీతోనే పాడించే వాడిని' అన్నారు. ఇంతకీ నేను పాడిన పాటలంటే, 'ఉరిమి'లో 'చిన్ని చిన్ని వెన్నెల', 'అందాల రాక్షసి'లో 'నిన్ను చేరవచ్చేలా..' ఇవి రెండే.

అవకాశాలొచ్చాయి:

  • 'హార్ట్‌ ఎటాక్‌'లో హీరోయిన్‌ పాత్రకు భావోద్వేగాలు ఎక్కువ. సెకండాఫ్‌లో అయితే బాగా ఏడవాలి. నేను పాత్రలో లీనమయ్యా కాబట్టి బాగా ఏడ్చా. ఆదాశర్మ నటనకు ఫిదా అయ్యా. అందుకే అంత బాగా డబ్బింగ్‌ చెప్పగలిగా. సినిమా విడుదలైన రోజే అభినందనలతో పాటూ అవకాశాలూ వెతుక్కుంటూ వచ్చాయి. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, గాయకులుగా రాణిస్తున్న సునీత, చిన్మయి వృత్తిపరంగా ఆదర్శం. నేనూ వాళ్లలా రెండు రంగాల్లో కొనసాగాలని ఆశపడుతున్నా.


 సినిమాలు (filmography ): 

  • 'హార్ట్‌ఎటాక్‌''
  • గోవా' సినిమాలో పియా బాజ్‌పాయ్‌కి... 
  • 'సెగ'లో బిందు మాధవికీ,
  • 'ఉరిమి'లో జెనీలియాకి,
  •  'ఏ మాయ చేశావే'లో హీరో చెల్లెలి పాత్రకూ,
  •  'బిరియానీ'లో హన్సికకూ డబ్బింగ్‌------------ చెప్పారు .
Courtesy with Eenadu vasundara 12-Feb-2014


  • ===================

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala